బంగారం ధరలు తగ్గితే ఎంత ఆనందమో.. స్థిరంగా ఉంటే కూడా అంతే సంతోషం. ముఖ్యంగా మగువలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని చూస్తుంటారు. బంగారం అంటే అంత మోజు. బంగారం ఉంటే చాలు ఇక మరేదీ అవసరం లేదన్న రీతిలో వ్యవహరిస్తారు మహిళలు. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ బాండ్లు కొనుగోలు చేస్తుంటే దక్షిణ భారత దేశంలో మాత్రం బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా ఉంది.
కొనుగోళ్లు లేక…
పెళ్లిళ్లు, కుటుంబంలో జరిగే ఏ శుభ కార్యాలకైనా బంగారాన్ని కొనుగోలు చేయడం రివాజుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతున్నాయి. ఎక్కువగా కొనుగోళ్లు లేక డిమాండ్ పడిపోయిందనే వారు కూడా ఉన్నారు.
వెండి మాత్రం…
దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,950 రూపాయలుగా కొనసాగుతుంది. వెండి ధర కిలోపై రెండు వందల రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 78,200 రూపాయలుగా ఉంది.