వాతావరణం చల్లగా ఉందంటే చాలు.. చాలా మందికి నోటికి ఏదో నొకటి వేడిగా తినాలనో లేదా తాగాలనో అనిపిస్తుంది మరి కొంతమంది కి అయితే టీ తాగాలనిపిస్తుంది . “గొంతు లో టీ పడగానే ప్రాణం లేచొచ్చినట్టు ఉంది ” అనే ఈ మాట ని మనం తరచు గా వినే ఉంటాము . చాలా మందికి ఇది ఫేవరేట్ డ్రింక్ అనే చెప్పవచ్చు. టీ తాగడం వలన చాలా అందికీ ఓ కొత్త అనుభూతి వచ్చినట్టు గా అనిపిస్తుంది అని రోజు రెండు మూడు సార్లు కూడా తగ్గేస్తుంటారు .కానీ టీ ని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు .
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి అంటే అతిశయోక్తి కాదు . కొందరికి అయితే టీ తాగకపోతే వారు కోల్పోయినట్టు నీరసం గా అనిపిస్తుంది అని కూడా అంటున్నారు. అంతే కాకుండా తలనొప్పిగా కూడా ఉంటుందట . అన్నం తినకపోయినా పర్లేదు కానీ టీ మాత్రం కావాలని అడుగుతారు. అయితే టీ ఆరోగ్యానికి మంచి చేస్తుందా చేడు చేస్తుందా అనే దాని ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి . టీ తాగితే మంచిదని కొందరు అంటే.. మరికొంతమంది టీ ని ఎక్కువ గా తాగితే మంచిది కాదని చెబుతున్నారు.
కానీ, ఇది నిజానికి అంత మంచిది కాదు. దీనిని తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయంటున్నారు నిపుణులు . అవేంటి అంటే
ఐరన్ లోపం..
టీ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో మొదటిది బాడీలో ఐరన్ ని సహజం గ మన శరీరం మనం తినే పదార్థాలు నుంచి గ్రహిస్తుంది ఆలా గ్రహించే శక్తీ ని తగ్గిస్తుందట . జర్నల్ ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. టీ లో టానిన్లు అని పిలవబడే సమ్మేళనాలకి గొప్ప మూలం అని అది మన జీర్ణవ్యవస్థని మీద ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు . దీని వలన మన శరీరం లో ఐరన్ లోపం సమస్య తలెత్తి దాని కారణంగా రక్తహీనత కు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు .
ఎక్కువగా టీ తాగితే..
సాధారణంగా టీ లో కొన్ని టానిన్లు ఉనందున కొన్ని పోషకాలను మన గ్రహించే విషయం లో ప్రభావం చూస్పిస్తుందట . దీని వల్ల ఆందోళన, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయని . వీటితో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తాయంటున్నారు.
టీ లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి అవి బ్లాక్ ‘టీ’, లెమన్ ‘టీ’, ఏలకుల ‘టీ’, మసాల ‘టీ’, అల్లం ‘టీ’, శొంఠి ‘టీ’ .
అల్లం, పసుపు టీ తో ఆరోగ్యం..
గర్భిణీలకు..
కెఫిన్ ఎక్కువగా ఉన్న టీ తాగడం ఎవరికీ మంచిది కాదు అలాంటిది గర్భిణులకు గర్బధారణ సమయంలో సమస్యలు వచ్చి గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉండటం వలన తక్కువ తాగటమో లేదా పూర్తి గా తీస్కోకుండా ఉండటం మంచిదంటున్నారు డాక్టర్లు . ఎందుకంటే గర్భస్రావం నుండి బరువు తగ్గడం వంటి సమస్యలకి కారణమవతుంది కాబ్బటి.
అసిడిటీ..
ప్రస్తుత రోజుల్లో గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్కె ఫిన్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి . ఇలాంటి టీ తీసుకుంటే గుండెల్లో మంట సమస్యకి కారణమవుతుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకి కారణమవుతుంది. కాబట్టి, ఎక్కువగా తాగకపోవడమే మంచిది.కొంతమంది అయితే ఈ గుండెల్లో మంట వచ్చినప్పుడు వారి గుండె కి ఏదో అయిపోతుందని , అది గుండె నొప్పి అని భావించి డాక్టర్ ల దగ్గర కి పరుగులు తీసి ఆందోళన పడుతుంటారు.
నిద్ర లేమి..
టీలో సహజంగా కెఫిన్ ఉంటుంది. టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలొస్తాయట . కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల రాత్రుల్లో నిద్ర సరిగ్గా పట్టక పగలంతా చికాకు గ ఉంటుందట
మెలటోనిన్ అనేది మెదడకు నిద్ర పోయేందుకు హెల్ప్ చేసే హార్మోన్. కాబట్టి.. ఎక్కువగా తాగడం వల్ల నిద్ర లేమి సమస్యలొస్తాయని అంటున్నారు నిపుణులు . దీని వల్ల మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, రోజుకి 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా టీ తగ్గొదంటున్నారు నిపుణులు
టాక్సిన్స్‌ని పెంచడం..
జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. టీ ఎంత ఎక్కువగా వేడి చేస్తే అంత ప్రమాదం పెరుగుతుంది. టీని 3 నుంచి 15 నిమిషాల పాటు వేడిచేసినప్పుడు ఓ కప్పు టీలో సీసం, అల్యూమినియం పరిమాణం పెరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుందని వెల్లడించారు .
దీని బట్టి ఏదైనా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదదు మోతాదు కు మించి తీసుకుంటే ఏదైనా మన శరీరానికి ప్రమాదం.