ఆటల్లో రాణించాలంటే అథ్లెట్లకు ప్రత్యేకమైన డైట్ చాలా అవసరం. జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) తాజా విజయంతో అతగాడి డైట్ పై ఇప్పుడు చాలా మందికి ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు తన ఊబకాయాన్ని ఆటలతో అధిగమించాలని తపన పడిన చోప్రా అందుకు అనుసరించిన డైట్ ప్లాన్ ఈరోజు టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్ర్ లో ఛాంపియన్ గా నిలబెట్టింది. అలాగే ఫిట్ నెస్ ను నిలుపుకోడానికి కఠోరమైన క్రమశిక్షణ కూడా తోడయ్యింది. నీరజ్ చోప్రా ఫిట్ నెస్ సీక్రెట్స్ లోకి వెళితే..
ఫ్యాట్ ఎంతుందన్నదే కీలకం
సాధారణంగా క్రీడలలో ఫ్యాట్ పర్సెంటేజ్ కొలవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆటగాడి శరీరంలో ఉన్న ఫ్యాట్ ను బట్టి అతని ఫిట్ నెస్ ను కొలుస్తారు. అయితే మనం ఆడే క్రీడను బట్టి మన శరీరంలో ఫ్యాట్ కంటెంట్ నిర్ణయిస్తారు..దాహరణకి పోటీలకు వెళ్లే బాడీ బిల్డర్ల శరీరంలో మూడు నుంచి5 శాతం ఫ్యాట్ ఉండాలి.. ఇది సరైన కొలమానంగా లెక్కిస్తారు. అప్పుడే కండరాలు పోటీకి తగ్గట్లుగా సిద్ధంగా ఉంటాయి. కానీ సాధారణ సందర్భాల్లో అయితే అది చాలా తక్కువ కొవ్వు.. ఇక శ్రమతోకూడిన ఆటల విషయానికొస్తే మరికొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవసరమవుతుంది. ఈ ఎక్స్ ట్రా ఫ్యాట్ అంతా ఆటగాడికి మరింత ఎనర్జీనిస్తుంది. జావెలిన్ త్రో ఆటగాళ్లకు శరీరంలో 10-10.5 శాతం కొవ్వు ఉంటే సరిపోతుంది.నీరజ్ చోప్రా 10 శాతం ఫ్యాట్ ను మెయిన్ టెయిన్ చేస్తాడు . అది అంగుళమైనా పెరగ కుండా ఉండేందుకు కఠోర నియమాలను పాటిస్తాడు.
డైలీ రోటీన్ ఇలా… (Neeraj Chopra)
ఉదయం అల్పాహారం కాస్త ఎక్కువ మొత్తంలో తీసుకుంటాడు.. ఎందుకంటే రోజంతా శరీరానికి శక్తినిచ్చేది ఉదయం తినే అల్పాహారమే. ఉదయం కొబ్బరి నీళ్లు లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తో అతగాడి రొజు ప్రారంభమవుతుంది. దీనితో పాటు మూడు నుంచి నాలుగు ఎగ్ వైట్ లు, రెండు పీస్ ల బ్రెడ్, ఒక కప్పుపప్పు, ఏవైనా రెండు రకాల పళ్లు తీసుకుంటాడు.
బ్రెడ్, ఆమ్లెట్ అంటే నీరజ్ కు చాలా ఇష్టం.. వీటిని వారంలోఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకుంటాడు.
లంచ్ విషయానికొస్తే కొన్ని రకాల పప్పుతో పాటు పెరుగన్నం, గ్రిల్డ్ చికెన్, సలాడ్ తీసుకుంటాడు. ఇక ట్రైనింగ్ సెషన్ లో, జిమ్ లో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, తాజా పళ్లరసం తీసుకుంటాడు.
రాత్రివేళ భోజనం విషయానికొస్తే ఒక సూప్, లేదా ఉడకబెట్టిన కూరగాయలు, పళ్లతో ముగిస్తాడు. సాధ్యమైనంత ఎక్కువగా పళ్లు, కూరగాయలకి ప్రాధాన్యత నిస్తానని నీరజ్ అన్నాడు. మొత్తంగా చూసుకుంటే నీరజ్ చోప్రా డైట్ లో ఎక్కువగా మాక్రోన్యూట్రియంట్లతో కూడిన ప్రొటీన్, పళ్లు, ఎక్కువగా ఉంటాయి.వీటివల్ల కండర నిర్మాణం బాగుండటమే కాక ఆరోగ్యకరమైన ఫ్యాట్ మాత్రమే ఏర్పడుతుంది. వీటికి తోడు డైలీ తీసుకునే ప్రొటీన్ సప్లిమెంట్లు అదనం. ఈ మధ్యనే తన డైట్ లోకి సాల్మన్ చేపలను నీరజ్ చేర్చుకున్నాడు. వీటివల్ల ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది. అదే నాన్ వెజిటేరియన్ విషయానికొస్తే కూడా గ్రిల్డ్ సాల్మన్ చేపలనే తీసుకుంటానని నీరజ్ తెలిపాడు.
నాన్ వెజిటేరియన్ ఎందుకు? (Neeraj Chopra)
2016 వరకూ నీరజ్ పూర్తి వెజిటేరియన్ గా ఉండేవాడు. అయితే అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో శిక్షణకు వెళ్లినప్పుడు డైట్ షెడ్యూల్ మొత్తం మార్చుకున్నాడు. శాఖాహారం పరిమితంగా దొరకడం వల్ల త్వరగా బరువు తగ్గిపోతున్నందున కోచ్ లు అతగాడిని నాన్ వెజ్ తినమని సలహా ఇచ్చారుట. అది ఫలించి నీరజ్ కు సెట్ కావడంతో దానినే కొనసాగించాడు.
ఇవికాక స్నాక్స్ లో కూడా నీరజ్(Neeraj Chopra) కు కొన్ని ఇష్టాలున్నాయి. పోషక విలువల కోసం కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు, స్నాక్స్ నీరజ్ తీసుకుంటాడు. కఠిన క్రమశిక్షణ ఒక్కోసారి బోర్ కొడుతుంది. ఒకే డైట్ రోజూ తింటే బోర్ .. కాబట్టి అప్పుడప్పుడు చిరు తిళ్లు ఆహారంపై ఇష్టాన్ని పెంచుతాయి. అందుకే నీరజ్ హర్యానా వంటకమైన చుర్మా, పంచదార, నెయ్యితో చేసిన స్వీట్లు తీసుకుంటాడు.ఖీర్ కూడా నీరజ్ కు చాలా ఇష్టం. ఇక రోడ్లపై అమ్మే స్ట్రీట్ ఫుడ్ లలో గోల్ గప్పా లేదా పానీపురీ అంటే చెప్పలేనంత ఇష్టం. అందులో పెట్టే పొటాటో స్టఫ్ అంటే పడి చచ్చిపోతానని నీరజ్ చెప్పాడు.
అప్పుడప్పుడు ఇలాంటివి తినడం వల్ల బరువు పెరిగే భయం ఉండదన్నాడు. ఇంటి ఫుడ్ అంటే ఇష్టమే అయినా ఎక్కువ సమయం కోచింగ్,ప్రాక్టీస్ పోటీల పేరుతో విదేశాల్లోనే ఉంటున్నందున అది తనకు పెద్ద పట్టింపు కాదన్నాడు.నీరజ్ మంచి కుక్ కూడా.. వెజ్ బిర్యానీ అద్భుతంగా చేస్తాడు.
టోక్యో ఒలింపిక్స్ తో డైట్ పై ద్రుష్టి
నీరజ్ తన డైట్ ను సెట్ చేసుకోడానికి ఆగస్టులో గెలిచిన టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ నాంది పలికింది. 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాత భుజానికి గాయంతో చాలాకాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైమ్ లో నీరజ్ 14 కిలోల బరువు పెరిగాడు..బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా 60 శాతం పెరిగింది. ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడంతో పార్టీలు, డిన్నర్ లు, లంచ్ లు అంటూ ఇష్టానుసారం లాగించడంతో బరువు పెరిగిపోయాడు. వెయిట్ రిడక్షన్ కోసం అమెరికా వెళ్లి ఫిట్ నెస్ ఎక్స్ పర్టులతో డైట్ ఛార్ట్ ప్రిపేర్ చేయించుకుని దానిని కఠినంగా పాటించడం మొదలు పెట్టాడు. బరువు తగ్గడానికి నీరజ్ మొదట చేసిన పని తన డైట్ లో షుగర్ ను, కార్బోహైడ్రేట్ లను కంప్లీట్ గా తీసేయడం. నీరజ్ డైటీషియన్ మిహిరా కొప్కర్ ప్రొటీన్ సప్లిమెంట్స్ తో సరైన డైట్ చార్ట్ ప్రిపేర్ చేశాడు. కార్డియో ఎక్సర్ సైజ్ లు కొంత వెయిట్ లాస్ కి దోహదపడినా.. మొదట్లో పరుగు తీయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది.జావెలిన్ త్రో ప్రాక్టీస్ కూడా మొదట్లో కఠినంగా శ్రమించాల్సివచ్చేది. రాను రాను డైట్ తో పాటు తగిన వ్యాయామం నీరజ్ ను దారిలోకి తెచ్చాయి. అవే ఆ స్వర్ణ పతక గ్రహీత కు రాచబాట వేశాయి.