హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునా రాఖీ (Rakhi) పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమని అని జంధ్యాల పౌర్ణమని పిలుస్తారు. ముఖ్యంగా అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ ఈరాఖీ పండుగ. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకుంటారు. రాఖీ అనగా ఏమిటి?…ఇది ఒక రక్షణ బంధం. రక్షా బంధన్ లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం. ఈ రక్షణ బంధాన్ని అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కడుకతుంది. చెల్లి, అక్క తన తమ్మడు, అన్నయ్యకు అనుకున్నవి విజయం సాధించాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కట్టే రక్షణ కవచం. ఒకప్పుడు ఉత్తర భారతంలోనే ఎక్కువగా వేడుకలు జరిగేవి. ఆ తర్వాత క్రమంగా దేశామంతా వ్యాపించింది.
రక్షా బంధన్ ఏరోజు?
ఈ సారి రాఖీ పౌర్ణమి ఏ రోజున జరుపుకోవాలి? ఆగస్టు 30నా, లేక 31నా? అనే గందరగోళంలో ఉన్నారు. ఎందు కంటే ఈ సంవత్సరం అధిక శ్రావణం, నిజ శ్రావణం రావటం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది.శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. అధిక శ్రావణం ముగిసిన తరువాత నిజ శ్రావణం వస్తుంది.అయితే ఈ నిజ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజునా భద్రకాలం ఏర్పడింది. 2023 ఆగస్టు 30 శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమయి ఆగస్టు 31 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. అదే సమయంలో భద్రకాలం రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఏ రోజున రాఖీ కట్టాలి అనే సందేహంలో ఉన్నారు.దానికి పండితులు ఏమంటు న్నారు అంటే దక్షిణ భారతదేశంతో ని ఏ పండేగకైనా సూర్యో దయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు.అందువల్ల రాఖీ పౌర్ణమిని ఆగస్టు 31న జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల పండితులు చెబుతున్నమాట.
రాఖీ పండగ ఎందుకు? (Rakhi)
పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం దేవతలకు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. దీంతో దేవతల రాజు అయిన దేవేంద్రుడు తన పరివారంతో సహా అమరావతిలో తలదాచుకున్నారు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి ఏమి చేస్తే మళ్లీ త్రిలోకానికి వస్తాడు అనే అలోచనలో మునిగిపొయింది. అదేసమయంలో రాక్షసుల రాజు అమరావతిలో ఉన్న దేవేంద్రుడు పై యుద్ధానికి వస్తున్నాడు అనే విషయం తెలుసుకుంది. దీంతో భర్తను సమరానికి సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా విజయంతో రావాలి, మళ్లి తిరిగి త్రిలోకానికి రావాలని దేవేంద్రుడిలో ఉత్సాహాన్ని కల్పిస్తుంది.సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావటం విశేషం. శ్రావణ పౌర్ణమి కావటంతో ఇంద్రాణి ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్షీనారాయణులను పూజించిన రక్షను తీసుకువచ్చి ఇంద్రుడికి కడుతుంది. దీనితో దేవతలందరూ వారు పూజించిన రక్షను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు.ఇంద్రాణిని శచీదేవి అని కూడా పిలుస్తారు. ఇంద్రాణి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.