బ్రహ్మ దేవుడికి కూడా గుడి ఉందంటే నమ్ముతారా..! నిజమేనండి బ్రహ్మ దేవుడికి(Lord Brahma) కూడా గుడి ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవునికి ఎవరు పూజలు చేయరాదని, బ్రహ్మ దేవుడు పూజలందుకోరాదని శాపం ఉందట. అందుకనే మన దేశంలో బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి దేశంలో ఉన్న ఒకటీ అరా బ్రహ్మదేవుని ఆలయాలు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాము.
తక్కువ అనడం కంటే అసలు లేవనే చెప్పవచ్చు. అలంటి ఓ బ్రహ్మ దేవుని గుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..బ్రహ్మ దేవునికి గుడి ఉండటమే కాదండోయ్ అక్కడికి ఆలయానికి భక్తులు ఎంతో నమ్మకం వచ్చి పూజలు చేస్తున్నారట ఇంతకీ ఆ ఆలయాం ఉండేది ఎక్కడంటే థాయ్‌లాండ్ లో.
ప్రా ప్రోం
ప్రా ప్రోం అంతే థాయ్ సంస్కృతిలో బ్రహ్మదేవుని(Lord Brahma) పేరుట. పర బ్రహ్మ అన్న సంస్కృత పదానికి ఇది వికృత పదంట. ఈ పరబ్రహ్మ అంటే థాయ్ ప్రజలకు చాలా గౌరవం. నిజానికి అక్కడి థాయ్ ప్రజలు భౌద్ధ మతాన్ని బుద్ధుడి ని ఎక్కువగా నమ్మినా బుద్ధునితో పాటుగా ఇలా పరబ్రహ్మ వంటి దేవతలను కూడా పూజిస్తుంటారు. ప్రా ప్రోంను పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయనీ, సమస్యలన్నీ తీరిపోతాయని థాయ్‌వాసుల నమ్మకం. అందుకే థాయ్‌లాండ్‌లో బుద్ధ విగ్రహాలు, దేవాలయాలు అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది థాయ్ రాజధాని బ్యాంకాక్‌లోని ‘ఎరావన్ ఆలయం”.
విఘ్నాలను తొలగించేందుకు..
1950లలో థాయ్ ప్రభుత్వం ‘ఎరావన్’ పేరుతో ఒక ప్రతిష్టాత్మక హోటల్‌ను కట్టాలని నిర్ణయించుకున్నారట.ఎరావన్ అంటే మన అందరికి తెలిసిన పేరే ఎరావన్ అంటే మన భాష లో..ఐరావతమే!. ఐరావతం వైభవానికి చిహ్నం కాబట్టి హోటల్‌కు ఆ పేరు పెట్టి ఉండవచ్చు అంటున్నారు. అయితే హోటల్ నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉందట.
హోటల్ నిర్మిచే కూలీలకు గాయలవ్వడం, ఖర్చులు పెరిగిపోవడం, నిర్మాణసామాగ్రి నాశనం అయిపోవడం.. ఇలా ఏదో ఒక విఘ్నంతో హోటల్ నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చిందట ఇంకా వారికి ఈ హోటల్ కట్టడం సాధ్యం అవుతుందా లేదా అనే సందేహం కూడా వచ్చిందట. దాంతో జ్యోతిషుల సలహా మేరకు థాయ్ ప్రభుత్వమే అక్కడ బ్రహ్మదేవుని ఆలయం నిర్మించిందట. ఆ తరువాత హోటల్ నిర్మాణం నిర్విఘ్నంగా కట్టరట. 1987లో అక్కడి స్థలంలో వేరే హోటల్‌ను నిర్మించినా కూడా ఎరావన్ ఆలయాన్ని మాత్రం కదప కుండా యథాతథంగా ఉంచేశారట.
థాయిలాండ్ ఆచారాలు..
థాయ్‌లాండ్‌లో మనకు భిన్నమైన ఆచారాలు కనిపిస్తుంటాయి. థాయిలాండ్ లో బ్రహ్మదేవుని(Lord Brahma) ఆరాధన భౌద్దుల ఆచారాలని తలపిస్తుంది. దేవుని విగ్రహం ముందు ధూపం వేయడం, కొవ్వొత్తులు వెలిగించడం, కొబ్బరిపాలని నైవేద్యంగా సమర్పించడం కనిపిస్తాయి. బ్రహ్మదేవుని ముందు ఏనుగు బొమ్మని పెడితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని థాయ్ ప్రజల నమ్ముతారట. పరబ్రహ్మకి సంగీతం అంటే ఇష్టమన్నది థాయ్‌వాసుల విశ్వాసం. అందుకే ఆయన ముందు థాయ్ సంగీతంతో కూడిన సంప్రదాయ నాట్యం కూడా చేస్తారట .
ఎన్నో అవాంతరాలు..
ఎరావన్ ఆలయానికి భక్తుల వెల్లువెత్తడంతో పాటుగా ఆ ఆలయం పై అసాంఘిక శక్తుల దృష్టి కూడా పడింది . 2006లో ఒక పిచ్చివాడు అక్కడి ముఖ్య విగ్రహాన్ని తునాతునకలు చేసేసాడు . దాంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించవలసి వచ్చింది థాయ్ ప్రభుత్వం. ఇక మరోసారి 2015లో అయితే దేవాలయం వద్ద ఒక భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో విగ్రహానికి పెద్దగా నష్టం జరగకపోయినప్పటికీ 20 మంది అమాయక భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ బాంబు దాడికి కారణం ఏంటో ఎవరు చేసారు అనే సంగతి ఇప్పటివరకూ తెలియలేదు ఎంత విచిత్రమో కదా..!.
ఎరావన్ ఆలయానికి ఎన్ని అంటంకాలు అవాంతరాలు ఎదురైనా.. అక్కడి బ్రహ్మదేవుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య లో ఎలాంటి మార్పు రాలేదు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఇక్కడి దైవం తీరుస్తుందని థాయ్ ప్రజల గాఢ నమ్మకం.