ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు అటువంటి ఆరోగ్యం మంచి ఆహారం తో వ్యయం తో వస్తుంది.కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే మన ఆహారాన్ని మనమే విషం చేసుకుంటున్నాము అంటే మనకు తెలియకుండానే ఫుడ్ పాయిజన్ అవుతోంది. ఈ ఫుడ్ పాయిజన్ (Food Poison) వాళ్ళ వికారం, వాంతులు,జ్వరం,కడుపులో నొప్పి, ఆకలి తగ్గుదల వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
సాధారణం గా ఈ ఫుడ్ పాయిజన్ (Food Poison) బయట కలుషితమైన ఆహారం తిన్న, కలుషితమైన నీరు తాగిన వస్తుంది. ఇలా జరిగితే పరవాలేదు కానీ మనం రోజు చేస్కునే ఆహారాన్ని సరిగా ఏమి కాదులే అనే నిర్లక్ష్యం తో చేసే పనులవల్ల మన చేజేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాము అంటున్నారు డాక్టర్లు. అలంటి రోజు వారి ఆహారాలు ఏంటో అసలు వాటిని ఎలా తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పాలు :
పాలు అంటే ఎంత మంచి ఆహారమో మన అందరికి తెలుసు.ఎన్నో పోషక విలువలు ఉన్న పాలను చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు రోజు వారి జీవన విధానం లో ఉపయోగిస్తునే ఉంటాము.పాలలో ప్రోటీన్లు,కాల్షియమ్ పుష్కలం గ ఉండటం వలన ఇది శరీర దృఢత్వాన్ని ఇస్తుంది అని మనం పిల్లలకు ఇస్తుంటాము అలాగే ఈ పాల లో విటమిన్ B12, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇంత అమృతం లాంటి పాలు ఇప్పుడు కల్తీ అయ్యి అవ్వు పాలు గేదె పాలు కాకుండా ప్యాకెట్ పాలు గా మారాయి.
ఈ పాలు ను సరిగా తీస్కోకపోతే ఈ పాలే మనకు విషం గా మారి ఫుడ్ పాయిజన్ అవుతుందని అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.అంటే పాలు ను పచ్చిగా తాగిన లేక సరిగా కాచని పాలు తాగిన అదే మన శరీరానికి విషం లా మారి ఫుడ్ పాయిజన్ (Food Poison) అయ్యి చేదు చేస్తుందట. కాబ్బటి పచ్చి పాలను కానీ సరిగా కాచని పాలు ఎప్పటి తీసుకోకూడదట.పాలను బాగా మరిగించిన తరువాతే తాగాలట.
2. మొలకెత్తిన విత్తనాలు :
దీనినే మొలకలు అని కూడా అంటారు. ఈ మొలకలు ఎంతో పోషకాలు కలిగి ఉన్న వీటిని సరైన రీతి లో మొలకెతించకపోతే అవి మన ఆరోగ్యానికి చేటు చేస్తాయంటున్నారు. ఈ మొలకల్లో ఉన్న పోషకాలు మాంసాహారం లో కూడా ఉందవట. E.coli మరియు Salmonella అనే బాక్టీరియా లు సరిగా మొలకెత్తని మొలకల్లో ఉంది ఫుడ్ పాయిజన్ (Food Poison) అయ్యేందుకు కారణం అవుతాయట.
3. కోడి గుడ్లు..
పాలు లో ఎంత పోషకాలు ఉంటాయో అంతే పోషకాలు కోడి గుడ్లలో కూడా ఉంటాయి. అయితే ఈ మధ్య gym చేసేవారు కానీ ప్రోటీన్ డైట్ చేసేవారు కానీ పచ్చి గుడ్ల ను తింటున్నారు. అయితే ఇదే ఆరోగ్యానికి ఎహ్త మాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. కోడి గుడ్లు ని బాగా ఉడికించిన తరువాత తినాలని సూచిస్తున్నారు.పాచి గుడ్లు తినడం వాలా అందులో ఉండే బాక్టీరియా వాలా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
4. అన్నం..
అన్నం తో ఫుడ్ పాయిజన్ అవుతుందా అని ఆశ్చర్యపోతున్నారా..?సరిగా ఉడికించని అన్నాన్ని తినడం వాలా ఫుడ్ పాయిజన్ అవుతుందట. అంతేకాకుండా ఉడికించిన అన్నని మల్లి ఉడికించడం కూడా ఫుడ్ పాయిజన్ (Food Poison) అయేందుకు కారణం అవుతుందని చెబుతున్నారు.
5. చేపలు..
Sea Food లో విటమిన్ డి ఉంటుంది కాబ్బటి చేపలు,పీతలు తీసుకోవడం చాల మంచిది కాకపోతే ఈ చేపలు పీఠాలు సరిగా ఉడికించకుండా లేదా పచ్చి గా తినడం వలన ఫుడ్ పాయిజన్ (Food Poison) అయ్యే అవకాశం ఉందట.ఇలా తినడం వాలా ఎన్నో ఇన్ఫెక్షన్స్ బారిన పడతారని అని చెబుతున్నారు డాక్టర్లు కాబ్బటి చేపలను,పీతలను బాగా ఉడికించిన తరువాతే తినాలట.
6. మాంసం..
ఇప్పటి రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు ఆకుకూరలు, కూరగాయలు కన్నా మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడేవారు సంఖ్యా ఎక్కువ అనే చెప్పవచ్చు. మాంసాహారం చక్కని ధృడమైన శరీర సౌష్టాన్నీ ఇస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఉడికి ఉడకని మాంసం తినడం కానీ, ఎక్కువ రోజులు నిలువ చేసిన మాసాన్ని తిన్న ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బయట రెస్టారెంట్ లో మాంసాహారాన్ని తిని ఎంతో మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారని మనం తరచుగా వింటూనే ఉంటాము. కాబ్బటి మాంసాహారాన్ని ఇంట్లో చిక్కగా ఉడికి ఆ ఆతరువాత తినాలని వైద్యులు సూచిస్తున్నారు.