సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ సైమా అవార్డ్స్(SIMA) 2023 అవార్డుల హంగామ సిని ఇండస్ట్రీలో మొదలైంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకను దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోనిన్న, ఇవాళ (సెప్టెంబర్ 15, 16 తేదిలలో) అట్టహాసంగా జరుగుతోంది.. రెండురోజుల పాటు జరుగుతున్న ఈ ఈవెంట్ లో నిన్న కొందరికి అవార్డులు అందచేశారు. తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు సందడి చేశారు. టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, మంచు లక్ష్యీ, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, ప్రణీత, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ ట్రెండీ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై తళుక్కున మెరిశారు. తమ ప్రదర్శనలతో అందరిని అలరించారు.
సైమా 2023 అవార్డుల విన్నర్స్ వీళ్లే: (SIMA)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ ఆర్ ఆర్ మూవీ)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాక మూవీ)
ఉత్తమ దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి( ఆర్ ఆర్ ఆర్ మూవీ)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్)
ఉత్తమ సహాయ నటుడు: రానా(భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద మూవీ)
ఉత్తమ విలన్: సుహాస్(హిట్ 2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనీవీస్ రెడ్డి (కార్తికేయ 2 మూవీ)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్ మూవీ)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం మూవీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్ ఆర్ ఆర్ మూవీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె సెంథిల్ కుమార్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోసు నాటు నాటు పాట (ఆర్ ఆర్ ఆర్ మూవీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు మూవీ)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార మూవీ)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్,(కార్తికేయ 2 మూవీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్ మూవీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం మూవీ)
ప్లిప్ కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు): బెల్లంకొండ గణేష్
ఎమోషనల్ అయిన జూనియర్ !
అవార్డులను గెలుచుకున్న సినీ నటులు ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఉత్తమ నటుడిగా అవార్డును తీసుకున్న ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే తనపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటాం అన్నా అంటూ ఆడియన్స్, అభిమానులు స్పందించారు.
ఈమధ్యకాలంలో ఏ అవార్డు ఫంక్షన్ కి వెళ్లినా ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డును సొంతం చేసుకోకుండా రాదు. గత సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ సైమా నుంచి ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నో వేదికలపై మరిన్ని అవార్డులు గెలుచుకుంటూనే ఉంది. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సీతారామం మూవీ సైమా అవార్డుల్లో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది.ఉత్తమ నటుడు క్రిటిక్స్ కోటాలో అడవిశేష్ కు (మేజర్) ,మృణాల ఠాకూర్ (సీతారామం) లను అవార్డులు వరించాయి.నిఖిల్ నటించిన కార్తికేయ-2 మూవీ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇవాళ మరికొంత మందికి సైమా(SIMA) అవార్డులు ఇవ్వనుండటంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.