7691
తెలుగు దేశం పార్టీకి అధ్యక్షుడు, 14ఏళ్లపాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగాకొనసాగిన నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముఖం చూడక తప్పలేదు. ఆదివారం అర్ధరాత్రి హైటెన్షన్ మధ్య రాజమండ్రికి చంద్రబాబును తరలించేంత వరకూ రెండు రోజులు ఆయన నిద్రలేని రాత్రులు గడిపారు. అర్ధరాత్రి ప్రత్యేక జైలుకు చేరుకున్నాక ఆయన విశ్రమించారు. అర్ధరాత్రి జైలులోకి తీసుకు రావడంతో నిద్రలేక బాధపడ్డారని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ అప్పర్ బ్లాక్ లోని ప్రత్యేక గదిలో ఉంచారు. ఆయన కు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. ఆయనకు ఒక వ్యక్తిగత సహాయకుడు ఉంటారు. రాత్రంతా నిద్రపోని చంద్రబాబు టీవీ వార్తలు చూస్తూ గడిపినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయనకు ఇంటి వద్ద నుంచి భోజనాన్నితెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రత్యేక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నందున ప్రత్యేక గది కేటాయించి, ప్రత్యేక భద్రత కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా ఇంటిదగ్గరనుంచి సిబ్బంది ఇవాళ ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లారు. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో బ్రెక్ ఫాస్ట్ ను కుటుంబ సభ్యులు పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ కూడా తీసుకెళ్లినట్లు సిబ్బంది
నిద్ర లేని రాత్రులు… 7691
శనివారం తెల్లవారు జామున కాసేపు మాత్రం చంద్రబాబు నిద్రపోయారు. శనివారం తెల్లవారు జామున ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి విశ్రాంతి లేకుండా గడిపారు. నంద్యాలలో అరెస్టయిన చంద్రబాబును ఆయన కోరిక మేరకు రోడ్డు మార్గం ద్వారా తీసుకు రావడంతో సీఐడీ కార్యాలయానికి ప్రయాణం 9 గంటలు పట్టింది. అప్పటికే ఆయన అలసి పోయారు. ఆతర్వాత రాత్రంతా సిట్ కార్యాలయంలోనే విచారణలో గడిపారు.
ముభావంగా…ఒంటరిగా… 7691
శనివారం రాత్రంతా ఆయనను సీఐడీ అధికారులు స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించిన విచారణ జరిపారు. తెల్లవారు జామున ఆయనకు వైద్య పరీక్షలు జరిపి నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు. రాత్రంతా మేలుకుని ఉన్నా ఆయన ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.అయితే సెంట్రల్ జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు రెండు పిటీషన్లు దాఖలు చేశారు. రిమాండ్‌ను హౌస్ అరెస్ట్‌గా పరిగణించేలా ఆదేశాలివ్వాలని, ప్రత్యేక జైల్లో ఉంచాలని పిటీషన్లు వేశారు. ఇంటి నుంచి భోజనం, మందులు తెప్పించుకునేందుకు సీఐడీ న్యాయవాదులు ఏ విధమైన అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ హౌస్ అరెస్ట్ , ప్రత్యేక జైలు విషయంలో తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. ఒకసారి రిమాండ్ విధించాక ఉత్తర్వులు మార్చడానికి వీలు కాదు అన్ని తెలిపారు. పరిస్థితిని బట్టి మాత్రమే హౌస్ అరెస్టు ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో అలాంటి అసాధారణ పరిస్థితుల్లేవని స్పష్టం చేశారు సీఐడీ అధికారులు..
పోటా పోటీ కౌంటర్ల దాఖలు
మరోవైపు బెయిల్ కోసం చంద్రబాబు టీమ్ ఏసీబీ కోర్టులో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు కౌంటర్ గా సిఐడీ మరో మూడు కేసులను తెరపైకి తెచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ కేసులో ఆయన్ను విచారించాలని కాబట్టి కస్టడీకి ఇవ్వాలనీ కోరింది. చంద్రబాబు భద్రత రీత్యా ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలంటూ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా ఇవాళ కోర్టును గట్టిగా కోరనున్నారు. కోర్టు మరి ఏం తీర్పునిస్తుందో చూడాలి.