శ్రావణమాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనవే అని ఆ రోజుల్లో విశిష్టత మన అందరికీ తెలుసు,ఇవే కాకుండా మరి ఎన్నో నోములు, పండుగలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవలసినది మంగళ గౌరీ వ్రతం
మంగళ గౌరీ వ్రతం
ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అంటే ఒక్కోసారి ఇవి నాలుగు మంగళవారాలు రావచ్చు మరోసారి ఐదు మంగళవారం రావచ్చు. ఈ నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి అంటే పార్వతీదేవిని పూజించాలి సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని నమ్ముతుంటారు ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి
వరలక్ష్మీ వ్రతం
తరువాత వ్రతం వరలక్ష్మి వ్రతం.ఈ వ్రతాన్ని స్త్రీలు తాము దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తుంటారు లక్ష్మీదేవి సంపదలనుచ్చే తల్లిగా మనందరికీ తెలుసు సంపదలంటే కేవలం ధనం మాత్రమే అనుకుంటే పొరపాటే ధాన్య సంపద పశు సంపద గుణ సంపద నాన్ సంపద మొదలైనవి అన్ని సంపదలని చెప్పుకోవాలి వర అంటే శ్రేష్టమైన అని అర్థం భక్తితో వేడుకుంటే వరాల అందించే తల్లి వరలక్ష్మి దేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మడి అవసరం లేదు నిశ్చలమైన భక్తి శ్రద్దలు ఉంటే చాలు. శ్రావణమాసం శుక్లపక్షం లో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా జరుపుకోవాలని మన హైందవ ఆచారం. ఆరోజు వ్రతం ఆచరించడానికి కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారం లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి దేవి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువుని దేవిరి.
శ్రావణ పౌర్ణమి /రాఖీ పౌర్ణమి
ఈ పౌర్ణమినే “రాఖీ పౌర్ణమి” అని కూడా అంటారు. ఈ ఏడాది ఈ పౌర్ణమి ఆగస్టు 30వ తేదీన వస్తుంది. ఈ పౌర్ణమిని మన తెలుగు రాష్ట్రంలోనే కాక దేశమంతా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి అంటే మనందరికీ గుర్తుచేది రాఖీ పండుగ రక్షాబంధన్. ఈ రాఖీ పౌర్ణమి రోజున సోదరులందరికీ సోదరీమణులంతా రాఖీ కట్టి తమ సోదరులకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ జరుపుకునే పండుగే ఈ రాఖీ పౌర్ణమి పండుగ.
- “హయగ్రీవ జయంతి”
ఈ పౌర్ణమినే “హయగ్రీవ జయంతి” అని కూడా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువుని యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈరోజు పూజించడం వలన ఏకాగ్రత వృత్తి కోసం కలుగుతాయి అని నమ్ముతుంటారు. హయగ్రీవుడిని శనగలతో ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం వలన శుభ ఫలితాలు అందుకోవచ్చు అని చెబుతుంటారు.
- జంధ్యాల పౌర్ణమి
అంతేకాకుండా ఈ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అనే పేరు కూడా ఉంది.ఈరోజునే బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని కొత్త యజ్ఞోపవీతంతో మార్చుకొని ధరించడం ఆచారంగా వస్తోంది అందుచేతనే ఈరోజుది జంధ్యాల పౌర్ణమి గా కూడా అంటారు.
నాగ పంచమి
ఈ మాసంలో వచ్చే పంచమిదినాడు నాగపంచమిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పూజలు చేస్తారు. ఈ నాగ పంచమి ఈసారి ఆగస్టు 21వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఈ నాగ పంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు.
పుత్రదా ఏకాదశి / శుక్ల ఏకాదశి
ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రుడా ఏకాదశి అని లలితా ఏకాదశి అని కూడా అంటారు గొడుగును దానం ఇస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అని చెబుతుంటారు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వారి కోరిక నెరవేరుతుందని నమ్ముతుంటారు.
కృష్ణాష్టమి
శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజుని మనం కృష్ణాష్టమి గా జరుపుకుంటాము ఈ రోజునే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజించి పాలు పెరుగు వెన్నను నైవేద్యంగా సమర్పించడం వలన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు తమపై ఉంటాయని నమ్ముతుంటారు.
కృష్ణపక్షా అమావాస్య/పొలాల అమావాస్య
ఈ పొలాల అమావాస్యను మహిళలు శ్రావణమాసంలో జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే స్త్రీలు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మరి కొంతమంది వారి వారి పిల్లలకు అకాల మృత్తి భయం తొలగిపోవాలని కూడా ఈ పొలాల అమావాస్యమే జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.