బుల్లితెర బిగ్ షో బిగ్ బాస్ (BIGG BOSS) సీజన్ 7 హంగామా షురూ అయింది. ఇప్పటికి ఆరు సీజన్లు సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తుకొని 7 సీజన్ తో మన ముందు వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో తెలుగు ప్రేక్షకులను సందడి చేయడం మొదలు పెట్టింది. నాగార్జున తార్ మార్ తక్కర్ మార్ పాటతో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. ఉల్టా పుల్టా అనే కాన్స్ ప్ట్ ప్రమోషన్ తోనే ఈ సీజన్ ఆరంభం అదిరిపోయింది. లాంచింగ్ ఎపిసోడ్ అంటే డాన్సులు, అరుపులు, కేకలు, సెలబ్రిటీ రాకతో స్టేజీ దద్దరిల్లిపోతుంది. ప్రతీసీజన్ కి ఏదో ఒక మూవీ టీమ్ ను రప్పించే నాగ్ ఈ సారి ఖుషీ టీమ్ ను రంగంలోకి దింపారు.
నాగ్ నోట సమంత పేరు!
ఖుషీ టీమ్ నుంచి విజయ్ దేవర కొండ , వర్ధమాన నటుడు నవీన్ పోలిశెట్టి రావడంతో జోష్ పెరిగింది. విజయ్ కనపడగానే నాగార్జున వెంటనే సమంత గురించి అడగడం సరదాగా అనిపించింది. మీ హీరోయిన్ సమంత ఎక్కడ? అని ప్రశ్నించగా న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ లో ఉందని విజయ్ దేవర కొండ బదులిచ్చాడు. నాగచైతన్య తో విడాకుల తర్వాత నాగార్జున ఎక్కడా నేరుగా సమంత పేరు తీసింది లేదు. ఊహించని ప్రశ్నతో అవాక్కయ్యాడు విజయ్.. ఇలా నాగార్జున తొలిసారి మాజీ కోడలు గురించి మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు చాలా రోజులు తరువాత నాగార్జున నోటి నుంచి సమంత పేరు వచ్చింది అని సంబర పడుతున్నారు. సమంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే లాంచ్ ఎపిసోడ్ మరో రేంజ్ లో ఉండేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
హౌస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్లు (BIGG BOSS)
ప్రతి సీజన్ మొదలవుతున్నప్పుడు హౌస్ లోకి ఎవరు రాబోతున్నారని ప్రేక్షకుల్లో వుండే అంచనాలు, ఊహాగానాలు ఎలా వున్నా, ఎప్పటిలాగే ఈసారి 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 పూర్తిభిన్నంగా ప్రేక్షకులను ముందుకు రాబోతోంది.
సీజన్ 7 ఆదివారం మొదలైంది. ఒక్కొక్క ఇంటి సభ్యులను ఫన్నీగాపరిచయం చేస్తూ నాగ్ వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ అంచనాలకు మించేలాగ ఉంటుందని నాగార్జున అన్నారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్లు హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదని అన్నారు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ : (BIGG BOSS)
- ప్రియాంకా జైనా -సీరియల్ నటి
- శివాజీ -నటుడు
- దామిని – సింగర్
- ప్రిన్ యావర్ -మోడల్
- శుభ శ్రీ -లాయర్, నటి
- షకీలా -నటి
- ఆట సందీప్- డాన్స్ కొరియోగ్రాఫర్
- శోభా శెట్టి -సీరియల్ నటి
- టేస్టీ తేజ -యూట్యూబర్
- రథిక రోజ్ -సిని నటి
- గౌతం కృష్ణ- డాక్టర్ యాక్టర్
- కిరణ్ రాథోడ్ -సీనియర్ నటి
- పల్లవి ప్రశాంత్ -యూట్యూబర్
- అమర్ దీప్- సీరియల్ నటుడు
14 మందితో సాగుతున్న బిగ్ బాస్ -7 తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయం. అనుక్షణం ఉత్కంఠ ప్రతి క్షణం ఉత్సాహం తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కంటెస్టెంట్స్. స్టార్ మా లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటల నుంచి ప్రతి తెలుగు ప్రేక్షకులను టివిల ముందు కట్టిపడెయ్యబోతోంది.
శనివారం, ఆదివారం రాత్రి 9 గంటల నుంచి నాగార్జున కంటెస్టెంట్స్ లతో మాట్లాడుతూ వారితో రకరకాల ఆటలు ఆడిస్తాడు. చివరగా ఎలిమినేషన్ రౌండ్ కూడా ఉంటుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రం 24/7 స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 16 జూల్తె 2017 న స్టార్ మాలో ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకూ అన్నిబిగ్ బాస్ సెట్ లను అన్నపూర్ణ స్టూడియోలోనే వేశారు. ఇప్పుడు కూడా అక్కడే షో జరుగుతోంది.
ఈ సీజన్ హోస్ట్ మారతారని, వేదిక మారుతుందని గతంలో ప్రచారం జరిగినా అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది.