బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారూక్ ఖాన్ జవాన్ (JAWAN) మూవీ విడుదల టైమ్ దగ్గర పడుతోంది. దీంతోషారూక్ అభిమానుల్లో కోలాహలం కనిపిస్తోంది. ఈ సినిమాలో షారూక్ లుక్ చాలా కొత్తగా, స్టన్నింగ్ గా ఉండబోతోంది. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో అప్పుడే బుకింగ్స్ కూడా అయి పోయాయి. షారూక్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పఠాన్ లాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
షారూక్ లుక్ తో,ట్రెండింగ్ మ్యూజిక్, అడుగడుగునా థ్రిల్లింగ్ తో సాగే నెరేషన్ మూవీకి అదనపు హంగులు కానున్నాయి. జవాన్ బాలీవుడ్ లో అతిపెద్ద పాన్ ఇండియా మూవీగా రికార్దులకెక్కనుంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీ జయకేతనం ఎగుర వేయడంతో బాలీవుడ్ సాగిల పడక తప్పలేదు.. ఎప్పటినుంచో ఓ మంచి హిట్ తో మళ్లీ మూవీ ఇండస్ట్రీపై పట్టు సాధించాలని బాలీవుడ్ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ఎన్నో హంగులతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
కీ రోల్ లో నయన్, విజయ్ సేతుపతి… (JAWAN)
2023లో బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ మూవీజవాన్. సినిమా పూర్తయి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. షారూక్, ఆట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ కోసం సూపర్ ఎక్సయిటెడ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇందులో షారూక్ డబుల్ రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇంటెలిజెన్స్ అధికారిగా, దొంగగా రెండు విభిన్నమైన పాత్రల్లో షారూక్ ఖాన్ కనిపిస్తారు. సినిమాలో ఆత్మహత్య, తలలు తెగనరకడం లాంటి భయానక ద్రుశ్యాలకు కత్తెర పడింది. షారూక్ సరసన కనిపిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్ లో తొలి ఎంట్రీ ఇస్తున్న నయనతార విజయ్ సేతుపతితో కలసి ఓ కీరోల్ లో మనకి కనిపిస్తారు.
సినిమా ప్రీవ్యూ ఇప్పటికే ఆకట్టుకుంది. నెక్ట్స్ లెవెల్ లో ఉన్నఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్న ధీమాలో నిర్మాణ వర్గాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్ క ల గలిసిన ఈ సూపర్ ఎగ్జయిటింగ్ మూవీ కోసం కింగ్ ఖాన్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో సీన్సు చాలా అద్భుతంగా ఉన్నాయని, కింగ్ ఖాన్ స్టన్నింగ్ లుక్స్ దీనికి అదనపు ఆకర్షణ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయ్. జవాన్ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని నిర్మాతలంటున్నారు.
అనిరుధ్ మ్యూజిక్ అదుర్స్… (JAWAN)
గతంలోనే ఎన్నో మంచి సినిమాలు తీసిన ఆట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ట్రాక్ సినిమాను ఓరేంజ్ లోకి తీసుకెళ్లాయని చెబుతు న్నారు. గ్రామీ అవార్డ్స్ కు నామినేట్ అయిన ర్యాపర్ రాజకుమారి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. జవాన్ హిట్ అయితే షారూక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే. అంతా బానే ఉంది మరి జవాన్ పఠాన్ అంత సక్సెస్ కాగలదా? జవాన్ పై ఎప్పటినుంచో పెరుగుతున్న అంచనాలు నిజమవుతాయా?
షారూక్ అభిమానుల ఆశలను నిలబెడతాడా? జవాన్ మరి వంద కోట్ల క్లబ్ లో చేరతాడా? చూడాలి..