హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న దళపతి విజయ్ పెద్దకొడుకు డైరక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. విజయ్ పెద్దకొడుకు జేసన్ సంజయ్(Jason Sanjay). ఈ స్టార్ కిడ్ చిన్న వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెట్ట్తెకారన్ అనే చిత్రంతో సినిరంగ ప్రవేశం చేశాడు. అయితే తండ్రిలానే హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది.. ఇప్పడు వాటన్నింటికీ చెక్ పెట్టాడు సంజయ్.
తమిళంలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ జేసన్ సంజయ్ ని డైరెక్టగా పరిచయం చేసింది. ఆగస్టు 28న ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించింది. ఈ వార్తకు సంబందించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టగా ఎంట్రీ ఇస్తునాడు అనే వార్త బయటపడింది. లైకా అధినేత సుభాస్కరన్ సంజయ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు.
దీంతో ఆయన మాట్లాడుతూ మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ ను డైరెక్ట్ గా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్న వయస్సులోనే తన ఆలోచన విధానం తను చెప్పిన యూనిక్ పాయింట్ నాకు నచ్చింది వెంటన్ ఓకే చేశాను అన్నారు సుభాస్కరన్. జేసన్ తో కలిసి వర్క్ చేయడం ఓ వండర్ గా భావిస్తున్నాను అన్నారు. సంజయ్ మాట్లాడుతూ నన్ను డైరెక్టగా పరిచయం చేయడం లైకా వంటి అగ్ర నిర్మాణ సంస్థలో దర్శకుడిగా పని చేయడం చాలా సంతోషం గా ఉంది. నా కథను రాయడం లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి నా ధన్యవాదాలు అని తెలియజేశాడు. డైరెక్టగా తనకు మంచి గుర్తింపు వచ్చేలాగా సినిమా నిర్మిస్తానని సంజయ్ అన్నాడు.
హీరో అనుకుంటే డైరెక్టగా మారి షాకిచ్చాడు: (Jason Sanjay)
తమిళ్ హీరో దళపతి విజయ్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అందరికి తెలుసు. తన నటనతో పలు డబ్బింగ్ సినిమాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాడు. విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోతారనేది అక్కడక్కడ వినిపిస్తున్న టాక్… ఈ క్రమంలో జేసన్ హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు కానీ ఫ్యాన్స్ అందరికి గట్టిగా షాక్ ఇచ్చాడు జేసన్.
జేసన్ సంజయ్ బయో
దళపతి విజయ్ కు ఇద్దరు పిల్లలు. అందులో జేసన్ సంజయ్ పెద్దవాడు. ప్రస్తుతం తనకి 23 సంవత్సరాలు. జేసన్ లండన్ లో స్ర్కీన్ రైటింగ్ లో బి.ఎ ను పూర్తి చేశాడు. టోరింగ్ ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ లో డిప్లామాను కంప్లీట్ చేశాడు. సినిమా నిర్మణం పై పూర్తి అవగాహన సంపాధించాడు ఈ స్టార్ హీరో తనయుడు. ప్రతీ ఫిల్మ్ మెకర్ కు ఉండాలిసిన లక్షణాలు ఇవే. విజయ్ కొడుకు దర్శకుడుగా రాణిస్తాడా?లేక తండ్రి రిటైర్ అయ్యాక ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లే హీరోగా అవతారమెత్తుతాడా చూడాల్సిందే.