పుష్ప -పాన్ ఇండియా మూవీతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సౌతిండియా కన్నడ బ్యూటీ రష్మిక(Rashmika).. ఇప్పుడు పుష్ప-2 మూవీతో మరింత క్రేజ్ సంపాదించేలా ఉంది. ఈ ఒక్క సినిమా రష్మిక కెరీర్ నే మలుపు తిప్పింది. తాజాగా పుష్ప-2, D-51, యానిమల్, వియన్ ఆర్ ట్రియో అనే నాలుగు సినిమాలతో నటిస్తుంది. ఇంత బిజీగా ఉండి కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశింది రష్మిక.
అది కూడా సాదా సీదా సినిమా కాదు రవితేజ, మలినేని గోపీచంద్ ల కొత్త సినిమాకి. వీరిద్దరు కాంబోలో డాన్ శీను, బలుపు,క్రాక్ సినిమాలతో ఇప్పటికి హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. మరి వీరిద్దరి నాలుగో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. రష్మిక నటించే నాలుగు భారీ బడ్జెట్ మూవీస్ వివరాలేమంటే…
పుష్ప-2: (Rashmika)
రష్మిక పుష్ప-2 లో కూడా హీరోయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆ చిత్రం 2024 ఆగస్టు15న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో విడుదల కానుంది. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప-2 మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు దీనికి నిర్మాతలు.
D-51:
ధనుష్ రష్మిక జంటగా నటిస్తున్న సినిమా D-51. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.
యానిమల్:
రష్మిక(Rashmika) నటిస్తున్న బాలీవుడ్ సినిమా యానిమల్ లో హీరో రణవీర్ కపూర్. సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ల సంయుక్త వెంచర్ లో యానిమల్ మూవీ పూర్తవుతోంది. సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
VNR ట్రియో:
VNR సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ కుడుముల డైరక్టర్ గా నితిన్ హీరోగా, రష్మికా హీరోయిన్ గా తెరకెక్కనున్న సినిమా ఇది.. గతంలో భీష్మ సినిమా ఈ ముగ్గురు కాంబినేషన్ లోనే వచ్చింది.గతంలో ఛలో,భీష్మ సినిమాలలో నటించింది రష్మిక. ఈ ట్రియో మూవీకి జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
సోషల్ మీడియా హార్ట్ బీట్
సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక పై సోషల్ మీడియాలో టాలీవుడ్ లో వచ్చే ట్రోల్స్ బహుశా ఇండస్ట్రీలోనే ఎవరిపైనా రావేమో.. తాజాగా విజయ్ దేవర కొండతో లవ్ లో ఉందంటూ పుకార్లు గుప్పు మంటున్నాయి. ఎక్కడకెళ్లినా ఇద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండటం వల్ల వీరిద్దరి పేర్లు బాగా ముడిపడిపోయాయి. తాము మంచి స్నేహితులమనీ, అంతకు మించి తమ మధ్య ఏం లేదని అనేక సార్లు ఇద్దరూ చెప్పారు. అయినా ఫ్యాన్స్ మాత్రం వీరిని నిజ జీవితపు జంటలా ఊహించుకుని పండగ చేసుకుంటుంటారు. గతంలో విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించింది.అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని పుకార్లు బాగానే వచ్చాయి.
రద్దయిన పెళ్లి
రష్మికకి(Rashmika) గతంలో కిరిక్ పార్టీ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. అయితే 2018 లో వారిద్దరూ దానిని కాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రష్మిక పేరును జత చేస్తూ కూడా రూమర్లు వచ్చాయి. వీరు ఇదరూ కలిసి బాలీవుడ్ లో చత్రపతి సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. అయితే డేటింగ్ రూమర్లని బెల్లకొండ ఖండించాడు. సినిమా షూటింగ్ లో కలిసి ప్రయాణం చేస్తూ కనిపిస్తుంటాం అంతే కానీ మా ఇద్దరి మధ్య ఏమి లేదని తెలిపాడు. చిత్రంగా రష్మిక మాత్రం స్పందించలేదు..