Gold Day
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు ఈరోజు కూడా పెరగలేదు. సాధారణంగా బంగారం ధరలు బులియన్ మార్కెట్ లో ప్రతి రోజూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కానీ నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రావణమాసం వస్తుందంటే చాలు బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే. వాటి ధరలను ఎవరూ ఆపలేరు. అందుకు కారణాలు అనేకం. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో పాటు మహిళలు శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ కు తగినట్లు బంగారం దిగుమతులు లేకపోవడంతో ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి.
పెరగడానికి…
దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణంతో పాటు రష్యా – ఉక్రెయిన్ ల మధ్య గత ఏడాదిగా జరుగుతుండటం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయంటారు. ఎప్పుడూ లేనంత.. ఏ వస్తువుకు పెరగనంత ధరలు బంగారం విషయంలోనే మనం చూస్తుంటాం. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. మహిళలు బంగారం కొనుగోలు వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో పాటు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక వస్తువుగా మారడంతో బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది.
స్టేటస్ సింబల్ గా… Gold Day
రానున్న కాలంలో బంగారం ధర పది గ్రాములు అరవై వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పెట్టుబడులుగా చేసే వారు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. భూమి అయితే డాక్యుమెంట్లు, ఎక్కువ మంది మోసాలు చేస్తుండటంతో భూమి తర్వాత బంగారానికే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. బంగారం కొనుగోళ్లలో భారతదేశం మాత్రమే అగ్రస్థానంలో నిలవడానికి కూడా అనేక కారణాలు చెబుతున్నారు. దీనిని సెంటిమెంట్ గా చూస్తారు. అదే సమయంలో స్టేటస్ సింబల్ గా పరిగణిస్తారు. అందువల్లనే బంగారం కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. శ్రావణమాసం వస్తుందంటే చాలు బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే. వాటి ధరలను ఎవరూ ఆపలేరు. అందుకే చిన్న పట్టణం నుంచి నగరం దాకా ఇక్కడ గల్లీకొక జ్యుయలరీ షాపు కనిపిస్తుంది.
వెండి మాత్రం…
దేశంలో గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరగడం లేదు. నేడు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,100 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,020 రూపాయలుగా నమోదయి ఉంది. ఇక కిలో వెండి ధర 76,500 రూపాయలుగా ఉంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. Gold Day