(Lav-Tej)
మెగా ఫ్యామిలీలో కూతుర్ల కాపురాలెలా ఉన్నా..కోడళ్లు మాత్రం ఫ్యామిలీ ప్రతిష్టకు నిలబెట్టేవారే దొరుకుతున్నారు. అందాల రాక్షసి,సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతోందన్నది అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై కొట్టి కోడలి బాధ్యతలు పూర్తి స్థాయిలో స్వీకరించేందుకు సిద్ధపడుతోంది. నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా సినిమాలకు దూరం కాకుండా నిర్మాత అవతారం ఎత్తాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మెగా ఫ్యామిలీతో ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్లికి ముందే కండిషన్ పెట్టిన లావణ్య (Lav-Tej)
లావణ్య వరుణ్ ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ కు ఓకే చెప్పాకే పెళ్లికి ఒప్పుకుందని ఒక వార్త వైరల్ గా మారింది. లావణ్య కి భరత నాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లయిన తర్వాత కూడా తనకు ఏదైనా వేదిక పై భరతనాట్యం చేసే అవకాశం వస్తే దానికి అడ్డు చెప్పొద్దని, నాట్యం చేసే ఛాన్స్ తాను వదులుకోలేనని చెప్పిందట. అందుకు నాగబాబు కుటుంబం కూడా అంగీకరించిందని తెలుస్తోంది.
పెళ్లి తరువాత తన సినిమా ఆఫర్లను తిరస్కరించాలని ఈ భామ నిర్ణయించుకుంది. జూన్ లో నిశ్చితార్థం జరగటంతో ఇప్పటికే కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది. నిశ్చితార్థం తరువాత ఒక్క సినిమా ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదు.
బోల్డ్ క్యారెక్టర్స్ కు దూరం
ఒక వెబ్ సిరిస్ లో లావణ్య బోల్డ్ క్యారెక్టర్ లో నటించాలని నిర్మాతలు కోరినప్పుడు నో చెప్పింది. నిర్మాతలకు తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేసింది. తాను ప్రవేశించే కొత్త కుటుంబం పరువుకు ఎలాంటి భంగం రాకుండా ముందే జాగ్రత్త పడుతోంది లావణ్య. అందుకే చివరకు వెబ్ సిరిస్ నుంచి కూడా తప్పుకుంది. పెళ్లి తర్వాత తన రోల్ హీరోయిన్ నుంచి మెగా కోడలుగా మారుతోందని అప్పటినుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుందని భావిస్తోంది లావణ్య..
వరుణ్ తేజ్ తో పెళ్లికి అంతా రెడీ (Lav-Tej)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Lav-Tej)
6 ఏళ్లు పాటు ఒకరితో ఒకరు రిలేషన్ షిప్ లో ఉన్న వీరు జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పెళ్లి సందడి ఏదైనా ఉందీ ఉంటే అది వరుణ్ తేజ్, లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్. వెడ్డింగ్ డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు. నవంబర్ లో ఇటలీలో గ్రాండ్ గా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి తో లావణ్య కొణిదెల కుటుంబంలో కొడలుగా అడుగు పెడుతుంది.
పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ఒక్కొదాని కోసం ఏకంగా 80 వేల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. (gold coated) బంగారు పూత కలిగిన వెడ్డింగ్ కార్డును ప్రముఖులకు ఇవ్వాలని నిర్ణయించారు.లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ జోడి సినిమాల్లో నటిస్తునే ప్రేమలో పడ్డారు. రీల్ లో నటించిన ఈ జోడి రీయల్ గా లైఫ్ లో పెళ్లి పీటలెక్కుతున్నారు.