అక్కినేని నాగార్జున(NAG) హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 36 ఏళ్లెంది. ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఎంతో మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. మన్మథుడు, గ్రీకువీరుడు ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోగా, నిర్మాతగా, సింగర్ గా, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ షో హోస్ట్ గా, అటు వెండితెర పై ఇటు బుల్లితెర పై బిజీగా గడుపుతున్నాడు ఈ మన్మథుడు. బిగ్ బాస్ షోను వరుసగా నాలుగు సీజన్ల నుంచి హోస్ట్ గా సందడి చేస్తూ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పటికే 99 సినిమాలను పూర్తి చేసుకుంటున్న నాగ్ తన 100వ సినిమాకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. 99వ సినిమా అయినా నాసామిరంగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన్ పోస్టర్ లో నాగ్ మాస్ లుక్ యాక్షన్ తో రానున్నట్లు సమాచారం. నాగ్ మాత్రం కొత్త క్యారెక్టర్ లో న్యూ లుక్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. నాసామిరంగా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సంక్రాంతి పండగకు మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు… సాధారణంగా సంక్రాంతి పండగను నాగ్ ఎప్పుడూ మిస్ చేసుకోరు.
సంక్రాంతి సెంటిమెంట్
తన సినిమాలన్నీ దాదాపు సంక్రాంతికే విడుదల చేస్తారు. కానీ తన సెంచరీ మూవీని మాత్రం వీలైనంత స్పెషల్ గా మార్చాలని నాగ్ చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై నే వంద శాతం దృష్టి పెట్టాడు.
పక్కా కథ కోసం వేట (NAG)
హీరోగా ఇటు అతిథి పాత్రలు, చిన్న కారెక్టర్లు అన్నీ కలిపితే నాగ్(NAG) వంద సినిమాలు ఎప్పుడో పూర్తయిపోయినట్లే లెక్క. కానీ హీరోగా 100వ సినిమా కాబట్టి ఈ మూవీని భారీ అంచనాలతో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు ఈ మన్మథుడు. సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ కూడా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమాకు బ్యాగ్రౌండ్ వర్క్ జరుగుతోంది. నాగ్ 100వ సినిమా లో సర్ ప్త్రెజ్ ఉండబోతుందని టాక్. 100వ సినిమాలో సర్ ప్త్రెజ్ ఎంటా అనిఅటు ప్రేక్షకులు ,నాగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తనయులిద్దరితోనూ నటిస్తారా?
సర్ ప్రైజ్ ఏంటంటే తన సెంచరీ మూవీలో తనయులతో కలిసి నటించాలని చూస్తున్నారు. ఇప్పటికే మనం సినిమాలో ఫ్యామిలీ మొత్తం కలిసి నటించారు. ఏయన్నార్ కు కూడా అది చివరి సినిమాగా నిలిచింది. తన 100వ సినిమా మనం సినిమాలాగా క్లాసిక్ గా ఉండాలని నాగ్ ప్లాన్. అందుకోసం నాగార్జున 100వ సినిమాను కూడా తన తనయులిద్దరితోనూ కలిపి చేయాలని అనుకుంటున్నాడు. తన 100వ సినిమాను ఏ డైరక్టర్ కి అప్పగిస్తాడు.. ఎంత స్పెషల్ గా క్రియేట్ చేస్తారు అన్న అప్డేట్స్ కోసం నాగ్ ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ మధ్య గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో నాగ్ 100వ సినిమా ఉంటుందనే టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతం ఈయన తని ఒరువన్ 2 సినిమాతో బిజీ అయ్యాడు. దాంతో ఆయన మూవీలో లేనట్లే అని తెలుస్తోంది. నాగ్ తన 99వ సినిమా అయిన నా సామిరంగా పూర్తయ్యే లోపు ఓ క్రేజీ డైరక్టర్ ని సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. నాగ్ 100వ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లోనే ఉండే అవకాశాలున్నాయి. సెంచరీ కొట్టడానికి టైమ్ పట్టినా కథ అద్భుతంగా ఉండి.. సినిమాలో తనయులు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగ్.