Google +
విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారమిచ్చే గూగుల్ ప్రయాణికులకు చవకైన విమాన సర్వీసులను తెలుసు కొనేందుకు ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.దీనివల్ల టిక్కెట్ ధరలు తగ్గడమే కాక, ప్రయాణం సమయం కూడా చాలా పొదుపు అవుతుంది. ఈ కొత్త ఫీచర్ ను ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లైట్ సర్వీసుల వివరాలను ఉంచింది.
ఇప్పుడున్న ప్రైస్ ట్రాకింగ్ అలెర్ట్స్ కు తోడు ఈసారి ప్రైస్ గ్యారంటీ ఛాయిస్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. విమానాలను ఏ టైమ్ లో బుక్ చేసుకుంటే ధరలు తక్కువగా ఉంటాయో తెలుసు కునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది.మనం ప్రయాణించాల్సిన తేదీలు, చేరాల్సిన గమ్యంలను ద్రుష్టిలో పెట్టుకుని అత్యంత తక్కువ ధరలు అందుబాటులో ఉన్న విమానాల వివరాలు గూగుల్ బ్లాగ్ పోస్ట్ లో దొరుకుతాయి.
ఇది ఎలా పనిచేస్తుంది? Google +
దీనికోసం గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ప్రకారం ఏ విమానం టిక్కెట్ ధరలైనా తక్కువలో దొరకాలంటే రెండునెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మరో రెండు, మూడు గంటల్లో టేకాఫ్ అయ్యే విమానాల టిక్కెట్ ధరలు కూడా తక్కువలో దొరుకుతాయి. మనం ఈ రెండు టిప్స్ ను ఫాలోఅయితే తక్కువ సొమ్ముతోనే కంఫర్టబుల్ గా జర్నీచేయవచ్చు అంటోంది గూగుల్ బ్లాగ్ స్పాట్.
గూగుల్ ఫ్లైట్స్ లో ప్రైసింగ్ ప్యాటర్న్స్ ప్రకారం 2023 లో ఫ్లైట్ బుకింగ్ ట్రెండ్స్ ఛార్ట్ కూడా ఈ కొత్తటెక్నాలజీ విడుదల చేసింది. కొన్ని రూట్లలో అతి తక్కువ టిక్కెట్ ధరలను సూచించే గూగుల్ ఆ విమానం డిపార్చర్ లోగా అంతకన్నా తక్కువ ధరలు మరెక్కడా దొరకవన్న గ్యారంటీని కూడా ఇవ్వగలుగుతోంది. మనం ఒక విమాన సర్వీస్ కు టిక్కట్ కొనుక్కుంటే ఆ విమానం టేకాఫ్ అయ్యే లోగా ప్రతీరోజు టిక్కెట్ ధరలను గూగుల్ మానిటర్ చేస్తుంది.ఒక వేళ ధరలు మరింత తగ్గితే ఆ డిఫరెన్స్ ను గూగుల్ పే ద్వారా మనకు పే బ్యాక్ చేయనున్నట్లు గూగుల్ బ్లాగ్ పోస్ట్ వివరించింది.
క్రిస్మస్ కు తగ్గింపు ధరల్లో టిక్కెట్ బుకింగ్ ఎలా?
డిసెంబర్ నెల మధ్యవారంలో మనం ప్రయాణించాలంటే మనం అక్టోబర్ లోనే గూగుల్ లో టిక్కెట్ ధరలను చూసుకోవాలి. యావరేజ్ గా డిపార్చర్ కు 71 రోజుల ముందు టిక్కెట్ ధరలు అత్యంత తక్కువగా ఉంటాయని 2022 నుంచి ట్రెండ్ ను గమనిస్తే తేలింది. విమానం డిపార్చర్ కు 22రోజుల ముందు యావరేజ్ టిక్కెట్ ధరలు బాగా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విషయం కూడా ట్రెండ్స్ ను గమనిస్తే వెల్లడవుతోంది.. ప్రస్తుతం ట్రెండ్స్ ట్రాకింగ్ ప్రకారం విమానం టేకాఫ్ కు 54-78రోజుల మధ్య తక్కువ ధరలో టిక్కెట్లు దొరికే అవకాశముంది.
యూఎస్ నుంచి యూరప్ కు ఫ్లైట్ సర్వీసులు
అంతర్జాతీయ విమాన సర్వీసులు సాధారణంగా క్రిస్మస్ లాంటి పండగల సమయంలో బిజీగాఉంటాయి.. ఈ సమయంలో అమెరికా నుంచి యూరప్ కు ట్రావెల్ చేయాలంటే విమానం టేకాఫ్ కు 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టిక్కెట్లు దొరుకుతాయి. అలాకాకుండా డిపార్చర్ కు పది వారాల ముందు బుక్ చేసుకుంటే మాత్రం రేట్లు పెరిగే అవకాశముంది.