వాట్సప్ (Meta) యూజర్స్ కి గుడ్ న్యూస్. మంచి, మంచి ఫోటోలు, వీడియోలు మీ ఫ్రెండ్స్ కి పంపుతుంటే.. క్వాలిటీ తగ్గిపోయి నాసిరకంగా ఉన్నాయన్న దిగులు ఇకపై ఉండదు.. అలాగే.. ఎవరికైనా తప్పుడు మెసేజ్ పెట్టి.. పొరపాటున నాలిక కొరుక్కోవాల్సిన అవసరం అసలే లేదు.. ఇలాంటి వాటన్నింటికీ చెక్ చెబుతూ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ యాజమాన్యం అందుబాటులోకి తెచ్చింది. తొలిసారిగా మీ ఫోటోస్, వీడియోస్, జిఫ్,డాక్యుమెంట్లకు సంబంధించిన క్యాప్షన్‌ను ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది వాట్సాప్ ప్లాట్ ఫామ్. ఆండ్రాయిడ్,ఐఓఎస్ ప్లాట్ ఫామ్స్ కు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఇప్పటికే కొందరు వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ తొందరలోనే మిగిలిన యూజర్లకూ ఈ సేవలు విస్తరించేలా ప్రయత్నాలు చేస్తోంది.
ఎడిట్ చేసుకునేలా…
ఈఏడాది మేనెలలో వాట్సాప్ చాట్స్ లో టెక్ట్స్ మెసేజ్ ను ఎడిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తేగా ఇప్పుడు ఆ సేవలను మరింత విస్తరిస్తోంది. గతంలో టెక్ట్స్ మెసేజ్ లను మాత్రమే సరిదిద్దుకునే వీలుండగా ఇప్పుడు మీడియా మెస్సేజ్ లకు లింక్ అప్ అయి ఉన్న క్యాప్షన్లనూ ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. ఒకరికి పంపేసిన మీడియా మెస్సేజ్ లను ,మెస్సేజ్ సంబంధిత క్యాప్షన్లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.. గతంలో టెక్స్ట్ మెసేజ్ లు ఎడిట్ చేసినట్లుగానే ఎడిట్ చాయిస్ ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా మెసేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి మెసేజ్ పంపిన 15 నిమిషాలలోగా ఈ కరెక్షన్ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు.
ఫొటోలు పంపే వారికి… (Meta)
వాట్సాప్ లో ఫోటోలు పంపుకునే వారికి ఈ సరికొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని మెటా సంస్థ సిఈవో మార్క్ జుకర్ బర్గ్ అంటున్నారు. ఇప్పుడు హెచ్ డి క్వాలిటీ ఫోటోలను కూడా వాట్సాప్ లో పంపుకునే ఈ అప్ గ్రేడెడ్ ఫీచర్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని జుకర్ బర్గ్ అంటున్నారు. ఇప్పటి వరకూ హై క్వాలిటీ వీడియోలు, ఫోటోలను సైతం కంప్రెస్ చేసి పంపాల్సి వచ్చేది. దీనివల్ల ఇమేజ్ క్వాలిటీ దెబ్బతింటోంది.తాజా ఫీచర్ తో యూజర్లు క్వాలిటీ వీడియోలు, ఫోటోలను సైతం హాయిగా అదే క్వాలిటీతో సెండ్ చేసుకోవచ్చు. ఒకసారి పంపేసిన టెక్స్ట్ మెసేజ్ లలో చిన్న చిన్న మార్పులు, కరెక్షన్లు చేసుకునే ఈ సౌకర్యం యాప్ యూజర్లకు వరంగా మారుతుంది. ఈ యాప్ వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
హెచ్ డి క్వాలిటీ వీడియోలు
ఏతా వాతా చేప్పే దేంటంటే.. ఈ సరికొత్త వాట్సప్ ఫీచర్ కేవలం ఎడిటింగ్ కేపబిలిటీస్ కోసమే కాదు..అత్యుత్తమ నాణ్యత లేదా హెచ్ డీ క్వాలిటీ ఫొటోలు పంపుకోడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ వాడుకోడానికి పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదు.. గతంలో లాగే ఫోటోలను పంపి.. స్టాండర్ట్ కు బదులు హెచ్ డీ క్వాలిటీ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.వాట్సాప్ ఫీచర్లలో తరచుగా చేస్తున్న ఈ మార్పులు ఆ యాప్ ను భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టాప్ మెస్సేజింగ్ ప్లాట్ ఫామ్ గా నిలబెడుతున్నాయి.. కాబట్టి వాట్సాప్ యూజర్లు ఇకనుంచి తమ ఫోటోలు, వీడియోలను హై క్వాలిటీతో పంపుకోవచ్చు.. అంతేకాదు. ఒకసారి పంపేసిన మెస్సేజ్ ను కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.. కానీ మెసేజ్ పంపిన పావుగంటలో మాత్రమే.. సో.. వాట్సప్ యూజర్లూ.. ఈ ఫీచర్ ను ఎంజాయ్ చేయండి. (Meta)