Dhanush
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అంటే చాలు ఎంతో హడావుడి కనిపిస్తుంది. అందులో పేరున్న స్టార్ల పెళ్లి అయితే ఇక హంగామా మామూలుగా ఉండదు. మరీ ముఖ్యంగా కొన్ని రోజులు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కితే ఇక వారికుండే పబ్లిసిటీ మామూలుగా ఉండదు. ఇప్పుడు అలాంటి న్యూసే కోలీవుడ్ ను కుదిపేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యకంగా చెప్పాలా… ఆయన తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులలో కూడా ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ధనుష్ నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.అటు హిందీ, హలీవుడ్ మూవీస్ లోనూ నటించాడు. అలాంటి ధనుష్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? ఇప్పుడిదే వార్త సంచలనంగా మారింది. నిజానికి ఐశ్వర్యతో విడాకుల తర్వాత ధనుష్ మరో పెళ్లి చేసుకోవచ్చు.. కానీ ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ భామ మెడలో మూడు ముళ్లు వేస్తున్నాడన్నటాక్ బీ టౌన్ లో సంచలనంగా మారింది.
సొంత కష్టంతో ఎదిగిన Dhanush
గతంలో రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న ధనుష్ ఎందుకో కొన్ని కారణాల చేత విడిపోయాడు. Dhanush స్వయానా రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. మామ పేరును వాడుకోకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు ధనుష్. అన్యోన్యంగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య జంట చివరకు విడాకులు తీసుకోవడం అప్పట్లో అందరినీ బాధపెట్టింది. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ధనుష్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయినా విడాకులు తీసుకున్నాక మరో పెళ్లిచేసుకుంటే తప్పేంలేదని ధనుష్ అభిమానులు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ధనుష్ అలాంటి వాడు కాదని మేటర్ తెలీకుండా విమర్శించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. ధనుష్ కి అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.
స్టార్ హీరోయిన్ మెడలో మూడు ముళ్లు… Dhanush
ధనుష్ రెండో పెళ్లి అదీ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడనే రూమర్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఆమెతోనే ఎక్కువగా తిరుగుతున్నాడని, నైట్స్ టైమ్స్ కూడా తన ఇంట్లోనే ఉంటున్నాడని బీ టౌన్ లో రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు డిసెంబర్ లో ఒక్కటి కాబోతున్నారని మరికొందరు డిసైడ్ చేసేస్తున్నారు.. ఎలాంటి హడవిడి లేకుండా సింపుల్ గా టెంపుల్ లో తాళి కట్టాలని డిసైడ్ అయ్యారన్నది ఒక టాక్.
ఇంతకీ ఎవరా హీరోయిన్?
ధనుష్ తో ప్రేమలో ఉన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కియారా అద్వానీ.. ఇంతకీ వీళ్ల ప్రేమ, ఆపై పెళ్లి పుకారేనని తేలిపోయింది. వీరిద్దరి ప్రేమ, పెళ్లి రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో మాత్రమేనని బాలీవుడ్ వర్గాలు వివరణ ఇచ్చాయి.
తేరే ఇష్క్ మే
కియారా అద్వానీ, ధనుష్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోంది. . తేరే ఇష్క్ మే అనే ఆ సినిమాలో ధనుష్, కియారా అద్వానీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ మూవీ షూటింగ్ లో వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అవడం చూసిన వారు పుట్టించిన పుకారే ఇది అని బాలీవుడ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.తమిళ హీరో ధనుష్ కు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.ఆయన సినిమా వస్తుందంటే వారికి పండగే. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ అందుకు ఉదాహరణ. ఇటీవల వెంకీ అట్లూరితో సార్ అనే తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సినిమ తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చదువుల ప్రాముఖ్యతపై తీసిన ఈ చిత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది.