యాక్షన్, ఎంటర్ టైనమెంట్ సినిమాలకు పెట్టిన పేరు బోయపాటి శ్రీను. ఎంతోమంది హీరోలకు తన సినిమాలతో హిట్ అందించాడు. ప్రస్తుతం స్కంద Skandha సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా థియేటర్ లో రీలిజ్ కి సిధ్ధంగా ఉంది. విడుదలకు ముందే ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది.
స్కంద సినిమాను వాస్తవానికి 40 కోట్లతో తీశారు. అయితే నాన్ థియేటర్ లోనే ఈ మూవీ98 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
40 కోట్లతో తీసిన సినిమాకి 98 కోట్ల బిజినెస్ రావడం నిజంగా ఆశ్చర్యమే. స్కంద సినిమా భారీ అంచనాలతో రీలిజ్ కి సిద్ధంగా ఉంది.
థియేటర్ లో రిలీజ్ కాకుండా నాన్ థియేటర్ లోనే అంత డబ్బులను వసూలు చేయడం నిజంగా రికార్డే. ఇక థియేటర్లలో రీలిజ్ అయితే ఇంకెన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో.
వినాయక చవితి పండగని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ కి 15 రోజులు ముందుగానే ఇంత కలక్షన్ రావటం నిర్మాతలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బ్రహ్మాండంగా బిజినెస్
- స్కంద టీమ్ కు సౌత్ లాంగ్వేజెస్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ స్టార్ నెట్వర్క్ గ్రూప్ 54 కోట్ల రూపాయలను సొంతం చేసుకున్నారు.
- హిందీ వెర్షన్ ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ 35 కోట్లు రూపాయలను సొంతం చేసుకున్నారు.
- ఆడియో రైట్స్ ద్వారా 9 కోట్లు వచ్చాయి.
- తెలుగు థియాట్రికల్ రైట్స్ విషయంలో కూడా అంచనాలకు మించి స్కంద ముందుకెళుతోంది. థియేటర్ ల నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా 50 కోట్లు వసూలు చేసింది.
రీలిజ్ కి ముందే ఇంతటి కలక్షన్ రావటం అందరిని షాక్ కి గురి చేసింది. స్కంద సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీలిజ్ చేస్తున్నారు.
రామ్ పోతినేని, శ్రీలీలా: Skandha
స్కంద సినిమాలో రామ్ పోతినేని, శ్రీలీలా హీరో,హీరోయిన్ గా నటించారు. మాస్,యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ మూవీలకు రామ్ పెట్టింది పేరు.
ఇస్మార్ట్ శంకర్ రామ్ కి మంచిపేరు తెచ్చిన మూవీ.అలాగే పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిలో పడింది శ్రీలీల.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నస్కంద ఇంకెన్ని రికార్డులకు కారణమవుతుందో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ ప్రోడక్షన్
స్కంద సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు రీలిజ్ చేస్తున్నారు. శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య,జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, సర్కారు వారి పాట,ఖుషీ, వీర సింహారెడ్డి లాంటి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలన్న ఈ నిర్మాణ సంస్థ విడుదల చేసినవే.
ఇప్పుడు స్కంద మూవీతో మరో హిట్ కొడతారేమో చూడాలి. విడుదలకు ముందే బాగా బిజినెస్ చేసిన ఈ మూవీ థియేటర్ల వసూళ్లు ఎంతుటాయన్నదే ఇప్పుడు టాపిక్.
స్కంద మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్, హిందీలో జీ వాళ్లు ఓటీటీలకు ఈ మూవీని కొనుక్కున్నారు. సో.. ఓటీటీల్లో కూడా స్కంద సెన్సేషన్ సృష్టించినట్లే..