North Korea
కిమ్ జోంగ్ ఉన్ (KIM JONG UN) నేతృత్వంలోని ఉత్తర కొరియా, 2017 నుండి భారీగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపుణల (ICBM – Inter Continental Ballistic Missiles) పరీక్షిస్తూ వస్తోంది. అత్యంత అధునాతనమైన మల్టీ వార్ హెడ్ క్షిపణి , న్యూక్లియర్ మిస్సైల్స్ కలిగి ఉన్న జలాంతర్గామి. హైపర్ సోనిక్ మిస్సైల్స్ తో పాటుగా సొంతంగా గూఢచారి ఉపగ్రహాన్ని పొందడమే తమ లక్ష్యమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇప్పటికే ప్రతిజ్ఞ చేసారు.
యునైటెడ్ స్టేట్స్ లోని ఏ ప్రాంతానికైనా తమ న్యూక్లియర్ మిస్సైల్స్ చేరుకోవడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన బాలిస్టిక్ మిస్సైల్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ పరీక్షలలో నార్త్ కొరియా కు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటిని అధిగమించేందుకు సొంతంగా స్పై ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే మొదటగా ప్రయోగించిన స్పై ఉపగ్రహం ప్రయోగం విఫలం అయ్యింది.
విఫలమైనదని ప్రకటన
తాజాగా ప్రయోగించిన రెండవ స్పై ఉపగ్రహన్ని మోసుకెళ్తున్న చొల్లిమా -1 కూడా ప్రయోగించిన మొదటి దశలోనే విఫలమైనదని ఉత్తర కొరియా ప్రకటన విడుదల చేసింది. దీని పై దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ అఫ్ స్టాఫ్ మాట్లాడుతూ, గురువారం తెల్లవారుజామున 3:50 గంటలకు ఉత్తర కొరియా కు చెందిన టోంగ్ చాంగ్ -రి(TONG CHANG-RI). ప్రాంతం నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన స్పై ఉపగ్రహం కాసేపటికే కొరియాలోని పశ్చిమ తీరంలోని అంతర్జాతీయ తీరంలో రాకెట్ కూలిపోయింది అని తెలిపారు. ఈ సంవత్సరం మే నెలలో చేపట్టిన మొదటి ఉపగ్రహం కూడా అక్కడే కూలిపోయినట్టు అయన తెలిపారు.
J – Alert జారీ చేసిన జపాన్ ప్రభుత్వం North Korea
ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం తో జపాన్ ప్రభుత్వం జే – అలెర్ట్ ను(J – Alert) తెల్లవారి జామున 4 గంటలకు జారీ చేస్తూ, ఒకినావా లో నివసిస్తున్న తమ పౌరులు జాగ్రత్త పడాలని హెచ్చరించింది. ఉపగ్రహం ఆధారితంగా పనిచేసే ఈ జే – అలెర్ట్ ను జపాన్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు లేదా జపాన్ పై దాడులు జరిగినప్పుడు మాత్రమే. టెలివిజన్, రేడియో, స్మార్ట్ఫోన్ మరియు ఇతర పరికరాల ద్వారా త్వరగా తన పౌరులను హెచ్చరించడానికి ఉపయోగిస్తుంది. దీనికి చెందిన నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (National Aerospace Development Administration – NADA).
ప్రయోగం విఫలం చెందడం పై స్పందిస్తూ , గురువారం నాడు జరిగిన ప్రయోగంలో జరిగిన తప్పులను అధ్యయనం చేసిన తర్వాత వాటిని సరిదిద్దికొని. అక్టోబర్ నెలలో తిరిగి మూడో సారి స్పై ఉపగ్రహాన్ని తిరిగి ప్రయోగిస్తామని తెలిపింది. కొరియా లో యుద్ధ రిహార్సల్ గా పిలిచే 11 రోజుల దక్షిణ కొరియా – యుఎస్. వార్షిక మిలిటరీ డ్రిల్ల్ లు ప్రారంభమైన మూడు రోజులకే ఉత్తర కొరియా ఈ రాకెట్ ను ప్రయోగించడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఉత్తర కొరియా మాత్రం ఈ యుద్ధ రిహార్సల్ వల్లనే కొరియన్ ద్వీపంలో తీవ్ర అలజడి రేకొందని ఆరోపించింది. North Korea