(prakash raj)
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం కామన్.. అయినా ఆయనలో ఫైర్ మాత్రం తగ్గదు… 58 ఏళ్ల ప్రకాష్ రాజ్ పదునైన విమర్శలు చేయడంలో దిట్ట . తాజాగా చంద్రయాన్ -3 మిషన్ పై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆయనపై ఓ రేంజ్ లో విమర్శకులు ఫైర్ అవుతున్నారు.. మోడీ ప్రభుత్వం పై ఏదో ఓ రూపంలో సెటైర్లు వేయడమేకాదు.. జస్ట్ ఆస్కింగ్ అంటూ చురకలు కూడా వేస్తుంటారు ప్రకాష్ రాజ్..ఆయన హ్యాష్ ట్యాగ్ అలాగే ఫేమస్ అయ్యింది.ప్రతీసారి ప్రకాష్ రాజ్ సెటైర్లు బాగా పండినా.. మిషన్ చంద్రయాన్ పై మాత్రం ఆ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయి.
తలంటేసిన నెటిజన్లు..
చంద్రయాన్ -3 మిషన్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతుంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ ఉదంతాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నారు.. చంద్రమండలంపై నిలబడి ఓ వ్యక్తి టీ తొరబోస్తున్నట్లు ఉన్న ఓ కార్టూన్ ను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.b అంతేనా దానికో పదునైన పంచ్ కూడా తగిలించారు. చంద్రుడిపై నుంచి వచ్చిన తొలిఫోటో అంటూ విక్రమ్ లాండర్, జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు. భారత సైంటిస్టుల ప్రతిభా పాటవాలను ప్రపంచం మెచ్చుకుంటున్న వేళ, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ కమర్షియల్ లాంచింగ్ లో భారత్ కి తిరుగు లేదని రుజువవుతున్న వేళ ప్రకాష్ రాజ్ ఇలా గాలి తీసే కామెంట్లు చేయడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ పై యావద్భారతావని ప్రశంసలు కురిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా దీనిపై అందరూ పాజిటివ్ గా స్పందిస్తుంటే.. ప్రకాష్ రాజ్ మాత్రం ఇలా డొంక తిరుగుడు విమర్శలు చేయడం ఏంటనే వాదనలు రేగుతున్నాయ్.
దేశంపై ప్రేమ కన్నా… (prakash raj)
ఇలాంటి విషయాల్లో జాతీయతావాదాన్ని, రాజకీయాలను చూడటమేంటని ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తూ ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ఓ వ్యక్తిని ద్వేషించడానికి, ఓ దేశాన్ని ద్వేషించడానికి తేడా ఉంది.. ప్రకాష్ రాజ్ తీరు చూస్తుంటే జాలేస్తోందని ఆ నెటిజన్ విమర్శించాడు. చంద్రయాన్-3ప్రాజెక్ట్, ఇస్రో పనితీరు కోట్లాది మంది హ్రుదయాల్లో ఐక్యతను, పనిపట్ల నిబద్ధతను, తపనను,ఆశావహ థృక్పథాన్ని పెంచాయి. ఈ ఘన విజయాన్ని ఆస్వాదించే మంచి మనసు మీకు లేదంటే ఒక దేశంపై ప్రేమ కన్నా ఒకరిపై వ్యక్తిగత ద్వేషమే మీకు ఎక్కువగా ఉందని ప్రూవ్ అయ్యిందంటూ మరో నెటిజన్ ప్రకాష్ రాజ్ కు తలంటాడు. ప్రకాష్ రాజ్… ఈ దేశ పురోగతిని, సాధించిన విజయాలను, ప్రయత్నాలను, ఈ దేశ ప్రజలను అసహ్యించుకునేంతలా ద్వేషం మిమ్మల్ని మింగేయకుండా చూసుకోండి.. అంటూ మరో నెటిజన్ ఘాటుగా ఫైర్ అయ్యాడు.
మోడీ పైనే గురి…
అయితే ప్రకాష్ రాజ్ కి ఇవేం కొత్త కాదు..వామపక్ష భావజాలానికి చెందిన ఆయన ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి.2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి లోక్ సభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ -3 ని స్పేస్ లోకి పంపారు.. ఆగస్టు5న చంద్రుని కక్ష్యలోకి అడుగు పెట్టిన ఈ రాకెట్ ఆగస్టు 23 లోగా చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ను మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. దానికి విస్త్రుతంగా ప్రచారం కల్పించడం తెలిసిందే.. వెండితెరపై రంగమార్తాండుడైనా.. రాజకీయాల్లో మాత్రం ఆయనకు ఎదురు దెబ్బలు తప్పడంలేదు.. (prakash raj)