ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు వారి నమ్మకాలను బట్టి వివిధ దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. దేవుళ్ళని నమ్మే వాళ్ళ తో పాటుగా నాస్తికులు కూడా ఉంటారు. దీని పైన పరిశోధన చేసిన World Of Statistics అనే సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత దేశం ర్యాంకింగ్ చుస్తే అందరికి ఆశ్చర్యమేస్తుంది.
భారత్ దేశం సెక్యూలర్ దేశం, ఇక్కడ ఒక మతమేనని కాక అన్ని మతాలు మన దేశంలో సమానమే. భారత దేశంలో హిందువుల తో పాటుగా క్రిస్టియన్, ముస్లిం మరియు జైన్ మతాలకు చెందిన వారు కూడా ఉంటారు. ఇక వరల్డ్ అఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ ప్రపంచంలోని దాదాపు 34 దేశాల్లో మత విశ్వాసాల పై పరిశోధనలు చేయగా, కేవలం 45% ప్రజలు మాత్రమే దేవుళ్ళని నమ్ముతారని, మిగిలిన వారు నాస్తికులు అని తన రిపోర్ట్ లో పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం దేవుళ్ళని విశ్వసించే మొదటి 9 దేశాలు ఏవంటే..?
1. ఇండోనేషియా (Indonesia):
ఇండోనేషియా దేశంలోని 93 శాతం మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముతారని. తమ రోజు వారి జీవన శైలిలో దేవుని ప్రార్తనకు కచ్చితంగా సమయం కేటాయిస్తారని తన రిపోర్ట్ లో పేర్కొంది. దేవుడిని అత్యధికంగా విశ్వసించే దేశాలలో ఇండోనేషియా మొదటి స్తానం లో ఉంటుంది.
2. టర్కీ (Turkey):
దేవుడిని విశ్వసించే దేశాలలో ఇండోనేషియా తర్వాత రెండో స్థానంలో టర్కీ ఉంది. ఈ దేశంలో ముస్లింలు అధికంగా ఉండడంతో వారు సహజంగానే అల్లాను విశ్వసిస్తూ ఉంటారు. టర్కీ దేశంలోని దాదాపు 91% మంది ప్రజలు అల్లాను పూజిస్తారు. ఈ దేశంలోని ప్రజల యొక్క జీవన శైలి, విద్య మరియు ఆహారపు అలవాట్లు అన్ని ఇస్లాం మతం పైనే ఆధార పది ఉంటాయి.
3. బ్రెజిల్ (Brazil):
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్(World of Statistics) దేవుణ్ణి నమ్మే దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉందని తమ నివేదిక లో పేర్కొన్నారు. బ్రెజిల్లో 84 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారట. బ్రెజిలియన్లలో ఎక్కువ మంది క్రైస్తవ మతానికి చెందిన వారు. క్రైస్తవ మతం లో రెండు తెగలు ఉండగా బ్రెజిల్ లో ని వారు కాథలిక్కులు(Catholics). ప్రపంచంలోనే అతిపెద్ద యేసు క్రీస్తు(Jesus Christ) విగ్రహం బ్రెజిల్లో నే ఉంది. ఇది ఆ దేశం లో ప్రజల కు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది.
4. దక్షిణ ఆఫ్రికా (South Africa):
34 దేశాల పై నిర్వహించిన సర్వే లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో నిలిచిందట. ఇక్కడి జనాభాలో 83 శాతం మందికి దేవుడిపై అపారమైన విశ్వాసం ఉంది. దక్షిణాఫ్రికా ను బ్రిటన్ వారు పరిపాలించినందున, క్రైస్తవ మతాన్ని విశ్వసించే వారు ఈ దేశం లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారట.
5. మెక్సికో (Mexico):
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్(World of Statistics) నివేదిక ప్రకారం ఇక్కడి ప్రజలలో 78 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారట. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా హింసకాండ ఎక్కువగా ఉన్నప్పటికీ వీరికి దేవునిపై చాలా విశ్వాసం కలిగియున్నారట. ఈ జాబితాలో మెక్సికో ఐదవ స్థానంలో నిలించిందని నివేదిక లో పేర్కొన్నారు.
6. అమెరికా (America):
అమెరికా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అని మనకందరికీ తెలుసు అంతేకాకుండా ధనిక దేశం కూడా. అయితే, అమెరికా ఎంత అభివృద్ధి చెందిన దేశమయిన ఆ దేశ ప్రజలు తమ దేవుడిపై తమకున్న నమ్మకాన్ని మరచిపోలేదట, దేవుణ్ణి తిరస్కరించలేదట. దేవుణ్ణి ఎక్కువగా నమ్మే దేశాల జాబితాలో అమెరికా 6వ స్థానం దకించుకుందట. అమెరికా జనాభాలో 70 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారాని ఆ నివేదిక లో వెల్లడించారు .
7. అర్జెంటీనా (Argentina):
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్(World of Statistics) సర్వే ప్రకారం దేవుడిని నమ్మే దేశాల్లో అర్జెంటీనా ఏడో స్థానంలో నిలిచిందట. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని కచ్చితంగా భగవంతుని ఆరాధనకు కేటాయిస్తారట. ఇక్కడి జనాభాలో 62 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారని, దేవుడిని ఆరాధించడానికే అంకితమవుతారని ఈ సర్వే యొక్క నివేదిక లో వెల్లడించారు.
8. రష్యా (Russia):
దేవుణ్ణి నమ్మే దేశాల్లో రష్యా కూడా ఉందట. ఇక్కడి ప్రజలు కూడా దేవుణ్ణి నమ్ముతారట . దాదాపు 56 శాతం మంది దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తున్నారని, దేవుడిని నమ్మే దేశాల జాబితాలో రష్యా ఎనిమిదో స్థానంలో నిలిచిందని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్(World of Statistics) సర్వేలో తేలింది.
9. భారతదేశం (India):
ఇక మన దేశం ఈ జాబితా లో తిమిదవ స్థానం లో ఉందట. భారతదేశం లో అనేక మతాలు ఉన్నాయి హిందూ మతం లో పురాణాల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పారు అలాగే ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారు. భారతదేశంలో అనేక మతాలు , సంస్కృతులు ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో దేవుణ్ణి నమ్మే వారి సంఖ్య చాలా తక్కువట . భారతదేశ జనాభాలో 56 శాతం మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నారట. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కాదు అంతేకాదండోయ్ చాలా మంది ప్రజలు విగ్రహారాధనను కూడా నమ్మరట .