దానగుణం ఎవరికో గానీ రాదు.. ఇవాల్టి రోజుల్లో దాన గుణం అక్కరలేదు..ఎవరి దగ్గరా ఊరికే సొమ్మును తీసుకోకుండా ఉన్నా మేలే.. సినీ ఇండస్ట్రీ అంటేనే డబ్బుతో పని.. హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ (Remunaration) టోటల్ మూవీ బడ్జెట్ కన్నా రెండింతలు, మూడింతలు ఎక్కువ ఉన్న రోజులివి. అగ్రహీరోలైతే చెప్పనే అక్కర లేదు.
కానీ అంత సొమ్ము తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్నా వద్దని రిజెక్ట్ చేయడమే మోడెస్టీ.. అలాంటి మంచి గుణం ఎవరికో గానీ రాదు.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న సామ్, చైతులిద్దరిలోనూ ఈ గొప్పగుణం ఉంది.. అది తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.. సామ్,చైతూ(Sam, Chay) టాలీవుడ్ లో విడాకులు తీసుకున్నా ఇంకా హిట్ పెయిర్ గానే కంటిన్యూ అవుతున్నారు. వీళ్లిద్దరూ కలసి నటించిన మజిలీ, మనం, ఏ మాయ చేశావే లాంటి సినిమాలు ఎప్పటికీ గోల్డెన్ మెమోరీస్ గా ఉండిపోతాయి.
దురద్రుష్ట వశాత్తూ ఈజంట విడిపోయినా.. వీరికి సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఫ్యాన్స్ కి పెద్ద విషయమే మరి.. మంచితనంలో వీరిద్దరినీ మించినవారు లేరన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది.
కోట్ల సొమ్మును వద్దని తిరస్కరించిన చైతు
పైసా మే పరమాత్మ అనేది ఇవాల్టి నైజం. స్పెషల్ రోల్ ..అదీ పేరున్న అగ్ర హీరోలయితే చాలు లక్షలు,కోట్లే.. అది ఎంత తక్కువ నిడివి ఉన్న రోల్ అయినా సరే..కోట్లకు కోట్లు వసూలు చేస్తున్న రోజులివి.పైగా స్పెషల్ రోల్స్ ట్రెండ్ ఇప్పుడు చాలా ఎక్కవగా ఉంది. అసలు స్పెషల్ రోల్ అంటే చాలు మొహమాటం లేకుండా 15కోట్లు వసూలు చేసే హీరోలు ఉన్నారు. 40 రోజులు డేట్ లు ఇచ్చి 50 కోట్లు డిమాండ్ చేసే హీరోలు ఎక్కువ. అలాంటిది జస్ట్ ఓ 10 రోజులు వర్క్ చేస్తే చాలు 9 కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే నో అన్నాడు అక్కినేని ఫ్యామిలీ యువహీరో నాగ చైతన్య (chay). ఆఫర్ సూపర్ గా ఉంటే సున్నితంగా నో చెప్పి రిజెక్ట్ చేయటం ఏంటబ్బా? అని ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఎందుకు రిజెక్ట్ చేశాడు?
ఓ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేయమని నిర్మాత ఆఫర్ చేస్తే.. చైతూ సింపుల్ గా సారీ చెప్పేశాడు. రోజుకి కోటి చొప్పున తొమ్మిదిరోజులకు తొమ్మిది కోట్లు ఇస్తామన్నది ప్రపోజల్.. కానీ కోట్లిచ్చినా.. ఇంపార్టెన్స్ లేని రోల్స్ చేయనని నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతు.. అక్కినేని వారి మనవడు (chay) తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీలవుతున్నారు.
చైతూ లాగే సామ్ కూడా.. chay sam
రౌడీ మూవీ హీరో విజయ్ దేవరకొండ ,సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (sam) జంటగా నటించిన లేటెస్టే మూవీ ఖుషీ. సమంత ఈ మూవీ కోసం ముందే అడ్వాన్స్ గా రెమ్యునరేషన్ తీసేసుకుంది. అయితే మయోసైటిస్ వ్యాధి తిరగబెట్టడంతో సామ్ షూటింగ్ లకు డుమ్మా కొట్టింది. దాంతో ఖుషీ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అనుకున్న టైమ్ కన్నా లేట్ గా సినిమా కంప్లీట్ కావడంతో నిర్మాతలకు చాలా నష్టం వచ్చింది. సామ్ వల్ల షూటింగ్ లేటవడంతో అయిదు నెలలు అదనంగా టైమ్ తీసుకుంది..
ప్రొడ్యూసర్లకు కలిగిన ఈ నష్టానికి చింతిస్తూ సామ్ తన పారితోషికం నుంచి కోటి రూపాయలు వెనక్కి తిరిగి ఇచ్చేసిందిట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సామ్ (sam) గ్రేట్ అని ట్వీట్ చేస్తున్నారు. సామ్ ది ఎంతో మంచి మనసు.. సామ్ యూ ఆర్ సింప్లీ గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్ . ఖుషీ మూవీ ప్రమోషన్స్ లో సరిగా పాల్గొనపోయినప్పటికీ మ్యూజిక్ కన్సర్ట్ షోలో సామ్ చేసిన డాన్స్ తో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఖుషీ సినిమా రేపు విడుల అవుతోంది.