రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు పాన్ ఇండియా హీరో ట్యాగ్ లైన్ శాపంగా మారిందా? ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు.. తీస్తున్న సినిమాలు రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతున్నాయి. మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ అనుకుంటే అందుకు పూర్తి రివర్స్ లో ప్రభాస్ కెరీర్ కొనసాగుతోంది. ఆకాశానికెత్తెస్తూ అట్టహాసంగా ప్రకటించిన ఆదిపురుష్ కూడా తుస్సు మనడం,చేతిలో ఉన్న ప్రాజెక్టులు వాయిదాల మీద వాయిదాలు పడటంతో ప్రభాస్ ఇబ్బందులు పడుతున్నాడు. బలగం లాంటి చిన్నసినిమాలు సూపర్ హిట్ అయ్యి అతర్జాతీయ స్థాయిలో అవార్డులు తెస్తుంటే ప్రభాస్ మాత్రం సరైన హిట్ లేక అల్లాడుతున్నాడు. ప్రభాస్ కి పాన్ వాల్డ్ ఇమేజ్ దక్కడం ఒక విధంగా ఈ స్టార్ కెరీర్ కు ఇబ్బందిగా మారుతోంది. బాహుబలి తర్వాత తీసిన సాహో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాతవచ్చిన రాథేశ్యామ్ మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయినా బాక్సాఫీస్ దగ్గర అది సో. సో.. అనిపించుకుంది.ఓం రౌత్ దర్శకత్వంలో అట్టహాసంగా, బీభత్సమైన పబ్లిసిటీతో విడుదలైన ఆదిపురుష్ కాస్తా వివాదాల పాలయ్యింది. ప్రభాస్ కు మరో మైల్ స్టోన్ లా నిలుస్తుందనుకున్న ఈ మూవీ చివరకు వివాదాల పాలయ్యి కెరీర్ కు ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది.
ఇప్పుడిక సలార్… (Prabhas)
ఈనెల28న విడుదలవుతుందనుకున్న సలార్ కూడా ఇప్పుడు రిలీజ్ కావడం లేదనే వార్తలొస్తున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న సలార్ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతోంది. ఆఖరికి ఈ నెలలో విడుదల వుంతుందని మేకర్లే ప్రకటించారు. సినిమా విడుదల డేట్ వచ్చేసినా సలార్ ట్రైలర్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. మూవీ వాయిదా తధ్యమని అంటున్నారు.. పోనీ అని అది కూడా అధికారికంగా ప్రకటించలేదు. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక నిరాశగా ఉన్న ఫ్యాన్స్ సలార్ తోనైనా తమ స్టార్ అదరగొడతాడు అనుకున్నారు.కానీ అదీ వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
వాయిదా అందుకేనా?
సలార్ మూవీ విడుదల వాయిదాకు ఓవర్సీస్ టికెటింగ్ వెబ్ సైట్లే కారణమని తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ సినిమా బుకింగ్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉండగా ఉన్నట్లుండి టికెట్ల అమ్మకాలను నిలిపివేశారు. ఇప్పటికే ఓవర్సీస్ బయ్యర్లు థియేటర్ల యజమాన్యాలకు సమాచారం కూడా అందించారు. సలార్ సినిమాను మాత్రం ఆంధ్ర, తెలంగాణ అమ్మకానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర లో 85 కోట్లు నైజాం లో 80 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్న్ కింద ఇవ్వాలనుకుంటున్నారు. సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విక్రయ అగ్రిమెంట్ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అమెజాన్ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు ప్రముఖ పాత్రలో నటించారు. సలాస్ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఇందులో ప్రభాస్ పాత్ర చాలా హింసాత్మకంగా ఉంటుంది.
సలార్ సినిమా రీమెక్ కాదని ప్రభాస్ కోసం రాసిన కథ అని నీల్ స్పష్టం చేశారు.
మరోవైపు సలార్ మూవీ అనుకున్నట్లు షూటింగ్ రాలేదని, చాలా పార్ట్ రీ షూట్ చేయాల్సిన అవసరముందని నిర్మాణసంస్థ భావించినట్లు తెలుస్తోంది.
సీజీ వర్క్ కూడా పరమ దారుణంగా ఉందని సమాచారం.
ఇంతకీ సినిమా ఒక పార్టా? రెండుపార్టులా?దీనిపైనా నిర్మాణ సంస్థ గందరగోళంలోనే ఉన్నట్లు సమాచారం.
వీటన్నింటికీ తోడు ప్రభాస్ ఆరోగ్యం.. మోకాలునొప్పి మళ్లీ తిరగబెట్టడం.. సర్జరీ ఫెయిల్ కావడం.. రెస్ట్ తీసుకోక తప్పని పరిస్థితులు అన్నీ సినిమా పై ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తోంది.
సలార్ సినిమా అప్డేట్స్ ఇలా ఉంటే ఇక కల్కిమూవీ గురించి వివరాలే లేవు.. అది ఒకపార్టా, రెండు పార్టులా అన్నదికూడా తెలీదు..
ఇలా ఏ విషయమూ స్పష్టత లేక అభిమానులు నిరాశపడుతున్నారు.
గతంలో పెదనాన్న కృష్ణం రాజు బతికి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ సులభంగా పరిష్కారమయ్యేవి.. కానీ ఇప్పుడు ప్రభాస్ ఒంటరివాడైపోయాడా?