బంగారం (Gold) ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ కు అనుగుణంగా వాటి ధరలు మనం అనుకున్న స్థాయిలో ఉండవు. బంగారం ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా నేడు కొందరికే బంగారం దక్కుతుంది. పేదలకు, సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు పసిడి భారంగా మారింది. పసిడిని కొందరికే సొంతంగా మారనుంది. బంగారం భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగమయింది. బంగారం కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అందులో పెరగడమే తప్ప తగ్గడం జరిగినా స్వల్పంగా మాత్రమే. అయితే బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. పెట్టుబడిగా పెట్టేవారైనా, శుభకార్యాలకు కొనుగోలు చేసే వారైనా ముందుగా కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అవసరాలకు…
అయితే బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, భారత ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో పసిడి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. స్థిరంగా ఉన్నా కొనుగోలు చేయమని సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఐదో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
స్టేటస్ సింబల్ గా… (Gold)
బంగారం అనేది స్టేటస్ సింబల్ గా మారింది. సమాజంలో గౌరవం ఉండాలంటే ఎంత బంగారం ఉంటే అంత మంచిదనే అభిప్రాయం భారతీయుల్లో ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో బంగారం అనేది పెట్టుబడిగా మారడంతో డబ్బులున్న వాళ్లు బంగారం కొనుగోలు చేసి తమ వద్ద భద్రపర్చుకుంటున్నారు. పెరిగినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకునే వాళ్లు కూడా అధికంగా ఉన్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడే డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్న జ్యుయలరీ దుకాణాలు మరెక్కడాకనిపించవు. ఆఫర్లు కూడా ఎక్కువగా దక్షిణ భారత దేశంలోనే కనిపిస్తాయి.
నేడు కూడా…
అయితే ఐదో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,100 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,020 రూపాయలుగా నమోదయింది. వెండి ధరలు కూడా అంతే. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర 73,300 రూపాయలుగా కొనసాగుతుంది. బంగరాం, వెండి కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడిగా పెట్టేవారైనా, శుభకార్యాలకు కొనుగోలు చేసే వారైనా ముందుగా కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సో.. ఇక త్వరపడండి. (Gold)