(Mega-157)
తెలుగు చిత్ర పరిశ్రమలో దూకుడు పెంచారు మెగాస్టార్.. పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాక మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఆయన జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే తన 157వ సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని బింబిసార డైరక్టర్ మల్లాడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపిస్తూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆసక్తిని పెంచేశాడు వశిష్ట. మెగా 157 సినిమా టీజర్ ని బట్టి కథ మూడు లోకాల చుట్టూ తిరగబోతున్నట్టు తెలుస్తోంది. మానవుడైన హీరో పలు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆయా లోకాల్లో అతడకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని న్యూస్ లీకైంది. అందులో భాగంగా ఈ మూవీ లో అనేక గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వాటిని అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించడానికి ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మూడు లోకాల కథతో మెగా స్టార్ 157వ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఫాంటసీ మూవీతో హిట్టు కొడతాడా? (Mega-157)
చిరు ఫాంటసీ మూవీ అంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించే చెప్పుకుంటాం.. ఈ కథ,కథనం ఎంతలా క్లిక్ అయ్యాయంటే.. ఈరోజుకీ ఈ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్. చిరంజీవి, శ్రీదేవి పోటీ పడి నటించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ మరింత వన్నె తెచ్చింది. అలాగే ఇప్పుడు157వ సినిమా కూడా రికార్డులు బద్దలు కొడుతుందా? అసలే ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. మెయిన్ లీడ్ హీరోయిన్ అనుష్క శెట్టి చేస్తుండగా, మిగిలిన మూడు రోల్స్ లో కూడా పేరున్న హీరోయిన్లే ఉంటారనే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది. స్వీటీ వైపు నుంచి చూస్తే మెగాస్టార్ తో స్వీటి నటించే తొలి మూవీ ఇది..మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ -ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ఈ మూవీ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం అవుతుంది అంటున్నారు మేకర్స్. షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ చివరిలో విడుదల చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
కల్యాణ్ కృష్ణతో మరో మూవీ
ఈ మూవీ కాక ఇప్పటికే బంగార్రాజు మూవీ డైరక్టర్ గా కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టుకు చిరు సైన్ చేశాడు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకోవాలని చిరు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.