Niharika
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్టీ లో అడుగు పెట్టారు. కానీ హీరోయిన్స్ గా మాత్రం నిహారిక ఒక మనసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆసినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. మెగా హీరోయిన్ ట్యాగ్ లైన్ కూడా పెద్దగా గుర్తింపు తేలేదు. నటించింది మూడు సినిమాలే అయిన కానీ సినిమాలు మాత్రం హిట్ ను సొంతం చేసుకోలేక సో సో గా నిలిచాయి. ముద్దపప్పు ఆవకాయ్ లాంటి వెబ్ సీరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న నీహారిక హీరోయిన్ గా మాత్రం అసలు ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. వెబ్ సీరీస్, టీవీసీరియల్స్ లో మాత్రం కాస్త గుర్తింపు తెచ్చుకుంది. మెగా ఫ్యామిలీలో ఆడవారెవరూ ఇండస్ట్రీలో లేకపోవడం అన్నపాయింట్ కూడా నీహారికకు పెద్దగా కలసి రాలేదు. నాగబాబు డాటర్ గా ఉన్న గుర్తింపు కూడా ఆమెను హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. అయినా ఎప్పటికైనా హీరోయిన్ కావాలన్న తపన మాత్రం నీహారికలో ఉంది..
పెళ్లికి గుడ్ బై Niharika
ఏడాదిన్నర క్రితం జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి కావడంతో ఆమె సినీ కెరీర్ ముగిసిందనే అనుకున్నారంతా.. అయితే పెళ్లయినా తన స్నేహితులు, సర్కిల్ ను వదిలిపెట్టని నీహారిక తన యాక్టింగ్ కు కూడా గుడ్ బై చెప్పలేదు సరికదా మరింత ఉత్సాహంతో ఆ యాక్టివిటీస్ అన్నీ కొనసాగించింది. పెళ్లి తన వ్యక్తిగత జీవితంలో మార్పులు తేకూడదని బలంగా నమ్మిన వ్యక్తి నీహారిక.. తన స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ఇబ్బంది తలెత్తుతుందన్న ఉద్దేశంతోనే పెళ్లి బంధానికి కూడా గుడ్ బై కొట్టేసింది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ప్రయత్నాలు చేయాలని తపన పడుతోంది.
అడ్డుపడుతున్న ఇద్దరు?
అయితే నీహారికNiharika తీరు పట్ల ఫ్యామిలీలోనే వ్యతిరేకత ఉంది. ఇప్పటికే పెళ్లి పెటాకులైంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీనా ?ఫ్యామిలీ పరువు తీసింది చాలు ఇక అలాంటి ట్రయల్స్ వద్దంటూ మెగా ఫ్యామిలీలో ఇద్దరు గట్టిగా అడ్డుకుంటున్నారుట. ఆ ఇద్దరూ ఎవరన్నది పైకి తేలకపోయినా నీహారిక సినిమాలకు ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు కూడా రాకుండా అడ్డుపడుతున్నారుట.
షార్ట్ ఫిలింస్ తో బిజీ Niharika
ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారడమే కాక, షార్ట్ ఫిలింస్ హీరోయిన్ గా పనిచేస్తుంది. రిసెంట్ గా డెడ్ పిక్స్ ల్స్ వెబ్ సిరీస్ లో నటించింది. అంతేకాకుండా ఆమె స్వయంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో యూట్యూబ్ ప్రొడక్షన్ షురూ చేసింది.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థకింద యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు, విభిన్న ఎపీసోడ్ లను తన ప్రొడక్షన్ లో రిలీజ్ చేస్తుంది.
రీసెంట్ గా డెడ్ పిక్సె ల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అది గేమింగ్ జోన్ కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. డెడ్ పిక్స్ ల్స్ అనేది బ్రిటీష్ షో యొక్క రీమేక్ చిత్రం. ఈ చిత్రం ఆదిత్య మండలచే రూపొందించబడింది. పూర్తి వెబ్ సీరీస్ అయిన ఈ గేమింగ్ జోన్ నలుగిరి జీవితాలను ఎలా మారుస్తుంది అనే కథాంశంతో కొనసాగుతుంది. నేటి యువత గేమింగ్ తో టైమ్ ఎలా స్పెండ్ చేస్తున్నారు ఎలా ప్రవరిస్తున్నారో చూపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే గేమ్ పై ఆధాపడి ఉంటుంది. మొత్తానికి నీహారిక హీరోయిన్ కోరికకి అలా మరోసారి దెబ్బ పడిందన్న మాట..