SL VS PAK
ఆసియా కప్ లో భారత్ తో తలపడే జట్టు ఏది? పాకిస్థానా? లేక లంక నా? అందరికీ ఇదే ఆతృత. ఇప్పటికే ఆ రెండు దేశాలను చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్స్ కు చేరిన టీమిండియా ఇప్పుడు తన ప్రత్యర్ధి ఎవరా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మరోవైపు కొలంబో ప్రేమ దాస స్టేడియంలో శ్రీలంక-పాకిస్థాన్ మధ్య మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. నేటి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరి భారత్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.ఆ జట్టు సెప్టెంబర్ 17న భారత్‌తో ఆసియా కప్ ఫైనల్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ని ఎలా అయినా విజయం సాధించాలని ఇరు జట్లు కూడా పట్టుదలతో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్‌లో విజేత ఎవరు, భారత్‌తో తలపడేది ఎవరనేది తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
రికార్డులు పాకిస్థాన్ కే అనుకూలం!
అయితే ఇరు జట్ల మధ్య వన్డే రికార్డులు మాత్రం పాకిస్తాన్‌కే అనుకూలంగా ఉన్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఎలా అయినా విజయం సాధించి ఫైనల్‌కి చేరాలనే యోచనలో ఇరు జట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి క్రికెట్ అభిమానూలు ఎంతగానో ఎదురు చుస్తున్నారు.
జట్టులో ఐదు మార్పులు SL VS PAK
శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో SL VS PAK పాకిస్థాన్ జట్టు 5 మార్పులతో బరిలోకి దిగనుంది. ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అగా, నసీమ్ షా, హరీస్ రవూఫ్, ఫహీమ్ అఫ్రాష్ ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమయ్యారు. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం ఓపెనర్ మహ్మద్ హారిస్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ వసీమ్, జూనియర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్, ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్, స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌లు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇరు జట్ల మధ్య వన్డే రికార్డులు కూడా పాకిస్తాన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వన్డే క్రికెట్లో శ్రీలంకపై పాకిస్థాన్‌దే పైచేయి. పాకిస్థాన్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు మొత్తం 155 మ్యాచ్‌లు జరగగా 92 మ్యాచ్‌ల్లో పాక్ విజేతగా నిలిచింది. శ్రీలంక జట్టు 58 మ్యాచ్‌లను మాత్రమే గెలుచుకోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. అలాగే 4 మ్యాచ్‌లు ఫలితంగా లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని అంతా భావిస్తున్నారు.
వర్షం పడితే లంకకు లాభం ! SL VS PAK
కానీ కొలంబో వాతావరణం సాధారణంగా ఆదేశపు టీమ్ కే అనుకూలంగా ఉంటుంది.. ఎలా అంటే నేటి మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ మ్యాచ్ సమయంలో వర్షం పడి ఆట రద్దయితే.. నెట్ రన్ రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కి చేరుతుంది. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -1.892లుగా నిలిచింది. కాగా, శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200లు మారింది.
ఆసియా కప్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడినది శ్రీలంక టీమే.. మొన్నటి భారత్ మ్యాచ్ లో స్కోరింగ్ లో ఓడినా శనక సేన టీమిండియాను ఓడించినంత పనిచేసింది. ప్రధాన బౌలర్లు లేకున్నా ఉన్న బౌలర్లతోనే అద్భుతాలు చేస్తోంది.భారత బ్యాటర్లను ఔట్ చేయడానికి పాక్ బౌలర్లు తంటాలు పడగా శ్రీలంక మాత్రం స్పిన్ ఉచ్చులో టీమిండియాను బంధించింది. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. స్పిన్‌కు అనుకూలించే కొలంబో పిచ్‌పై ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంకలతో పాటు మహీశ్ తీక్షణ మంచి బౌలింగ్ చేసి మ్యాచ్ రుపాన్ని మార్చేస్తున్నాడు.మొన్న భారత్‌తో మ్యాచ్‌లో మాదిరిగానే నేడు కూడా కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాక్‌కు షాకివ్వడానికి లంక స్పిన్నర్లు రెడీ గా ఉన్నారు.బ్యాటింగ్‌లో పతుమ్ నిస్సంక లంకకు కీలక బ్యాటర్. నిస్సంకతో పాటు మెండిస్, సమర విక్రమలు పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను ఏ మేరకు అడ్డుకుంటారనేది చూడాలి. ఏడో నెంబర్ బ్యాటర్ వెల్లలాగె వరకూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం లంకకు కలిసొచ్చే అంశాలు.