(SP-CBN)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై టాలీవుడ్ నోరెందుకు విప్పటంలేదన్న ప్రశ్నకు ఆ ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత, అతిపెద్ద బ్యానర్ అధిపతి క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. పరిశ్రమకు రాజకీయాలు అంటగట్టొద్దని, రాజకీయాల్లో ఏమవుతోందన్న దానిపై కామెంట్ చేసేందుకు తాము లేమని ఆయన స్పష్టం చేశారు. ఆయనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత.. దగ్గుబాటి సురేష్ బాబు. చంద్రబాబునాయుడు అరెస్టుపై స్పందించాలంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన చాలా కరాకండీగా సమాధానం చెప్పారు. తమ కుటుంబం గతంలో రాజకీయాల్లో ఉన్నా.. ఈ అంశంపై తాము స్పందించరాదని నిర్ణయించుకున్నామని, దానిపై తమ కుటుంబమే కాదు.. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రకటనా ఆశించవద్దంటూ తేల్చి చెప్పేశారు సురేష్ బాబు. అంతేకాదు చంద్రబాబు హయాంలో సినీ పరిశ్రమ వెలిగిపోయింది. అద్బుతాలు సృష్టించింది అని అనే వారికి కూడా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు సురేష్ బాబు…
ఎన్టీఆర్, చెన్నారెడ్డి తర్వాతే ఎవరైనా…
సినీ పరిశ్రమను అందరు ముఖ్యమంత్రులూ బానే చూశారని, అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఆదరించాయని స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి మేలు చేసిన వ్యక్తి అంటూ ఒకరిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదని,గతంలో చెన్నారెడ్డి, ఎన్టీఆర్ ఇండస్ట్రీకి చేసిన సేవను మరిచిపోలేమని అన్నారు. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలి రావడానికి వారిద్దరూ చేసిన కృషిని ఎవ్వరూ మర్చిపోలేమన్నారు. వారి నిర్ణయాల వల్లే ఇక్కడ ఇండస్ట్రీ నిలదొక్కుకుందన్నారు. అదే పార్టీకి ఇన్నాళ్లు సేవ చేసిన ఆ కుటుంబం ఇప్పుడు ఈ పరిణామాలపట్ల ఎందుకింత మౌనం దాల్చుతోందన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రోజూ అన్నింటి మీదా స్పందించలేం… (SP-CBN)
దగ్గుబాటి సురేష్ బాబు ఇంత ఓపెన్ గా కేటగారికల్ గా మౌఖికంగా స్పష్టం చేయడం తో ఇండస్ట్రీ నుంచి ప్రకటన ఇంకా వస్తుందనుకున్న వారికి గట్టి సమాధానం ఇచ్చినట్లయ్యింది. ఇండస్ట్రీ రాజకీయాలకు అతీతమైనదని, ఆ కోణంలోనే తమ ఇండస్ట్రీని చూడాలని సురేష్ బాబు అన్నారు.రోజూ ఏదో ఒక ఘటన జరుగుతుంది అన్నింటిపైనా స్పందించమంటే ఎలా? సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతాలకు అతీతం. ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించవద్దు. తెలంగాణ- ఆంధ్ర ఇష్యూ అప్పుడు కూడా పరిశ్రమ నుంచి ఎలాంటి పొలిటికల్ స్టేట్ మెంట్స్ రాలేదు. మేం మూవీ మేకర్స్.. సినిమాలు మాత్రమే తీస్తాం.. ప్రతీ అంశంపై స్పందించాలని ఆశించకూడదు అన్నారు సురేష్ బాబు.
గతంలో టీడీపీకి సేవ చేశాం… (SP-CBN)
తమ కుటుంబం గతంలో టీడీపీలో చేరిందని, పార్టీ కోసం తాను పనిచేశానని, తన తండ్రి రామానాయుడు ఎంపీగా కూడా కొనసాగిన విషయాన్ని సురేష్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఇలాంటి వాటిపై వ్యక్తిగత ప్రకటనలు తప్ప ఇండస్ట్రీ తరపున తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు సురేష్ బాబు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ అతిపెద్ద బ్యానర్. అలాంటి సంస్థ అధినేత హోదాలో సురేష్ బాబు ఇలా ప్రకటన చేయడం ఆశ్చర్యకరం. చంద్రబాబు అరెస్టుపై ఎవరూ మాట్లాడకపోవడం, ఖండించకపోవడాన్ని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. సురేష్ బాబు కరెక్ట్ గానే స్పందించారు. చాలా బాగా మాట్లాడారు అంటున్నారు సినీ విశ్లేషకులు… సో… బాబు అరెస్టుపై ఇండస్ట్రీ నుంచి ఏవో ప్రకటనలు వచ్చేస్తాయనుకున్న వారికి నిరాశపరిచే క్లారిటీ దగ్గుబాటివారి ప్రకటన… (SP-CBN)
ఇప్పటికే పవన్ ను సమర్ధిస్తున్న వర్గం చంద్రబాబు అరెస్టును తప్పుబడుతోంది. ఆ వర్గమే జనసేనాని పవన్ కల్యాణ్ వెంట ఉంది. కాబట్టి జనసేనకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు రాదనే అనుకోవాలేమో!