ప్రాజెక్ట్ చంద్రయాన్ .. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే.. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై ల్యాండ్ కానున్న చంద్రయాన్ ఏం చేస్తుంది? దీనినుంచి భారత శాస్త్రవేత్తలు ఏం ఆశిస్తున్నారు? ఈ డౌట్స్ అందరికీ వస్తున్నాయ్ కదా? చంద్రయాన్(MOON)వెనక భారీ లక్ష్యమే ఉంది. భారత ఇంధన రంగ భవిష్యత్తు ఈ ప్రాజెక్ట్ తో ముడిపడి ఉంది. భవిష్యత్తులో మన దేశం చేపట్టబోయే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకి ఇది వరం కాబోతోంది.అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే లూనార్ ల్యాండింగ్ మిషన్ చంద్రునిపై మరికొన్ని గంటల్లో ల్యాండ్ అవబోతోంది. చంద్రయాన్ కదలికలు చాలా బాగున్నాయని, కక్ష్య కుదింపు సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని డీఆర్ డీవో చీఫ్ కంట్రోలర్ శివథను పిళ్లై చెబుతున్నమాట. చంద్రుని చుట్టూ పరిభ్రమణం కక్ష్య కుదింపు 100 కిలోమీటర్ల నుంచి 30 కిలో మీటర్లకు చేసినట్లు తెలిపారు.
అంతా హీలియం -3 లోనే ఉందా?
చంద్రయాన్ అతిపెద్ద బిజినెస్ డీల్ కు వేదిక కాబోతోంది. చంద్రునిపై ఖనిజాల అన్వేషణ దీనితోనే మొదలవుతుంది. చంద్రునిపై హీలియం -3 నిల్వలు అపారంగా ఉన్నాయన్నది శాస్త్రవేత్తల అంచనా.. ఇదే గనక నిజమైతే మన ఇంధన రంగంలో ఇదొక గేమ్ ఛేంజర్ గా మారుతుంది. హీలియం -3 అన్నది హీలియంలోనే ఒక రకమైన ఖనిజ నిక్షేపం. దీని న్యూక్లియస్ లో రెండు ప్రోటాన్లు ఒక న్యూట్రాన్ ఉంటాయి. ఇదిభూమిపైనా కామనే అయినా చంద్రునిపై ఉండే హీలియం -3 లో నాచురల్ గ్యాస్ స్పాట్స్ ఉంటాయని అంచనా. సౌర మండలంలో నక్షత్రాలన్నింటిపైనా ఈ హీలియం-3 నిల్వలు ఉంటాయి. ప్రోటాన్, న్యూట్రాన్ ల కలయికతో జరిగే అణు విఛ్ఛేదనం వల్ల తయారయ్యే ఇంధనం పైనే ఇప్పుడు భారత శాస్త్రవేత్తల చూపులు ఉన్నాయి. ఇదే గనక విస్తారంగా దొరికితే భవిష్యత్తులో నెక్ట్స్ లెవెల్ ఇంధన శక్తిగా హీలియం -3 వినియోగం ఉంటుంది.
అపార నిల్వలు… (MOON)
సౌర మండలంలో ఈ అణు విచ్ఛేదనం వల్ల వచ్చే వెలుగుతోనే నక్షత్రాలు వెలుగుతాయి. ఈహీలియం-3 నిక్షేపాలను సాధించగలిగితే ఇంధన రంగంలో ఇండియా నెంబర్ వన్ అవుతుంది. హీలియం -3ని ప్రోటాన్, న్యూట్రాన్ కాంబినేషన్ లో డ్యుటీరియంతో విచ్ఛేదనం చేస్తే గ్రీన్ ఎనర్జీ తయారవుతుంది. దీనిని నేరుగా విద్యుత్ గా మార్చుకోవచ్చు.అయితే ఈ ప్రొసెస్ పూర్తి కాడానికి మరిన్ని చర్యలు అవసరమవుతాయి.. వాటిపై లేబరేటరీలో కసరత్తు కూడా జరుగుతోంది.ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నా.. అంతరిక్ష రంగంలో అన్వేషణపై చాలా మందికి ఎన్నో కలలున్నాయి. హీలియం-3 నిల్వలు చంద్రునిపై అపారంగా ఉన్నట్లు సౌర తుఫాన్ల ద్వారా తేలింది. ఆ అపార నిక్షేపాలను తవ్వితే ఇంధన రంగంలో మరోదశకు భారత్ చేరుకోవచ్చు.. ఈ ఆలోచనతోనే చంద్రునిపై అన్వేషణలు సాగించేందుకు చంద్రయాన్ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. మన భవిష్య ఇంధన అవసరాలకు ఇదొక మంచి ప్రత్యామ్నాయ వనరుగా ఉపయోగపడుతుందన్న శాస్త్రవేత్తల ఊహే ఈ ప్రయోగానికి నాంది పలికింది.
సక్సెస్ అవుతుందా?
మరికొన్ని గంటల్లో చంద్రునిపై లూనార్ మిషన్ స్మూత్ గా ల్యాండింగ్ అయితే మన కలలు సాకారం అవుతాయి.. మన ప్రాజెక్ట్ చంద్రయాన్ -2లో భాగంగా పంపిన ఆర్బిటర్ కు చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానం సక్సెస్ ఒక పాజిటివ్ సంకేతం. ఇక చంద్రుని దక్షిణ థ్రువంపై సేఫ్ గా, స్మూత్ గా ల్యాండ్ అవడమే తరువాయి. అయితే మనలాగే ఇతర దేశాలు కూడా చంద్రునిపై అన్వేషణలకు రాకెట్లను పంపుతున్నాయి. రష్యా కూడా చంద్రునిపై కన్నేసి లూనా 25 మిషన్ ను పంపింది. అయితే అది కాస్తా ఫెయిల్ అయ్యింది. మరి భారత్ భవిష్యత్ ఏంటో మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది. (MOON)