బంగారం ధరలు (Prices) తగ్గితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అందునా శ్రావణమాసం శుభఘడియల్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం అందరినీ సంతోషపర్చే విషయమే. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఎంతో మంది ఎదురు చూపులు చూస్తుంటారు. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఎంత తగ్గితే తమకు అంత లాభదాయకమని సంతోషించేవాళ్లు అనేక మంది ఉన్నారు. వీరితో పాటు పెట్టుబడి పెట్టేవారు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం చూసి మరింత కొనుగోలు చేయడానికి ముందుకు రావడం సహజ పరిణామం. బంగారం ధరలు మరింత పడిపోతాయని ఎదురు చూసే కన్నా తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మేలన్నది మార్కెట్ నిపుణుల సూచన.
ఊహించలేని…
అయితే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ఎప్పుడు పెరుగుతాయి? అన్నది మనం చెప్పలేం. ఊహించలేం. ఎందుకంటే దానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలతో పసిడి ధరల్లో పెరుగుదల, తగ్గుదలకు కారణాలుగా చెప్పాలి. కానీ గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటం కొంత ఆనంద దాయకమైనా ఉన్నట్లుండి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్నకాలంలో మరింత ధరలు పెరిగే అవకాశముందంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో… (Prices)
బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో పాటు డిమాండ్ కూడా పెరగడంతో ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. అందునా శ్రావణమాసం కావడంతో ధరలు పెరుగుదల ఊహించనంత స్థాయిలో ఉంటుందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కు ముందే బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకోవాలని కొందరు ఉత్సాహ పడుతుండటంతో ఇప్పటికే జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. సరికొత్త డిజైన్లతో జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వస్తున్నాయి. మరోసారి కరోనా విజృంభించే అవకాశముందని తెలిసి కష్ట సమయంలో పసిడి తమకు ఆదుకుంటుందని కొనుగోలు చేసే వారు కూడా అధికంగానే కనిపిస్తున్నారు.
వెండి మాత్రం…
ఈ పరిస్థితుల్లో తాజాగా మూడో రోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల నుంచి ధరలు తగ్గడమంటే మామూలు విషయం కాదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే స్వల్పంగానే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై కేవలం ముప్ఫయి ఐదు రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,100 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,020 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో 72,000 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక ఆలోచించకండి. కొనుగోలుకు ముందుకు రండి. కొనుగోలుదారులంతా ఇక క్యూకట్టేయొచ్చు. బంగారం ధరలు బాగానే తగ్గాయని చెప్పాలి. (Prices)