(Gold)
బంగారాన్ని లాంగ్ లైఫ్ పెట్టుబడిగా అందరూ చూస్తారు. బంగారం వన్నె తగ్గనట్లుగానే ధరలు కూడా ఎప్పటికీ తగ్గవు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది 24 క్యారెట్ల బంగారం 65 వేల రూపాయలకు చేరుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. గ్రాములు తగ్గిస్తున్నారు కానీ బంగారాన్ని మాత్రం కొనుగోలు చేస్తున్నారు. అయితే ధరలు పెరగడంతో గతంతో పోలిస్తే వ్యాపారం కొద్దిగా మందగించినా తాము ఊహించిన స్థాయిలో పడిపోలేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. బంగారం కొనుగోలుదారులు ఎప్పుడూ ధరలను గురించి ఆలోచించరన్న నమ్మకాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.
మార్కెట్ లో ధరలను… (Gold)
అంతర్జాతీయ ధరవరలను బట్టి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అనేక కారణాలతో గోల్డ్ రేట్స్ పెరగడం మామూలే. దానికి ప్రజలు అలవాటు పడిపోయారు. ఎంతకు మనం బంగారం కొనుగోలు చేసినా చివరకు ధరలు పెరిగి మనకు లాభమేనన్న నమ్మకం వినియోగదారులకు కలగడమే ఇందుకు కారణం. బంగారానికి ఎప్పటికీ విలువ తగ్గదు. ఎప్పటికైనా రెట్టింపు డబ్బు తెచ్చి పెడుతుంది. మన వద్దనే భద్రంగా ఉంటుంది. మనం తీసుకునే జాగ్రత్తలతో బంగారాన్ని సులువుగా అమ్మేయొచ్చు. కొనుగోలు చేయొచ్చు. దీనికి మధ్యవర్తిత్వం ఎవరూ ఉండరు. భూమి తరహా ఇబ్బందులు బంగారం విషయంలో ఉండవు. అందుకే బంగారానికి అంతటి డిమాండ్.
వెండి ధరలు…
వెండి కూడా అంతే. బంగారంతో పాటు వెండి కూడా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. వెండి ధరలు కూడా అమాంతం పెరగడం చూశాం. వెండిని కూడా ఇప్పుడు కొనుగోలు చేయలేని పరిస్థితి. వేలల్లోనే ధరలు పెరిగాయి. శుభ కార్యాలయాల్లో వెండిని వినియోగించడం ఒక భాగంగా మారడంతో భారతీయుల ఇళ్లల్లో వెండి కూడా ఒక భాగమై పోయింది. అయితే పెరుగుతున్న ధరలతో బంగారం, వెండి సామాన్యులు, పేదలకు మాత్రం భారంగా మారాయని చెప్పాలి. ఒకప్పుడు తులం బంగారం కొనుగోలు చేసేవారు నేడు ఐదు గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లిళ్లలో బంగారానికి బదులు మరొక రూపంలో కానుకలను సమర్పించుకునే పరిస్థితి అతి త్వరలోనే రానుందన్నది వాస్తవం.
నేటి ధరలు… (Gold)
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు పెరిగింది. వెండి కూడా కిలోపై రెండు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,670 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 80,000 రూపాయలకు చేరుకుంది. ఇలా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని, వెంటనే కొనుగోలు చేయడం మంచిదన్న అభిప్రాయం మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. డబ్బులుంటే ఇప్పటికి ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.