-2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-1 సినిమా విజయాన్ని అందుకోవడంతో పుష్ప-2 సినిమా ఎప్పుడు థియోటర్ సందడి చేయడానికి రెడీగా ఉందని బన్ని ఫ్యాన్స్ ఉత్కఠంగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ తో ఒక రేంజ్ లో హైప్ ని పెంచేస్తూ ఉన్నాడు సుకుమార్. గతంలో బన్ని కూడా ఈ సినిమా సేట్ ను చూపించి అందరికి కిక్ ఇప్పుడు మూవీ అప్డేట్ తో వచ్చాడు. పుష్ప-2 థియేటర్స్ లో సందడి చేసే డేట్ వచ్చేసిందని ట్వీట్ చేశారు మూవీ మేకర్స్. పుష్ప-2 చిత్రం విడుదల తేదీ ఖరారైందని వచ్చే ఏడాది ఆగస్ట్ 15తేది (2024) న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. పార్టీ లేదా పుష్ప అన్నా వారికి పుష్ప-2 రిలీజ్ డేట్ తో గట్టిగా పార్టీ ఇచ్చాడు మైత్రీ మేకర్స్. డేట్ గుర్తుపెట్టుకొండి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడానికి పుష్ప రాజ్ మళ్లీ వస్తున్నాడు.
అని ట్వీట్ చేశారు మైత్రీ మేకర్స్. ఏకంగా మూవీ అప్డేట్ చేప్పడం ఒక ఎత్తు అయితే సినిమా విడుదల అప్డేట్ ను ఒక పోస్టర్ లో రిలీజ్ చేసారు. పోస్టర్ లో మూవీ రిలీజ్ డేట్ తో అల్లు అర్జున్ పింకి నైల్ కాన్సెప్ట్ తో,బన్ని కనిపించకుండ అతని చేయి రక్తపు చుక్కలతో ఉంగరాలు,కంకణాలతో అలంకరించబడి ఉంది. పుష్ప రాజ్ చేయి రక్తపు చుక్కలతో ఉన్న లుక్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప-2 నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా లీక్ కావడం జరిగింది. బన్ని ఫ్యాన్స్ మాత్రం పుష్ప రాజ్ వస్తున్నాడు అని సంబర పడుతున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా రూపొందుతుంది. పుప్ప భార్య గా రష్మిక మందన్న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
పుష్ప-1 సినిమా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ అందుకుంది. అంతేకాకుండా ఊహించని విధంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్ పరంగా దూసుకుపోయింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించారు. ముఖ్యంగా పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడంతో పుష్ప-2 సినిమా పై అంచనాలు భారీగా పెరిగింది.
బన్ని
బన్ని గురించి పెద్దగా చెప్పే అవసరం లేదనుకుంటా. తన నటనతో, డాన్స్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాడు. స్టాల్ కి పెట్టిన పేరు అల్లు అర్జున్ అనే స్థాయికి వెళ్లాడు. తన యాక్షన్,స్టాల్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. పుప్ప సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ సంపాదించాడు. మూవీ లుక్స్ తో అప్డేట్ తో అందిరి మెప్పిస్తున్నాడు. ఇటీవల అతను పుష్ప సినిమాలో తన నటనకు జాతీయ అవార్డును గెలుచుకుంది.