(Chay)
అక్కినేని వారి ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని వారసుడు అయిన నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య రెండో పెళ్లికి నాగార్జున గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడనే అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంతతో విడాకులు తీసుకున్న చైతన్య మళ్లీ పెళ్లి వార్తలు రావటానికి అసలు కారణం నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు ప్రచారం జరగడమే.
లండన్ ట్రిప్ తో వెలుగు లోకి… (Chay)
అంతేకాదు ఈ ఇద్దరూ లండన్ లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు అక్కడి ఇండియన్ చెఫ్ తో ఫోటోలు దిగడం వైరల్ గా మారింది. వారు ఇద్దరు లండన్ లో చేట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని రూమర్లు వినిపించాయి. వీరిద్దరూ గత ఆరు నెలలుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ రెండు మూడు సార్లు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. శోభితా దూళిపాళ్ల నీ చైతు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు పుకార్లు వెలుగు చూశాయి..అయితే ఆ రూమర్స్ పై వారు ఇద్దరు స్పందించారు. ” సగం జ్ఞానంతో రాసే వారి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అందులో నిజం లేనప్పుడు నేను ఎందుకు స్పందించాలి. వైరల్ అవుతున్న న్యూస్ లో ఎలాంటి నిజం లేనప్పుడు నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు “అంటూ చెప్పుకొచ్చింది శోభితా. మరోవైపు చైతన్య టీమ్ కూడా ఈ పుకార్లను ఖండించింది.
వ్యాపారవేత్త కుమార్తె సంబంధం చూసిన నాగ్
అయితే తాజాగా చైతన్యకు మళ్లీ పెళ్లి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి శామ్ తో విడాకుల తర్వాత చైతూకు ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యాపార వేత్త కుమార్తెనిచ్చి చేయాలని నాగార్జున ఉబలాటపడ్డాడుట. ఈసంబంధంపై మాటలు కూడా జరిగినట్లు సమాచారం. అయితే శోభితా ధూళిపాళ్లతో తన రిలేషన్ గురించి తండ్రికి చెప్పిన చైతన్య నాగర్జునను ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడట. దాంతో ఈ ప్రేమ జంట చివరికి ఓ శుభ ముహూర్తాన మూడు ముళ్లు వేసుకుంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రేమ జంట అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య గీతా ఆర్ట్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య రెండో పెళ్లి వార్త అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నాయి.
శోభితా అయినా నెరవేరుస్తుందా?
శోభితా ధూళిపాళ్ల మరీ అంత ఫేమస్ కాకపోయినా..గూఢచారి సినిమాలో అడవి శేషు సరసన నటించింది. ఆ తర్వాత మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ ఆమెకు అవకాశం దక్కింది. తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఆమె కెరీర్ బాగుంది. ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మరి పెళ్లి మాట నిజమైతే పెళ్లి తర్వాత శోభిత కెరీర్ కంటిన్యూ చేస్తుందా లేక మూవీలకు గుడ్ బై కొట్టి అమల పంథాలో సామాజిక సేవ వైపు మొగ్గు చూపి అక్కినేని ఇంటి ప్రతిష్టను కాపాడుతుందా చూడాలి.