TC
కొలెస్ట్రాల్… నేటితరం యువతని వేధిస్తున్న సమస్య ఇది.. వైట్ కాలర్ జాబ్స్, శరీర కదలికలేని ఉద్యోగాలతో ఇవాల్టి తరం ఊబకాయం సమస్యను ఎదుర్కొంటోంది.అది ఆటో మేటిగ్గా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతోంది. కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ తర్వాత కొలెస్ట్రాల్ కేసులు ఎక్కువవుతున్నాయి. తెలుగులో, తేలిక భాషలో చెప్పాలంటే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. మితి మీరిన తిండి, సమయపాలన లేని రొటీన్, వ్యాయామం లేకపోవడం కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు.
అసలేమిటీ కొలెస్ట్రాల్ ? TC
కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్ధం. మన శరీరం హార్మోన్లు, విటమిన్ D,ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాలను తయారు చేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. మన శరీరంలోని లివర్, ఇందుకు అవసరమైన కొలెస్టాృల్ ను తయారు చేస్తుంది. గుడ్లు, సొన, మాంసం, జున్ను. వంటి వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి కూడా శరీరానికి కొలెస్టాృల్ అందుతుంది. కొలెస్టాృల్ లో రెండు రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి హై డెన్సిటీ లిపోప్రొటీన్ హెచ్ డి ఎల్ (HDL), మరొకటి లో డెన్సిటీ లిపోప్రొటీన్ ఎల్ డి ఎల్…(LDL)
గుడ్ కొలెస్ట్రాల్ అంటే? TC
హెచ్ డి ఎల్ (HDL) ను మంచి కొలెస్టాృల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది లివర్ నుంచి కొలెస్టాృల్ ను రవాణా చేస్తుంది. శరీరంలోని ఇతర భాగాల నుంచి కాలేయానికి తిరిగి కొలెస్టాృల్ ను తీసుకువెళుతుంది. ఇది 40ఎంజీ కన్న తక్కువ ఉంటే ఎక్కువ గుండే పొటు వచ్చే అవకాశం ఉంది. లివర్ లో తయారైన ఈ కొలెస్టాృల్ శరీర అవసరాలకు పనిచేస్తుంది. ఇలా హెచ్ డి ఎల్ శరీరంలోని అదనపు కొలెస్టాృల్ ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. హై కొలెస్టాృల్ ఎలాంటి లక్షణాలను పైకి చూపించదు. అయితే, దీని ద్వారా ఇతర వ్యాధులు వస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని రక్తం ప్రవహించడాన్ని కష్టంగా మారుస్తాయి. దీనిని అధెరోస్కెరోసిస్ అని అంటారు. అంతే కాకుండా, కొన్నిసార్లు కొవ్వు గడ్డలుగా పేరుకుపోతుంది. ఈ కారణంగానే గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొవ్వు నిల్వలు పెరగడం వల్ల లోయర్ బాడీ, కాళ్ళకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీని కారణంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనే సమస్య వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది. డాక్టర్ చెప్పిన ప్రకారం పాదాలు చల్లగా, తిమ్మిరిగా అనిపిస్తే హైకొలెస్ట్రాల్ ఉన్నట్లే. ఇది రెండు కాళ్ళకి ఉండాల్పిన అవసరం లేదు. ఒక్క కాలులో కూడా ఈ సమస్య ఉంటుంది. ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలిసి చెక్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అధిక కొలెస్ట్రాల్ కి కారణాలెన్నో… TC
సరైన లైఫ్ స్ట్తెల్ లేకపొవడం. సరైన ఫుడ్ తీసుకోకపొవడం, ఇలాంటివన్ని కూడా కొలెస్టృల్ పెరగడానికి కారణమవుతాయి. జంక్ ఫుడ్ బదులు ఆకుపచ్చ కూరగాయలు, హెల్దీ, హైడ్రేటింగ్ ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.
లో కొలెస్ట్రాల్ (LDL)
ఎల్ డి ఎల్ (LDL) ని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.. గుండెపోటు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మన జీవనశైలి, చెడు ఆహర అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతోంది. శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ అవసరం. ఏ కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన వాటిలో ఉండాలి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చెడు కొలెస్టాృల్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అంటే భుజాలు, కాళ్లలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం మొదలవుతుంది. దీని వ్లల కాళ్లు,చేతులలో తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి నిద్రపోయ సమయంలోనూ బాధపెడుతుంది. దీనికి తోడు చర్మంపై నీలం, పసుపు రంగు మచ్చలుగా వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేయడానికి లైఫ్స్టైల్లో మార్పులు చేసుకుని, పోషక ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
దినచర్య ఎలా ఉండాలంటే…
రోజూ ఉదయం అల్పాహారంగా సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. బెండకాయ, వంకాయ లాంటి కూరగాయలు తీసుకోవాలి. బాదం, ఆక్రోట్ లాంటి నట్స్, ఆపిల్, ద్రాక్ష, నారింజ లాంటి పండ్లను ఏదో ఒక రూపంలో రోజు వారీ ఆహారంలో తీసుకుంటే చెడు కొలెస్టాృల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి.
కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, బరువు తగ్గడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయపడుతుంది. స్మోకింగ్, మద్య పానం అలవాటు వున్న వాళ్ళు వెంటనే మానేయాలి. వీటికి చెడు కొలెస్టాృల్ కు సంబంధం ఉంది. స్మోకింగ్ , మద్యపానం గుండెకు మాత్రమే కాదు, మెదడుకు, ఊపిరితిత్తులకు కూడా ప్రమాదం. కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ తయారయ్యేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.