అతడొక ఆకలిగొన్న పులి..మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్ధి చుక్కలు చూడాల్సిందే. బ్యాట్ కి, ప్యాడ్ కి మధ్యలోనుంచి అత్యంత లాఘవంగా బాల్ ను విసరగల బెస్ట్ బౌలర్.. అతగాడే షమీ.. (Md shami) షమీ బౌలింగ్ అంటే బ్యాట్స్ మెన్ తడబడాల్సిందే.అలాగే వివాదాల్లోనూ ముందే ఉంటాడు. సొంత భార్య షమీపై అట్రాసిటీ కేసు పెట్టిందంటేనే ఈ వివాదాల రాయుడు గురించి అర్ధం చేసుకోవచ్చు.
1990, సెప్టెంబరు 3న బెంగాల్లో జన్మించిన మహ్మద్ షమీ.. 2013లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనతికాలంలోనే అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. సాధారణంగా టెస్టుల్లో ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేసే షమీ.. టీమిండియాకి ఎన్నో మ్యాచ్‌ల్లో మెరుపు ఆరంభాల్ని ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 336 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది భారత్ పర్యటనకి దక్షిణాఫ్రికా టీమ్‌రాగా.. ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌ని షమీ బౌల్డ్ చేసిన విధానం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు.
టాలెంట్ గుర్తించిన బద్రుద్దీన్ (Md shami)
షమీ వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లోని సాహస్పూర్ కి చెందినవాడు. అతడి తండ్రి టోసిఫ్ ఆలీ సాధారణ రైతు. తండ్రి కూడా యుక్తవయసులో క్రికెట్ లో ఫాస్టు బౌలర్ గా ఆడేవాడు. షమీకి ఒక సోదరి, ముగ్గురు సోదరులు. సోదరులు కూడా ఫాస్టు బౌలర్స్ కావాలని కోరుకున్నారు. 2005లో అతడి తండ్రి షమీలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిని తన గ్రామానికి 22 కి.మీ దూరంలో ఉన్న మొరాదాబాదులోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకుపోయాడు. అలా బద్రుద్దీన్ తో పరిచయం పెరిగింది.
మొహమ్మద్ షమీ కి అందరిలాగా క్రికెట్ అవకాశాలు సులభంగా రాలేదు.
అండర్ 19 విభాగంలో ఉత్తర ప్రదేశ్ జట్టులో స్థానం దక్కలేదు.. దాంతో కోచ్ బద్రుద్దీన్ అతడిని 2005లో కోల్‌కతాకు పంపాడు. అలా షమీ డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్ కు ఆడేవాడు. ఆ క్లబ్ కు ఆడుతున్నప్పడు క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ అసిస్టెంట్ సెక్రటరీ అయిన దేవవ్రత దాస్ కంట్లో పడ్డాడు. షమీ బౌలింగ్ కి ఫిదా అయిన దేవవ్రత తన టీం లో ఆడవలసినదిగా కోరాడు.
లైఫ్ ఇచ్చిన దేవవ్రత దాస్
అప్పుడు తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదన్న విషయం అతగాడి దృష్టికి తీసుకొచ్చాడు షమీ.దాంతో షమీని తనఇంటికే తీసుకుపోయాడు దేవవ్రత దాస్.
అలా టౌన్ క్లబ్ తరపున బాగా బౌలింగ్ చేసి అండర్ 22 బెంగాల్ జట్టులో స్థానం సంపాదించాడు. బెంగాల్ జట్టులో స్థానం పొందిన తరువాత షమీ ఈడెన్ గార్డెన్ నెట్స్ వద్ద సౌరవ్ గంగూలీకు బౌలింగ్ చెసేవాడు. గంగూలీ షమీ బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సెలక్టర్లను కోరాడు.
అస్సోం తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ (Md shami)
షమీ మొట్టామొదటి సారిగా 2010లో అస్సోం ఫస్టు క్లాసు క్రికెట్ ను ప్రారంభించాడు. అందులో మూడు వికెట్లను తీసుకున్నాడు.
దేశీయ క్రికెట్ లో అతని ప్రదర్శన కారణంగా 2012 లో వెస్ట్ ఇండీస్-బౌండ్ ఇండియా (ఎ) స్క్వాడ్ లో స్థానం పొందాడు. 2012-12 లో రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాదు జట్టుకు ప్రత్యర్థిగా ఆడాడు.
వన్డేల్లోకి వచ్చిందిలా… (Md shami)
షమీ బెంగాల్ జట్టు సహ సభ్యుడు అశోక్ దిండా స్థానంలో పాకిస్థాన్ తో జరిగిన ఒన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కు 2013 ఒ.డి.ఐకి సెలక్ట్ అయ్యాడు.
తరువాత జనవరి 5 న మూడవ ఒ.డి.ఐలో ప్రవేశించాడు.
2014 మార్చి 5 న, ఆసియా కప్ కొరకు ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో షామీ 50 వన్డేల వికెట్లు సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు.
వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులమయం
మొహమ్మద్ షమీకి 2016 డిసెంబర్ 24న వివాహం జరిగింది. షమీ, హసిన్ జహాన్..మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్ అతడికి ఇతర స్త్రీలతో సంబంధాలను ఉన్నాయని ఆరోపించింది. దీంతో కోల్‌కతా పోలీసు ఉమెన్స్ గ్రీవియెన్స్ సెల్ షమీని ప్రశ్నించింది.తర్వాత అతడిపై అరెస్ట్ వారంట్ జారీ అయ్యింది. తనపై హసిన్ జహాన్.. చేసిన ఆరోపణలు షమీ ఖండించాడు. అయితే ఆమెకు అనుకూలంగా మాత్రం తీర్పు రాలేదు.దాంతో చాలా కాలంగా షమీకి దూరంగా ఉంటున్న హసిన్ జహాన్.. తనకు నెల వారీగా రూ.10 లక్షలు భరణం చెల్లించాలని ఆమెను కోర్టును కోరింది.
ఇలా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులమయం అయినా క్రికెట్ ఆటలో మాత్రం షమీ రాణించాడనే చెప్పాలి.