రోడ్డు మీద నడిచి వెళుతున్నప్పుడు వజ్రాలు(Diamonds) కనిపిస్తే..కోట్లల్లో విలువచేసే రంగు రంగుల వజ్రాలు కాంతులీనుతూ రోడ్డుపై మీకు ఎదురు పడితే.. అసలు ఆ ఊహే అత్యద్భుతంగా మోస్ట్ కలర్ఫుల్ గా ఉంది కదా.. కానీ ఇది ఊహ కాదు.. నిజం.. ఈ విచిత్రం గుజరాత్ లో జరిగింది. గుజరాత్ లోని సూరత్ లో ప్రజలు రోడ్డుపై వజ్రాల వేటలో పడ్డారు. అదేంటి వజ్రాలంటే పొలాల్లో, ఖాళీ మైదానాల్లో వెతుకుతారు. అనంతపురంలో అయితే ప్రతీ ఏడాది ఎండాకాలం దాటి తొలకరి జల్లులు పడినప్పుడు రైతులు, మహిళలు పొలాలు, ఖాళీ మైదానాలలో వజ్రాల వేట చేస్తుంటారు. ఇది కామన్..కానీ నడిరోడ్డుపై వజ్రాల వేట ఏంటి? ఎలా దొరుకుతాయి అని ఆశ్చర్యపోకండి.
వజ్రాల గని సూరత్ (Diamonds)
సూరత్ లో వార్చా ఏరియాలోని మినీ బజార్ వజ్రాలకు ప్రసిద్ధి.. అక్కడ ఓ వ్యాపారి తీసుకెళుతున్న వజ్రాల ప్యాకెట్ పొరపాటున రోడ్డుపై పడి వజ్రాలన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయని ఓ వార్త దావానలంలా వ్యాపించింది. ఇంకేముంది క్షణాల్లో జనం ఆవజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. రోడ్డుపై పదుల సంఖ్యలో జనం ఏదో వెతుకుతూన్న బోలెడు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది అత్యాశపరులైతే రోడ్డుపై ఉన్న చెత్తా, చెదారాన్ని కూడా పోగేసీ ఇంటికి తీసుకెళ్లి అందులో వజ్రాలున్నాయేమోనని ఆశగా వెతికారు. అయితే కొందరు మాత్రం కొన్నివజ్రాలను తీసుకోగలిగారు. హమ్మయ్య.. వెతుకులాట ఫలించింది.. కల నెరవేరింది.
వజ్రాలు దొరికాయని సంబర పడ్డారు.. దొరకని వారు అయ్యో ఆ అదృష్టం మనకు దక్కలేదే అని నిరాశ పడ్డారు.. విచారం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఓ రెండు, మూడు గంటల పాటు ఈ వార్తతో సూరత్ మొత్తం అట్టుడికిపోయింది. వజ్రాలు(Diamonds) అందులోనూ, సూరత్ లాంటి నగరంలో రోడ్డుపై వజ్రాలు దొరకడమంటే మాటలా? కరక్టైన వజ్రం ఒక్కటి దొరికినా చాలు. లైఫ్ సెటిల్ అయినట్లే మరి..అందుకే జనం అంతలా ఎగబడ్డారు..కానీ వారి ప్రయత్నం వృథా ప్రయాస గానే మిగిలిపోయింది. అయితే వజ్రాలు దొరికాయని చంకలు గుద్దుకునున వారికి చేదు వార్త.. ఏంటంటే అవి ప్యూర్ డైమండ్స్ కావన్న వార్త చావు కబురులా చల్లగా తేలింది. అవన్నీ అమెరికన్ డైమండ్ వజ్రాలట.
అవి అసలు కాదు నకిలీ వజ్రాలు…
మరో వ్యక్తికి కూడా ఒక వజ్రం దొరికిందట రోడ్డుపై.. తళ తళ మెరిసిపోతున్న ఆవజ్రం చూసి మురిసిపోయిన ఆవ్యక్తి దానిని అత్యంత పదిలంగా షాపుకి తీసుకెళ్లి అమ్మే ప్రయత్నం చేశాడుట.అయితే అది డూప్లికేట్ వజ్రమని, అమెరికన్ డైమండేననీ తేలిందిట. పైగా అలాంటి వజ్రాలని శారీ వర్క్ లోనూ, ఇమిటేషన్ జ్యుయెలరీలోనూ వాడతారుట. ఆనోటా ఆనోటా విన్నదేమంటే ఎవరో కావాలనే ఈ సీన్ సృష్టించారని తేలింది. అమాయకులు కొందరు ఈ ఉచ్చులో పడి ఈ ఫన్నీ సీన్ తయారవడానికి కారణమయ్యారట.
ఈనెల 24న సూరత్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. సాధారణంగా సూరత్ వజ్రాల(Diamonds) వ్యాపారానికి పెట్టింది పేరు.. ప్రపంచం నలుమూలలనుంచి వజ్రాల వ్యాపారులు ఇక్కడకొచ్చి కావలసిన డైమండ్స్ కొని పట్టుకెళుతుంటారు.పెళ్లిళ్లు శుభకార్యాలకు బడా బాబులకు అయితే కోట్లల్లో ఆర్డర్లు వస్తుంటాయి. అలాగే సెలబ్రిటీలకు శారీస్, లెహంగాలపైనా డైమండ్ వర్క్ చేసి ఇస్తూంటారు.
https://twitter.com/KalpeshPraj80/status/1705842408704110611