(sam)
సమంత రుతు ప్రభు… ఈ పేరు తెలియని వాళ్లంటూ ఉండరు.. అంత ఫేమస్. ఏం మాయ చేసావే ! సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. తన గ్లమర్ తో ప్రేక్షకుల అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం ప్రతీ చిన్న ఫోటోను అప్ లోడ్ చేయడం, ఇన్ స్టాలో లైవ్ ఇవ్వటం లాంటి పనులతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది సామ్. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాను తన ఫోటోలతో షేక్ చేస్తుంది ఈ సుందరి. తాజాగా నాగచైతన్యతో రొమాన్స్ లోఉన్న ఓ పాత ఫోటోను తాజాగా రీ అప్ లోడ్ చేసింది. 2021లో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి చై జ్నాపకాలన్నింటినీ తన ఇన్ స్టా గ్రామ్ నుంచి రిమూవ్ చేసేసింది. అక్కినేని ఇంటిపేరును కూడా తొలగించింది. చైతో తనకున్న గొడవల గురించి ఆంగ్ల ఛానెళ్లకు కాస్త ఘాటుగానే బదులిచ్చింది. చై మీద సామ్ కి ఇంత కోపముందా అని చూసినవారంతా విస్తుబోయారు. అలాంటి సామ్ ఇప్పుడు చై ఫోటోలను ఇన్ స్టా లో రీ అప్ లోడ్ ఎందుకు చేసిందన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.
గతం గుర్తు చేసుకుంటోందా? (sam)
నాలుగేళ్ల తరువాత చైతుతో గడిపిన క్షణాలను సామ్ మళ్లీ గుర్తుచేసుకుంటోందా అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. చై మీద సామ్ కు ఉన్న ప్రేమ ఇంకా పోలేదా? నాగచైతన్యని మళ్లీ తన భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? చైతన్య శోభనా ధూళిపాళ్ల అనే నటితో డేటింగ్ లో ఉన్నాడన్న వార్తలు, వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో సామ్ రియాక్షన్ ఇలా ఉందేంటా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కాఫీ విత్ కరణ్ లో షాకింగ్ స్టేట్ మెంట్లు
గతంలో సమంత నాగచైతన్య గురించి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పింది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆమె పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. చైతూ తో విడిపోవడం అంత సులభంగా జరగలేదు… ఒక వేళ మా ఇద్దరిని ఓ గదిలో ఉంచితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలని చెప్పుకొచ్చింది. నీ భర్త తో విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు అని కరణ్ అడగ్గా భర్త కాదు మాజీ భర్త అని ఆమె ఘూటుగా సమాధానాలు ఇచ్చింది. ఆ సమాధానాలు విన్న వారు సామ్ ఇప్పుడు ఎందుకు ఫొటోలను రీ అప్ లోడ్ చేసిందని విస్తు బోతున్నారు. (sam)
మయోసైటిస్ తో సతమతం (sam)
చై తో విడిపోయాక సామ్ సినిమాలో బిజీ అయిపోయింది. అయితే ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడం, ఈలోగా మయో సైటిస్ వ్యాధి సోకడంతో ఆమె పూర్తిగా డీలా పడి పోయింది. ఇప్పటికీ ట్రీట్ మెంట్ లోనే ఉన్నా ఆమెకు మునుపటి ఆరోగ్యం చేకూరడం లేదు. దీంతో ఫిజికల్ గా, మెంటల్ గా బాగా డల్ అయిపోయిన సామ్ అమెరికా వెళ్లి మరీ ట్రీట్ మెంట్ తీసుకుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పాత జ్నాపకాలతో కాలం గడుపుతోందా? అదీ చై రెండో పెళ్లి ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో?