హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలెప్మెంట్ అధారిటీ రేపు నిర్వహించాల్సిన వేలాన్ని రద్దు చేసింది. బోడుప్పల్లో లే అవుట్ వేలం రేపటి నుంచి జరగనుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అయితే నిర్వహణ పరమైన కారణాలతో రేపటి వేలం పాటను రద్దు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు.
కోర్టులో కేసులు…
ఈ భూములపై న్యాయస్థానాల్లో పిటీషన్ దాఖలు కావడంతోనే హెచ్ఎండీఏ అధికారులు రేపటి వేలాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. బోడుప్పల్ లే అవుట్ లో మొత్తం యాభై ప్లాట్లను వేలం వేసేందుకు ముందుగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్ఎండీఏ అప్సెట్ ప్రైజ్ గజానికి ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించింది. ఈ రెసిడెన్షియల్ జోన్లో 260, 300 గజాల చొప్పున ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించింది. ప్రజల నుంచి పెద్దయెత్తున రెస్పాన్స్ వస్తుందని భావించారు. న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడంతో హెచ్ఎండీఏ అధికారులు వెనక్కు తగ్గారు.