Asia Cup
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మకు లక్కీ ఛాన్స్” జాతీయ జట్టు తరుపున అరంగేట్రం చేసిన రోజులు వ్యవధిలోనే మెగా టోర్నిలో ఆడే అవకాశం దక్కింది. ఆసియా వన్డే కప్ -2023లో పాల్గొనబోయే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది. పెద్దగా ఊహించని మార్పులు లేకపోయినా అనుకున్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్ లో అదర గొట్టిన ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లకు కూడా స్థానం కల్పించింది. వరసగా విఫలమవుతున్న వారిని మాత్రం పక్కన పెట్టింది. ఈసారి ఆసియా కప్ ను ఎలాగైనా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే టీం ఎంపిక చేసింది.
ముందుగా అంచనా వేసి…
కానీ మైదానంలో ఆటగాళ్ల పరిస్థితిని మనం ముందుగా అంచనా వేయలేం. క్లిక్ అవుతారనుకున్న వాళ్లు కాకపోవచ్చు. ఊహించని వారు మాత్రం టోర్నీలో సక్సెస్ అవుతుంటారు. అలాగని ముందుగా అంచనా వేసి ఎంపిక చేయలేం. అయినా జట్టులో కొందరికే స్థానం దక్కుతుంది. సెలెక్షన్ కమిటీ అయినా ముందుగా అంచనా వేయలేదు. గ్రౌండ్ లోకి దిగిన తర్వాతనే ఏ ఆటగాడి ప్రతిభ ఎంతో తెలిసేది. ఒక మ్యాచ్ లో ప్లాప్ అయిన ప్లేయర్ మరో మ్యాచ్ లో క్లిక్ అయి టీం విజయానికి కారణం కావచ్చు. అందుకే జట్టు కూర్పు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎంతమందిని సెలక్ట్ చేసినా ఇంకా యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం లభించలేకపోవచ్చు.
17 మందితో… Asia Cup
కీలక టోర్నీలో 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద స్టార్ తిలక్ వర్మకు చోటు దక్కింది.ఇదిలా ఉంటే..గాయాల కారణంగా సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్,వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి వచ్చారు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ నిరూపించకుని రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇలా సీనియర్లు, జూనియర్లతో టీం ఇండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా పటిష్టంగానే ఉంది. పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లను ఎదుర్కొనాలంటే జట్టులో ప్రయోగాలు చేయక తప్పదు. ప్రయోగాలు ఫలించనూ వచ్చు. ఫెయిల్ కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తితో గెలుపోటములను తీసుకోవాల్సి ఉంటుంది.
అరంగేట్రంలో …
కాగా వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్ తో ఐదు టీ20 మ్యాచ్ లలో కలిసి 173 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ తో బిజీగా ఉన్న తిలక్ వర్మ ఏకంగా ఆసియా కప్ టోర్నీ తో వన్డే ల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. తిలక్ వర్మకు రోహిత్ శర్మ ఆశీస్సులు పుష్కలంగా ఉండటం, నిలకడగా ఆడటం కూడా జట్టులో ఎంపిక కావడానికి ఒక కారణమని చెప్పాలి. ఆసియా కప్ లో సక్సెస్ అయితే మాత్రం తిలక్ వర్మ కు అంతర్జాతీయ మ్యాచ్ లలో సుస్థిర స్థానం లభించినట్లే. తిలక్ వర్మకు ఆసియా కప్ లో అవకాశం వస్తుందా? లేదా? ఒక వేళ వస్తే మాత్రం తన ప్రతిభను నిరూపించుకుంటే ఇక కొంత కాలం వర్మకు తిరుగులేనట్లే. Asia Cup
టీం ఇండియా జట్టు ఇదే…
రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్,విరాట్ కోహ్లి,శ్రేయస్ అయ్యర్,కేఎల్ రాహుల్,సూర్యకుమార్ యాదవ్,తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ ,హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్,ప్రసిద్ కృష్ణ.