(GOLD)
భూమిని పెట్టుబడిగా చూస్తారు కొందరు. అలాగే మరికొందరు బంగారాన్ని కూడా అదే తరహాలో చూస్తారు. బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికైనా మంచి ధర పలుకుతుందని నమ్మకంతో అనేక మంది పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు. అయితే కొందరు స్టేటస్ సింబల్‌గానూ, మరికొందరు సెంటిమెంట్‌గానూ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఎక్కువగా కనపడుతుంది. అందుకే బంగారం దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. వీధికొక్క జ్యుయలరీ షాపు మనకు దర్శనమివ్వడానికి కూడా కారణం బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండటమే.
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
శ్రావణమాసంలోకి… (GOLD)
ఇక శ్రావణ మాసంలోకి దాదాపు వచ్చేశాం. పెళ్లిళ్ల సీజన్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. మరో రెండు నెలలు బంగారం అమ్మకాలకు కొదవే ఉండదన్న భరోసా వ్యాపారుల్లో కనిపిస్తుంది. వివాహ వేడుకల్లోనూ, శుభకార్యాల్లోనూ బంగారాన్ని వినియోగించడం మన సంస్కృతిలో భాగంగా వస్తుండటంతో జ్యుయలరీ దుకాణం యజమానులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నారు. బంగారం ఎంతమేర ఆభరణంగా వేసుకున్నామనేదే ఇతరులు చూస్తారన్న భావన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మహిళల్లో ఎక్కువగా కనపడుతుంది.
ఆనవాయితీగా…
విదేశాల్లో అయితే బంగారం వాడకం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగానే కాదు.. అసలు వాడరు. వారు పెట్టుబడి పెట్టదలచుకుంటే గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేస్తారు. అంతే తప్ప ఆభరణాలను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకునేందుకు సాహసించరు. అది ప్రమాదకరంగా కూడా భావిస్తారు. కానీ మనోళ్లు సంప్రదాయం పేరుతో సౌందర్యం కోసం కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో పాటు నగల షోరూం వాళ్లు చెప్పే ఊరించే పథకాలు కూడా వారిని అటువైపు లాగేలా చేస్తాయి.
ధరలు ఇలా… (GOLD)
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. శ్రావణమాసం అయినప్పటికీ, పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్నప్పటికీ బంగారం ధరలు పెరగకపోవడం తో మగువలు సంతోషపడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయల వరకూ తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,550 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,510 రూపాయలుగా నమోదయి ఉంది. ఇక కిలో వెండి ధర 76,000 రూపాయలుగా కొనసాగుతుంది. (GOLD)