(oxygen)
చంద్రమండలంపై మానవ ఆవాసాల నిర్మాణం మరెంత దూరంలోనో లేదనిపిస్తోంది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్ అయిన ఉత్సాహంలో మన దేశం ఉంటే అదే జాబిల్లిపైకి మేము సైతం అంటూ జపాన్ కూడా స్లిమ్ అనే ఉపగ్రహాన్ని పంపింది. అయితే అంతరిక్షం పై పట్టుకోసం విపరీతంగా శ్రమిస్తున్నఅమెరికా తన పరిశోధనల్లో మరో ముందడుగు వేసింది. నాసా పరిశోధనల్లో ముందడుగు చంద్రునిపై ఆక్సిజన్ లేదు. అయితే కృత్రిమంగా ఆక్సిజన్ మనమే తయారు చేసుకుంటే ఇతర గ్రహాలను కూడా మన ఆవాసంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఆలోచనతోనే ప్రయోగాలు చేస్తున్న అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మరో గొప్ప విజయాన్ని సాధించింది. అదే అరుణ గ్రహంపై కృత్రిమ ఆక్సిజన్ ను తయారు చేయడం. అరుణగ్రహంపై ఉన్న పెర్సర్వెరెన్స్ రోవర్ ఈ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ కృత్రిమంగా తయారు చేసిన మైక్రోవేవ్ సైజులోని మోక్సీ అనే పరికరం 16వసారి దిగ్విజయంగా కార్బన్ డై ఆక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలిగింది. పెర్సర్వెరెన్స్ రోవర్ సాధించిన అరుదైన విజయమంటూ నాసా తన బ్లాగ్ లో రాసుకొచ్చింది. మార్స్ గ్రహంపై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను చివరి సారి దిగ్విజయంగా ఆక్సిజన్ కింద మార్చడంలో మా ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి అని నాసా ట్వీట్ చేసింది.
నాసా సమాచారం ప్రకారం పెర్సర్వెరెన్స్ రోవర్ 2021లో మార్స్ గ్రహంపై దిగిన నాటినుంచి ఆక్సిజన్ తయారు చేయడం మొదలు పెట్టింది. మొత్తం 122 గ్రాముల ఆక్సిజన్ ను ఆ గ్రహంపై తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రోవర్ తన లక్ష్యాన్ని ఛేదించింది. అది తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి రెట్టింపు సాధించాం అని నాసా వివరించింది. అరుణ గ్రహంపై తయారు చేసిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛమైనదని, దానిని మనం శ్వాసించడానికి, ఇంధనంగానూ కూడా ఉపయోగించుకోవచ్చన్నది స్పేస్ ఏజెన్సీ కథనం.
పరిశోధన వ్యయం భరించగలిగేదే… (oxygen)
మోక్సీ ప్రయోగం మార్స్ గ్రహంపై ఆక్సిజన్ (oxygen) తయారీ మనం భరించగలిగిన ఖర్చులోనే ఉందని నిరూపించింది. తయారు చేసిన ఆక్సిజన్ ను మనం పీల్చుకోడానికి, భవిష్యత్తులో ఈ గ్రహంపై పరిశోధనలు చేసే ఆస్ట్రోనాట్లు వాడే రాకెట్ ప్రొపెల్లంట్ గానూ ఉపయోగపడుతుంది.
చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు అవసరమైన వనరుల కల్పన అనేది దీర్ఘకాలిక అంశమని, ప్రస్తుత పరిణామాలు చంద్రునిపైనా, మార్స్ గ్రహంపైనా కూడా పరిశోధనలకు అనువైన వాతావరణం, బడ్జెట్ ఉన్నాయని నిరూపిస్తున్నాయని నాసాడిప్యూటీ ఎడ్మినిస్ట్రేటర్ పామ్ మెలోరీ అన్నారు.
మోక్సీ పరికరంతో ఆక్సిజన్ (oxygen)
MOXIE, an oxygen-producing instrument on @NASAPersevere, has successfully completed its Mars mission. The tech demo successfully tested converting Martian CO2 into oxygen, which could help pave the way for future human missions to Mars.
Learn more: https://t.co/pw5Fud4e4G pic.twitter.com/fPIEnXVUIy
— NASA Mars (@NASAMars) September 7, 2023
మార్స్ పై వాతావరణం చాలా పలుచగా, తేలికగా ఉంటుంది. అక్కడ దొరికే కార్బన్ డై ఆక్సైడ్ లోని ప్రతీ అణువునుంచి ఒక ఆక్సిజన్ పరమాణువును ఎలక్ట్రో కెమికల్ ప్రోసెస్ ద్వారా వేరు చేసి ఆక్సిజన్ తయారీకి మోక్సీ పరికరం ప్రయత్నించి విజయం సాధించిందని యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో అరుణ గ్రహంపై భవిష్యత్తులో మరిన్ని మానవ సహిత ప్రయోగాలు సాధ్యపడతాయని నిరూపణ అయ్యిందని ఆఏజెన్సీ కామెంట్ చేసింది.అరుణ గ్రహంపై ఉన్న మూలకాలు, ఖనిజాలను వినియోగించి అక్కడ పరిశోధనలకు అనువైన వాతావరణం సృష్టించుకోవచ్చని తెలిపింది.ఇన్ -సిటు వనరుల వినియోగం అనే ఈ పద్ధతి వల్ల ఇతర గ్రహాలపై పరిశోధనలు జరిపే అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.అంతరిక్షంలో గ్రహాలపై ఆక్సిజన్ తయారీ సాధ్యమేనని తేలినందున ఈ పరిశోధనలను మరింత ముందుకు తీసుకు వెళతామని నాసా తెలిపింది. తదుపరి మోక్సీలాంటి ఆక్సిజన్ జనరేటర్ ను అక్కడ నెలకొల్పి ద్రవరూప ఆక్సిజన్ ను తయారు చేసి నిల్వ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని నాసా తెలిపింది. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇతర టెక్నాలజీలపై కూడా దృష్టి పెడతామంది.
ఫ్యూచర్ టెక్నాలజీపై మరిన్నిపెట్టుబడులు
ఆక్సిజన్ తయారీలాంటి ఫ్యూచర్ టెక్నాలజీ పై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నాసా ఆసక్తి చూపిస్తోంది.అంతరిక్ష వనరులతయారీ పరిశ్రమల స్థాపనలో ఇదో మేలి మలుపు కాగలదని నాసా భావిస్తోంది.