Parineeti
బాలీవుడ్ లో పెళ్లిళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లు వరుసగా మ్యారేజ్ చేసుకోని సెటిల్ అవుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్, అలియాభట్, కియారా అద్వానీల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి.తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా Parineeti తర్వలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఆమె ఓ పొలిటికల్ లీడర్ ని ప్రేమించి వివాహం చేసుకుంటుందనే వార్త చెక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లికొడుకు మరెవరో కాదు.. ఆమె చిన్ననాటి స్నేహితుడు.. పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పరిణీతిల మధ్య లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముంబై లోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఈ జంట కెమెరాలకు చిక్కారు.
అంతేకాదు గతంలోనూ ఎయిర్ పోర్టులో వీరద్దరూ కలసి కనిపించారు. మొదట్లో వీరిద్దరూ కేవలం స్నేహితులనే భావించినా పలుమార్లు జంటగా కనిపించడంతో చాలా మంది వీరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం చేశారు. కానీ ఆ విషయం పై వారిద్దరూ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అందరూ అనుకుంటున్నదే నిజమనిపించేలా ఎక్కడ చూసినా వారిద్దరే చెట్టాపట్టాలేసుకు కనిపించారు. ముంబయి ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్లులు పరిణీతి చోప్రాను ఈ విషయం పై ప్రశ్నించగా..ఆమె సిగ్గుపడుతూ వెళ్లిపోయారు. దీనితో చద్దాతో ఆమె బంధం పై వస్తోన్న ఊహాగానాలు నిజమేనని మీడియా కథనాలు ప్రచురించడం మొదలు పెట్టింది.
పరిణీతి చోప్రా Parineeti
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగిందని ,అది కాస్త ప్రేమగా మారింది అని పరిణీతి సన్నిహితులు చెబుతున్న మాట.. చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నప్పటీకీ మార్చిలోనే విషయం బయటకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ పరిణీతి చోప్రా, రాఘన్ చద్దా నిశ్చితార్థం మే 13న ఢిల్లీ లోని కపుర్తలా హౌస్ లో ఘనంగా జరిగింది. దాదాపు 150 మంది సన్నిహితులు హజరయ్యారు. పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి ముహూర్తం కూడా ఖరారయ్యింది.. వారు సెప్టెంబర్ 25న రాజస్థాన్ వేదికగా, ది ఒబెరాయ్ ఉదయ విలాస్ లో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో వీరి పెళ్లికి భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతున్నారు.పరిణీతి వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే ఆమె వివాహ సన్నాహాల్లో మునిగి తేలుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పెళ్లి సన్నాహాలు, 25న వైభవంగాపెళ్లి జరుగుతాయి. ఆ తర్వాత గురుగ్రామ్ లో రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది.
బాలీవుడ్ నటీ పరిణీతి చోప్రా 2011 లో లేడీస్ వర్సస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతో నే ప్రక్షకుల మనసు లో నిలిచింది. తన నటన తో ప్రక్షకులను అలరించింది. తొలి సినిమాతో నే ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాజ నటి పురస్కారానికి నామినేషన్ పోందారు. పరిణీతి చోప్రా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది.