తన కుమార్తె మరణంతోనే తాను కూడా మానసికంగా చచ్చిపోయానంటున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోని. కుమార్తె మీరా(Meera) ఆత్మ హత్యతో ఆ ఇంట విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇంటిల్లి పాదీ సరిగా తిండి తినక, నిద్ర లేకుండా పుట్టెడు దు:ఖంతో గడుపుతున్నారు. కుమార్తె మరణ వార్త తో కుప్ప కూలిన విజయ్ ఇవాళ తెల్లవారు జామున ట్వీటర్ వేదికలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అది చూసిన అందరికీ కనీళ్లు ఆగటం లేదు. అందరూ మీరా అత్మకు శాంతి కలగలని కోరుకుంటున్నారు.విజయ్ ట్వీటర్ లో ఇలా రాశారు నా పెద్ద కుమార్తె ఎవరికి కనిపించని లోకంలోకి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం,మతం, డబ్బు,అసూయ,బాధ,పేదరికం,ద్వేషం లేని ప్రశాంతమైన లోకంలోకి వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే ఉంది, తన జ్ఙాపకాలు, తన అలవాట్లు అన్ని నాతోనే ఉన్నాయి. మీరా ఇప్పుడు నాతో మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను అని ఉద్వేగంతో విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు.
మీరా సూసైడ్ నోట్ (Meera)
మరోవైపు మీరా ఆత్యహత్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. మీరా ఆత్యహత్య కేసు దర్యాప్తులో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. అందులో వివరాలు బయట పెట్టనప్పటికీ లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్ అనే కోట్ ను మాత్రం వెల్లడించారు తప్ప మిగతా విషయాలేవీ పోలీసులు అధికారులు పెద్దగా వెల్లడించలేదు.
ఆంటోనీ కుటుంబంలో వరుస విషాదాలు
ఇటీవల విజయ్ ఆంటోనీకి కూడా పెద్ద ప్రమాదం జరిగింది. బిచ్చగాడు-2 షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన విజయ్ చావు అంచుల వరుకు వెళ్లి వచ్చాడు. అది జరిగి నెలలు గడవక ముందే పెద్ద కూతురు మీరా చనిపోవడం విషాదం.
గతంలో ఫాతిమా ట్వీట్
గతంలో ఫాతిమా తన కుమారై మీరా పాఠశాలలో సాధించిన విజయాల గురించి చేసిన పాత పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. ఫాతిమా తన కూతురు మీరా స్కూల్ యూనిఫాంతో ఉన్న చిత్రాన్ని మార్చిలో పంచుకుంది.ట్వీట్ లో రాస్తూ నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లు, ఓ దార్పు, నా ఒత్తిడినుంచి బయటపడేసేది మీరా మాత్రమే అని ఫాతిమా రాసుకొచ్చింది. ఆంటోనీ, ఫాతిమాకు మొత్తం ఇద్దరు పిల్లలు లారా,మీరా ఉన్నారు. మీరా పెద్ద అమ్మాయి. ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతుంది. విజయ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరిస్తోంది.
మీరా డ్రీమ్ (Meera)
డాక్టర్ అవ్వాలన్నది మీరా కల. అదే ఆకాంక్షతో చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. చదువులో టాపర్. ఆమె ఇటీవల పాఠశాలలో కల్చరల్ సెక్రెటరీగా ఎన్నికైంది. గత కొన్ని నెలలుగా ఆమె మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు అందుకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలతో తమిళ సిని ఇండస్ట్రీ తీవ్రమైన శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటీవల కోలీవుడ్ లో జైలర్ సినిమాలో నటించిన రమేశ్ మాస్టర్ గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు విజయ్ ఆంటోని కుమారై మీరా ఆత్మహత్య తమిళ సిని పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.