ఆసియా కప్ (WC) గెలిచినా టీమ్ ఇండియా మాత్రం ఆ సంతోషాన్ని, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు.. కారణం.. వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ పోటీలు టెన్షన్ పెడుతున్నాయి. మినీ టోర్నీలో ప్రత్యర్ధులను చీల్చి చెండాడిన టీం ఇండియావాల్డ్ కప్ కూడా గెలిచాక ఏకంగా క్రాకర్స్ కాల్చుకుందామని అభిమానులను కోరింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఇదే మూడ్ లో ఉన్నాడు..
టీమ్ ఎంపికలో పొరపాట్లు?
వాల్డ్ కప్ కోసం టీమ్ ఎంపికలో సెలక్టర్లు చేసే పొరపాట్లు టీమ్ పట్ల శాపంగా మారుతున్నాయా? తెలుగు తేజం తిలక్ వర్మను వన్డేలకు ఎంపిక చేయకపోవడం పట్ల టీమ్ లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లో నిలకడగా రాణించడంతో పాటు అరంగేట్రం చేసిన సిరీస్‌లో సీనియర్లంతా విఫలమైన వేళ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ చేశాడు. లెఫ్టార్మ్ బ్యాటర్ కావడంతో యువరాజ్ సింగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా భావించారు.
చివరి నిమిషంలో మార్పుల ఫలితం
2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ చివరి నిమిషంలో చేసిన మార్పులు టీమ్ స్పిరిట్ ని దెబ్బ తీశాయి. అంబటి రాయుడిని తప్పించి ఆల్‌రౌండర్ అయిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారుట్వీట్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. తీరా ప్రపంచకప్‌లో విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. గాయపడి టోర్నీ మధ్యలోనే భారత్‌కు వచ్చేసాడు. అతని స్థానంలో దినే. తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే ఈ తప్పిదం చేసింది. త్రీ డైమన్షల్ ఆటగాడని ఎమ్మెస్కే కామెంట్ చేయడం త్రీడీ కళ్లద్దాలతో చూస్తానని రాయుడు శ్ కార్తీక్‌ను ఆడించగా అతను దారుణంగా విఫలమయ్యాడు.న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిన టీమిండియా ఇంటిదారి పట్టింది. రాయుడు ఉంటే కచ్చితంగా గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
రెండు వారాల్లో వాల్డ్ కప్ (WC)
వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కావడానికి ఎన్నో రోజులు లేదు. కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 29 నుంచి వార్మప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్ లు జరగుతాయి. మరి టీమ్ ఇండియా ఈ పోటీలకు ఎంత సన్నద్ధంగా ఉంది?
గెలిచే సత్తా ఆరెండు జట్లకే
ఈసారి వాల్డ్ కప్ విజేతలపై శ్రీలంక వికెట్ కీపర్ సంగక్కార జోస్యం చెబుతున్నాడు.భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒకటి ఈసారి ప్రపంచకప్ నెగ్గుతుందని సంగక్కార తెలిపాడు. ప్రపంచకప్ లో పాల్గొనే 10 జట్లలోనూ ఈ రెండే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నాడు. సెమీస్ రేసులో శ్రీలంక ఉందని సంగక్కార తెలిపాడు. ఆసియా కప్ 2023లో ఫైనల్ మ్యాచ్ ను మినహాయించి చూస్తే శ్రీలంక అద్భుతంగా ఆడిందని సంగక్కార తెలిపాడు.
రోహిత్ శర్మ పై పెదవి విరుస్తున్న యువరాజ్ (WC)
వాల్డ్ కప్ (WC) లో ప్రధాన ఫేవరెట్ జట్టుగా టీమ్ ఇండియా ఉన్నా, కెప్టెన్ రోహిత్ శర్మ కొంత కాలంగా సరైన ఫామ్ లో లేడు. ఈసారి ప్రపంచ కప్ లో అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అన్న సందేహాలు అందరికీ ఉన్నాయి. పైగా మన ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. రోహిత్ శర్మ ఆట తీరు కొంత ఆందోళన కలిగిస్తోందంటున్నాడు మాజీస్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. మంచి కెప్టెన్ కు మంచి టీమ్ ఉడాలి. ఎంఎస్ ధోనీ మంచి కెప్టెన్..అతగాడికి అప్పట్లో అనుభవజ్ఞులతో కూడి టీమ్ ఉండేది..జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు నేనున్నాంటూ ముందుకు వచ్చి సత్తాచాటే ఆటగాళ్లు అప్పటి టీమ్లోక ఉన్నారని అయితే ప్రస్తుతం టీమిండియాలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని యువరాజ్ అన్నాడు. ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ అతిథ్యమివ్వనుంది. హోం పిచ్ లపై దుమ్ము రేపి మన టీమ్ కప్ గెలుస్తుందా? లేక హోస్ట్ గానే మిగిలిపోతుందా? చూడాలి.. క్రికెట్ ప్రియుల్లో అప్పుడే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.