PR
బ్యూటీ క్వీన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఏడడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుకలు ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. పంజాబీ సింగర్ నవరాజ్ హన్స్ లో సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిణీతి సీక్విన్డ్ పింక్ చీరలో, రాఘవ్ క్రీమ్ షేర్వానీ లో చూడ చక్కని జంటగా అందరిని నుంచి ప్రశంసలు అందుకున్నారు. చాలా కాలంగా ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము చివరకు మిస్టర్ అండ్ మిసెస్ గా మారాము… ఒకరు లేకుండా మరొకరం జీవించలేం అని క్యాప్షన్ తో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలు తన ఇన్ స్టాగ్రామ్ లో వారి పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. పరిణీతి, రాఘవ్ పెళ్లి వేడుకలు అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు కొనసాగింది.
ఈ మూడు ముళ్ల బంధంతో బాలీవుడ్ ట్రెండింగ్ కపుల్ గా మారారు. ఇక రాఘవ-పరిణీతి పెళ్లి కోసం దాదాపుగా 90 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని బాలీవుడ్ సమాచారం. ఫ్యామిలీలు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీరి పెళ్లికి హాజరయ్యారు. సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, ఢిల్లీ, పంజాబ్ సీఎం అరవింద్ క్రేజీవాల్, భగవంత్ మాన్ ల కొత్త జంటను ఆశీర్వదించారు. రిసెష్షన్ పార్టీని చండీగడ్, ఢిల్లీలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం వీరి వివాహ, సంగీత్, హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది.
హాజరు కాని ప్రియాంక చోప్రా-కరణ్ జోహార్ PR
పరిణీతి-రాఘవ్ ల పెళ్లి వేడుకలకు పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ విషయం బాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చెల్లి పెళ్లికి అక్క రాకపోవడానికి గల కారణాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రియాంక చోప్రా తన కుమార్తె మాలీ మేరీతో కలిసి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి హాజరవుతుందని నివేదికలు వచ్చాయి. అయితే ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ లో శుభాకాంక్షలతో సరిపెట్టడంతో ఆమె పెళ్లికి రావడం లేదని స్పష్టత వచ్చింది. అదే టైమ్ లో కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికా ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరికి మాత్రం ప్రియాంక హాజరైంది.
ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. చెల్లి పెళ్లి రాకుండా అక్కడకు వెళ్లడం ఎందుకు అని నెటిజన్లు ప్రియాంక తీరు పై మండిపడుతున్నారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ కూడా పరిణితి వివాహానికి హాజరుకాలేదు. కరణ్ జోహార్ పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయ్యాడని తీరా అనుకొని కారణాల వల్ల ఆగిపోయాడని టైమ్స్ మ్ నౌ కథనం చెబుతోంది.
నాడు క్లాస్ మేట్స్.. నేడు లైఫ్ మేట్స్
పరిణీతి చోప్రా,రాఘవ చద్దాల పరిచయం లండన్ లో ఏర్పడింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా కలిసి చదువుకున్నారు. అనంతరం వారి మధ్య పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లిగా మారింది. నెల్లాళ్లుగా ఫిలిం మ్యాగజైన్లలోనూ, వెబ్ సైట్లలోనూ, ఛానెళ్లలోనూ వీరి పెళ్లి వార్తలు మారు మోగాయి. ఇప్పుడిక పెళ్లితో ఈ వార్తలకు తెర పడినట్లే.