మిస్ Miss దివా యూనివర్స్ 2023ని ముంబైకి చెందిన శ్వేతా షర్దా కైవసం చేసుకుంది. ముంబైలో ఆదివారం జరిగిన ఈవెంట్ లోశ్వేతను ఈ అద్రుష్టం వరించింది. మిస్ దివా యూనివర్స్2022 టైటిల్ విన్నర్ శ్వేతాకు ఈ కిరీటాన్ని అలంకరింప చేసింది. ఈ ఏడాది నవంబర్ లో ఎల్ సాల్వడార్ లో జరిగే 72వ మిస్ యూనివర్స్ పీజెంట్ కు భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది శ్వేత. ప్రముఖ డిజైనర్ నికితా మై సల్కార్ డిజైన్ చేసిన థై- స్లిట్ గౌన్ తో అందాలు ఒలకబోస్తూ వేదికపై మెరుపు తీగలా తళుకులీనింది. అందాల కిరీటం తలపై పెట్టగానే శ్వేతకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఢిల్లీకి చెందిన సోనాల్ కుక్రెజా 2023 మిస్ దివా సుప్రా నేషనల్ గా ఎన్నికైంది. కర్ణాటకకు చెందిన త్రిషా షెట్టి మిస్ దివా యూనివర్స్ 2023 రన్నరప్ గా నిలిచింది. 12వ మిస్ సుప్రా నేషనల్ కు భారత తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది.
ముంబైకి పయనం..
చండీగఢ్ లో పుట్టిన శ్వేతా షర్దా 16 ఏళ్ల వయసులో ముంబై కి వలస వెళ్లింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. చిన్న తనంలో చదువుకోసం చాలా కష్టాలు ఎదుర్కొందని ఫెమీనా బ్యూటీ పీజెంట్స్ సమాచారం చెబుతోంది. తండ్రి వదిలేయడంతో సింగిల్ మదర్ గా తల్లే శ్వేతను పోషించింది. గ్రాండ్ ఫినాలేలో మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులెవరు అని జడ్జిలు అడిగిన ప్రశ్నలకు తన తల్లేనని శ్వేతా షర్దా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి ఆహూతుల మన్ననలు అందుకుంది. సీబీఎస్ ఈ బోర్డులో చదువు తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ పోటీలకు రాకముందు అనేక డ్యాన్స్ పోటీలు, రియాలిటీ షోలలో కూడా శ్వేతా పాల్గొంది.
డ్యాన్స్ Miss
డాన్స్ ప్లస్,డాన్స్ దీవానే, డాన్స్ ఇండియా డ్యాన్స్ లాంటి సీరీస్ లలో పాల్గొని మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఝలక్ దిఖలాజా అనే షోకు కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది. డ్యాన్స్ చేయడంలో మెళకువలు నేర్చుకున్న శ్వేతా దీపికా పదుకొనే, సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్, మౌని రాయ్, వైభవి మర్చెంట్ లకు డ్యాన్స్ నేర్పడమే కాదు వారితో కలసి చిందేసింది. ఇక అందాల సుందరి మాధురీ దీక్షిత్ కు స్టెప్స్ కొరియో గ్రాఫ్ చేసి నేర్పించడం, కలసి చిందేయడం తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని తన పీజెంట్ పేజ్ లో శ్వేతా షర్దా రాసుకుంది.
సోషల్ మీడియా సెన్సేషన్..
సుస్మితా సేన్ ను ఆరాధించే శ్వేత ఇన్ స్టా గ్రామ్ లో 4 లక్షల మంది ఫాలోయర్లతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మస్త్ ఆంఖేం అనే పాటకు రూపొందించిన ఓ మ్యూజిక్ ఆల్బంలో బాలీవుడ్ నటుడు శంతను మహేశ్వరితో కలసి ఈ అమ్మడు కనిపించింది. దీనిని జుబిన్ నౌటియాల్, తుల్సీ కుమార్ పాడారు.
జీవిత విశేషాలు
వివాహితులు, డైవొర్సీలు, గర్భిణులు, పెళ్లి కుదిరిన వారు, ట్రాన్స్ జెండర్ మహిళలు, భర్త చనిపోయినవారు ఇలా ఎవరైనా ఈ పోటీలలోపాల్గొన వచ్చునంటూ 11వ బ్యూటీ పీజెంట్ ఎంట్రీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1980లలో ఫెమీనా మిస్ ఇండియా బ్యూటీ సంగీతా బిజలానీ, ఫెమీనా మిస్ Miss ఇండియా వరల్డ్2023 నందిని గుప్తా, మిస్టర్ వరల్డ్ 2016 రోహిత్ ఖండేల్వాల్, మిస్టర్ సూప్రా నేషనల్ ఆసియా అండ్ ఒషీనియా2017 అల్టామాష్ ఫరాజ్ మరికొందరు సెలబ్రిటీలు 2023 మిస్ దివా పోటీల గ్రాండ్ ఫినాలేకు హాజరైన వారిలో ఉన్నారు.