శ్రావణమాసం అంటే శుభ మాసం . శ్రావణ మాసానికి మరో పేరు కూడా ఉంది అదేమిటి అంటే “నభో మాసం”. నభో అంటే “ఆకాశం”. హైందవ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి గొప్ప విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరాలను 12 మాసాలు ఉండగా అందులో 5వ మాసమే ఈ శ్రావణమాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు దేవాలయం లానే తలపిస్తుంది. శ్రావణ మాసంలో చేపట్టి ఏ పూజ అయినా అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెబుతుంటారు.
ఈ మాసంలో ఉపవాసాలు పూజలు చేయడం వలన అంతా మంచే జరుగుతుందని భావిస్తుంటారు. శ్రీమహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది .ఈ శ్రావణమాసం లో అనేక రకాలైన వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన మంచి ఫలితాలను అందుకోవచ్చు.మహా శివునికి కూడా ఈ మాసం అత్యంత ప్రీతికరమనే చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పుట్టినది కూడా ఈ శ్రావణమాసంలోనే, అంతేకాదు శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే ఆయన నక్షత్రము శ్రవణా నక్షత్రం.
హనుమంతునితో పాటు విగ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ శ్రావణమాసంలోని మంగళవారం రోజులలోనే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి.శ్రావణమాసం వచ్చింది అంటే ప్రతి ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే నూతన గృహప్రవేశాలు కానీ పెళ్లిళ్లు కానీ ఏ మంచి కార్యాన్ని ప్రారంభించడానికి అయినా ఈ మాసం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసంలోని ప్రతి రోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ సోమవారం
ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఈ మాసం ఆ మహా శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ పరమేశ్వరుని ఆరాధించుటకు ఈ శ్రావణమాసం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను కృపను పొందవచ్చు. శ్రావణ సోమవారం రోజున చాలామంది ఉపవాసాలు కూడా చేస్తారు. ఇలా ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష వేళలో ఆ మహా శివునికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన పుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు.
శ్రావణ మంగళవారం
ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా హనుమంతుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ మాసంలో వచ్చే మంగళవారంలోనే జన్మించారు భాబట్టి మంగళవారాలు కూడా అత్యంత విశిష్టత కలిగిన పరిగణిస్తారు ఈ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరిస్తుంటారు కొత్తగా పెళ్లయిన వధువులు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు ఆచరిస్తారు పెళ్లి కానీ యువతులు కూడా మంచి భర్త రావాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.
శ్రావణ బుధవారం ,గురువారాల్లో…
శ్రావణమాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనవే అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక ఉదా హరణ శ్రావణమాసంలో వచ్చే ప్రతి బుధవారం మరియు గురువారం రోజున బుధుడిని గురువుని ప్రత్యేకంగా. ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారట. సంపద వృద్ధి చెందాలని తెలివితేటలు తో విద్య లో ముందుకు వెళ్లాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు
శ్రావణ శుక్రవారం
ఈ శ్రావణమాసంలో అన్ని రోజుల కంటే అత్యంత ప్రత్యేకమైనది శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అమ్మవారికి పూజలు చేయడం నోము నోచుకోవడం చేస్తుంటారు.
శ్రావణ శనివారం
సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రమైన ఈ శ్రావణమాసంలోని ప్రతి శనివారం నాడు పూజలు చేయడం వలన ఆ మహా విష్ణువు ని ఆశీస్సులు పొందవచ్చని చెబుతుంటారు. శ్రీమహావిష్ణువుకి ప్రతిరూపంగా భావించే రావి చెట్టుని కూడా ఈ మాసంలో పూజిస్తూ ఉంటారు.
శ్రావణ ఆదివారం
శ్రావణమాసం మొదలవగా వచ్చే తొలి ఆదివారం నాడు మహిళలు “ఆదిత్య రాణుబాయి” వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈరోజున ఉపవాస దీక్షలు చేస్తూ శుభ ఫలితాలను కచ్చితంగా అందుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు. శ్రావణమాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనవే అని ఆ రోజుల్లో విశిష్టతను మనం తెలుసుకున్నాం ఇవే కాకుండా మరి ఎన్నో నోములు, పండుగలు ఈ మాసంలోనే ఉన్నాయి.