నెయ్యి(Ghee), క్లారిఫైడ్ వెన్న అని కూడా పిలుస్తారు, నెయ్యి పాలతో తయారు చేయబడే ఒక పవిత్రమైన పదార్థం. ఇది అనేక సాంప్రదాయ వంటకాలలోను దేవుని నైవేద్యాలలో ఉపగిస్తాము . ముఖ్యంగా దక్షిణాసియా మరియు మధ్యప్రాచ్య వంటలలో ప్రధానమైన పదార్ధం గా నెయ్యి ని చెబుతుంటారు . ఇది శతాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో వంట, మతపరమైన వేడుకలు మరియు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా చిన్న పిల్లలకి నిత్యం వారి ఆహరం లో కలిపి పెడుతుంటే దృఢం గా ఎదుగుతారని మన నమ్మకం.
నెయ్యి ని ఎలా తయారు చేస్తారంటే
పాలను వేడి చేసినప్పుడు పైన వచ్చే తెట్టు తో మనం నెయ్యి(Ghee) తయారు చేయవచ్చు. ఇలా రోజు పాలను వేడి చేసిన తరువాత వచ్చే తెట్టు ను తీసి ఆనందులో ఒక 2 చుక్కల పెరుగువేసి సాధారణం గా ఫ్రీడ్జ్ లో నిలువచేసుకుంటూ ఉంటారు . ఆలా కొద్ది రోజుల తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి గ్రైండ్ చేయాలి లేదా చిలకాలి . అలా చేసినప్పుడు వెన్న వస్తుంది దీనిని వేడి చేస్తే నెయ్యి తయారు అవుతుంది.ఇది మన చిన్నప్ప్పుడు మన ఇంట్లో పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు మన అంత చూసే ఉంటాం .
అధిక పోషక ప్రయోజనాల కారణంగా నెయ్యి ఇటీవలి సంవత్సరాలలో నెయ్యి(Ghee) ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం గా ప్రజాదరణ కూడా పొందింది. అదనంగా, నెయ్యిలో పోషకాల తో పాటు మరెన్నో విటమిన్లు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే విటమిన్లు ఎ, డి, ఇ మరియు కె, అలాగే బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
నెయ్యి లోని పోషక విలువలు
నెయ్యి తినడం వలన అందులో లభించే విటమిన్లు మరియు ఖనిజాల యొక్క మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు . మరి ముఖ్యంగా విటమిన్ A, D, E మరియు K లలో ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయట
నెయ్యి లోని ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన కంటి చూపు తో పాటు చర్మం మరియు రోగనిరోధక శక్తీ పనితీరును నిర్వహించడానికి విటమిన్ ఎ ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది అంటే అతిశయోక్తి కాదు
విటమిన్ ‘డి’
బలమైన ఎముకలను , దంతాలను నిర్వహించడానికి, అలాగే రోగనిరోధక శక్తీ పనితీరుకు మరియు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా నెయ్యి కీలక పాత్రా పోషిస్తుంది
విటమిన్ ‘ఇ’
ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అని చెప్తారు , ఇది వాపు నుండి రక్షించడంలో సహాయపడుతుంది, ఈ రెండూ క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహద పడుతాయి.
విటమిన్ ‘K’
రక్తం గడ్డకట్టడం మరియు ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది గా చెప్తున్నారు నిపుణులు . అంతేకాకుండా ఇది గుండె జబ్బుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుందట
ఈ ముఖ్యమైన విటమిన్లతో పాటు, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఒక షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ అంతేకాకుండా గట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అని అంటున్నారు నిపుణులు .
బ్యూట్రిక్ యాసిడ్
పెద్దప్రేగులో ఫైబర్‌ను పులియబెట్టినప్పుడు గట్ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది దానితో పాటు ఇది జీర్ణ ప్రక్రియ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని , వాపును తగ్గిస్తుందని మరియు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు .నెయ్యి లాక్టోస్ లేని మరియు పాల ఉత్పత్తి ,కాబ్బటి లాక్టోస్ తినడానికి ఇష్టపడని వారు అంటే పాలని ఇష్టపడనీ వారు లేదా పాలు అలెర్జీ ఉన్న వారికి కూడా నెయ్యి ని తీస్కోవచ్చు అంటున్నారు పైగా వారు ఎలాగూ పాలు తీసుకోరు కాబ్బటి ఈ నెయ్యి ఎంతగానో అనుకూలంగా ఉంటుందంటున్నారు .
ఎందుకంటే నెయ్యి(Ghee) తయారీ ప్రక్రియలో పాల లో ని ఘనపదార్థాలు మరియు నీరు తొలగిపోయి , స్వచ్ఛమైన వెన్న కొవ్వు మాత్రమే మిగిలిపోతుంది. కానీ ఇలా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ కల్చర్ లో నీయి ని ఇంట్లో తయారు చేసేవారి సంఖ్యా తగ్గిపోయింది . కొంతమందికి సమయం లేదనో మరి కొంతమందికి తీరిక ఉన్న తయారు చేసుకోవడానికి ఓపిక లేక బయట సూపర్ మార్కెట్ లో ఉన్న నెయ్యి కొనుకొని వచ్చి ఉపయోగిస్తున్నారు.